E-Paper
Advertisement

Horror Movie OTT : మార్చురీలో మతిపోగొట్టే పనులు… గుండెలదిరే సీన్స్… హర్రర్ మూవీ అంటే ఇలా ఉండాలి మావా

Horror Movie OTT : మార్చురీలో మతిపోగొట్టే పనులు… గుండెలదిరే సీన్స్… హర్రర్ మూవీ అంటే ఇలా ఉండాలి మావా
Advertisement

Horror Movie OTT : డిజిటల్ ప్లాట్ ఫాంలలో ఎన్నో సినిమాలు అందుబాటులో ఉన్నప్పటికీ, హార్రర్ సినిమాలకు ఇంకేవీ సాటిరావు. ఈ జానర్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ కు ఓటీటీలు వరంగా మారాయి. సాధారణంగా హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. ఇక ఓటీటీలో రకరకాల కథలతో ఉన్న హార్రర్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మీ గురించి చెప్పుకోబోతున్నాము. మరి ఈ మూవీని ఏ ఓటిటిలో చూడొచ్చు? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హర్రర్ మూవీ పేరు ‘ది నైట్ షిఫ్టర్’ (the nightshifter movie). 2018 లో రిలీజ్ అయిన బ్రెజిలియన్ సూపర్ నేచురల్ హర్రర్ మూవీ ఇది. డెన్నిసన్ రమాహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మార్చురీలో జరిగే భయంకరమైన సీన్స్ ను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. సౌ పాలోలోని ఒక బిగ్ సిటీ మార్చురిలో రాత్రి షిప్ట్ లో పని చేసే స్టెనియో అనే వ్యక్తిని ఈ సినిమాలో చూడొచ్చు. సస్పెన్స్ తో పాటు గుండె జారిపోయే హర్రర్ సీన్స్ కూడా ఇందులో ఉంటాయి. 2018లో ఫెంటాస్టిక్ ఫెస్ట్ లో ప్రీమియర్ అయిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఐఎండిబిలో ఈ సినిమాకు 5.7 రేటింగ్ ఉంది. దాదాపు ఒక గంట 42 నిమిషాల రన్ టైం ఉన్న ఈ మూవీని రాత్రి పూట చూస్తే థ్రిల్ పక్కా. ఇప్పటిదాకా ఈ మూవీని చూడకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హర్రర్ మూవీ లవర్స్ ను ఆకట్టుకున్న ఓ మంచి మూవీని మీరు మిస్ అయినట్టే. ఇక ఈ సినిమాలో డానియల్ డి వులివిరా స్టెనియో పాత్రలో అద్భుతంగా నటించాడు.

Advertisement

Also Read : వంటగది నుంచి వస్తువులు మాయం… కెమెరా రికార్డింగ్ చూస్తే మైండ్ బెండయ్యే ట్విస్ట్

కథలోకి వెళ్తే…

స్టెనియో సౌపాలోని ఒక మార్చురీలో పని చేస్తాడు. పైగా అతను నైట్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు అతని పర్సనల్ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది. భార్య తరచుగా అతన్ని అనుమానిస్తే, కొడుకు పొరపాటున కూడా గౌరవించడు. జాబ్ కూడా దయనీయంగా ఉంటుంది. ఇంతటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న స్టీనియోకి ఒక ప్రత్యేకమైన శక్తి కూడా ఉంటుంది. అతను చనిపోయిన వారితో మాట్లాడగలడు. మార్చురీకి వచ్చిన శవాలు అతనితో మాట్లాడి తమ సీక్రెట్స్, తీరని కోరికలను చెప్పుకుంటాయి. ముందు స్టెనో తనకున్న ఈ శక్తిని ఉపయోగించి చిన్నచిన్న సహాయాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఓ మహిళ కొడుకుకి మెసేజ్ ఇవ్వడం లాంటివి అతనికి సంతోషాన్ని ఇస్తాయి. కానీ అలా హెల్ప్ చేస్తున్నప్పుడు మరణించిన వారి సీక్రెట్స్ ను బయట పెట్టకూడదు అని నియమాన్ని అతను ఉల్లంఘిస్తాడు. ఇక్కడే కథ హర్రర్ టర్న్ తీసుకుంటుంది.

Advertisement

ఓ రోజు ఓ మాఫియా బాస్ చనిపోతాడు. చచ్చాక అతను తాను దాచిన డబ్బుకు సంబంధించిన సీక్రెట్ ని చెప్తాడు. దీంతో స్టెనియో ఆ డబ్బులు తీసుకుని తన కుటుంబాన్ని సంతోష పెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ తర్వాతే వెన్నులో వణుకు పుట్టే భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. చనిపోయిన ఆత్మలు కోపంతో స్టెనియో మీద దాడి చేస్తాయి. ముందు భ్రమలతో మొదలై, ఆ తర్వాత హర్రర్ సీన్స్ తో అతను జీవితం ఘోరంగా మారుతుంది. అతన్నే కాదు అతని భార్య కొడుకును కూడా దెయ్యాలు వదిలి పెట్టవు. అయితే అతను మాత్రం మాఫియా గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకుంటాడు. దీంతో పరిస్థితి మరింత దిగజారుతుంది. మరి ఇలాంటి దారుణమైన పరిస్థితిలో స్టెనియో ఏం చేశాడు ? దెయ్యాల నుంచి ఎలా తప్పించుకున్నాడు ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×