E-Paper
Advertisement

Horror movie OTT : ప్రమాదంలో పడే ప్రేమ జంట… ఫోటోగ్రాఫర్ కి చెమటలు పట్టించే దెయ్యం… వణుకు పుట్టించే థాయ్ హారర్

Horror movie OTT : ప్రమాదంలో పడే ప్రేమ జంట… ఫోటోగ్రాఫర్ కి చెమటలు పట్టించే దెయ్యం… వణుకు పుట్టించే థాయ్ హారర్
Advertisement

Horror movie OTT : ఓటీటీలోకి ఇండోనేషియన్ హారర్ చిత్రం స్ట్రీమింగ్ కి వచ్చింది. 1 గంట 29 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో ఆడియన్స్ కు వణుకు పుట్టించే సీన్స్ చాలానే ఉన్నాయి. ఒక ఫోటోగ్రాఫర్ తన ప్రియురాలితో కలసి రాత్రి వేళ కారులో వెళ్తుండగా ఒక మహిళను ఢీకొంటారు. ఆ సంఘటన తర్వాత స్టోరీ భయంకరమైన టర్న్ తీసు కుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియన్ హారర్ చిత్రం పేరు ‘షట్టర్’ (Shutter). హెర్విన్ నోవియాంటో దర్శకత్వంలో ఫాల్కన్ పిక్చర్స్ దీనిని నిర్మించింది. ఈ సినిమా 2004 నాటి అదే పేరుతో ఉన్న థాయ్ సినిమాకి రీమేక్ గా వచ్చింది. 2025 అక్టోబర్ 30న ఇండోనేషియాలో విడుదలైంది. వినో జి. బాస్టియన్ (డార్విన్), అన్యా గెరాల్డైన్ (షియా), నికెన్ అంజని (లిల్లీస్) ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 27 నుండి Netflix లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డార్విన్ తన ప్రియురాలు షియాతో కలిసి ఒక పార్టీ ముగించుకుని రాత్రి వేళ కారులో ఇంటికి వెళ్తుంటారు.
ఆ జర్నీలో అనుకోకుండా రోడ్డు మధ్యలో ఒక మహిళను కారుతో ఢీకొంటారు. భయపడిన డార్విన్, పోలీసులకు దొరికిపోతామనే ఉద్దేశంతో ఆమెకు సహాయం చేయకుండా, అక్కడ ఆగకుండా కారును వేగంగా పోనిస్తాడు. ఆ తరువాత ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిన డార్విన్, తన కెమెరాతో తీసిన ఫోటోలను డెవలప్ చేసినప్పుడు, వాటిలో ఒక తెల్లని మహిళ ఆకారం కనిపిస్తుంది.

అలాగే ప్రమాదం జరిగినప్పటి నుండి డార్విన్ విపరీతమైన మెడ నొప్పితో బాధపడుతుంటాడు. డాక్టర్లు పరీక్షించినా ఏమీ లేదని చెప్తారు. కానీ అతని బరువు సాధారణం కంటే రెండింతలు పెరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఆత్మ అతని భుజాలపై కూర్చుని ఉండటంతో బరువు అలా చూపిస్తుంది. ఇక ఆ ఆత్మ కేవలం ఫోటోలకే పరిమితం కాకుండా, నిజ జీవితంలోనూ అతన్ని తీవ్రంగా భయపెడుతుంది. అంతేకాకుండా

Advertisement

డార్విన్ స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా మరణిస్తుంటారు. షియాఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవాలని దర్యాప్తు చేయగా, ఆ ఆత్మ గతంలో అదే యూనివర్సిటీలో చదివిన లిల్లీస్ అనే అమ్మాయిదని తెలుస్తుంది. డార్విన్ గతంలో చేసిన ఒక పెద్ద తప్పు కారణంగానే ఆమె ఆత్మ వెంటాడుతోందని కనిపెడుతుంది. చివరికి డార్విన్ చేసిన తప్పు ఏమిటి ? ఆత్మ ఎందుకు వెంటాడుతోంది ? దీని నుంచి వీళ్ళు బయట పడతారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : సమాధిలో నుంచి వచ్చే శవాలు… పరుగులు పెట్టే ఊరి జనం… కేక పెట్టించే కామెడీ కూడా

Tags

Related News

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

Big Stories

Advertisement
×