E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఊహకు అందని క్లైమాక్స్ తో భయపెట్టించే హారర్ సినిమాలు… ఒక్కోటి ఒక్కో డైమండ్

ఊహకు అందని క్లైమాక్స్ తో భయపెట్టించే హారర్ సినిమాలు… ఒక్కోటి ఒక్కో డైమండ్
Advertisement

Horror Movies on OTT: సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, కొన్నిసార్లు అది మనల్ని కుదిపేస్తుంది. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ సినిమాల్లో చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో ఊహించలేనప్పుడు కలిగే కిక్ మామూలుగా ఉండదు. అలాంటి సినిమాల లిస్ట్ ఇప్పుడు మీముందుకు వచ్చేసింది. ఈ సినిమాల క్లైమాక్స్ చూస్తే మీకు వేయి వోల్ట్స్ కరెంట్ షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. ఇక్కడ మీరు తప్పక చూడాల్సిన 10 అద్భుతమైన క్లాసిక్ హారర్ సినిమాలు ఉన్నాయి. ఇవి ఎందులో అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

1. Psycho (1960)

ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సృష్టించిన ఈ మాస్టర్‌పీస్ హారర్ సినిమాలకు ఒక బాస్ లాంటిది. ఒక హోటల్ యజమాని, అతని తల్లి చుట్టూ తిరిగే ఈ కథలో చివరి ట్విస్ట్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. Amazon Prime Video, Apple TV లో ఇది రెంట్ కు అందుబాటులో ఉంది.

2. Sleepaway Camp (1983)

Advertisement

ఇది ఒక స్లాషర్ మూవీ. సమ్మర్ క్యాంప్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ సినిమా ముగింపు సీన్ చూస్తే వచ్చే వణుకు అంతా ఇంతా కాదు. హారర్ చరిత్రలోనే అత్యంత భయానకమైన క్లైమాక్స్‌లలో ఇది ఒకటి.
YouTube, Tubiలో ఇది అందుబాటులో ఉంది.

3. High Tension (2003)

ఇది ఫ్రెంచ్ హారర్ సినిమా. ఇద్దరు స్నేహితులు ఒక సైకో కిల్లర్ బారి నుండి ఎలా తప్పించుకున్నారనేది కథ. కానీ అసలు కిల్లర్ ఎవరు అనే విషయం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది.Amazon Prime Videoలో ఈ సినిమాను చూడచ్చు.

4. The Sixth Sense (1999)

Advertisement

“I see dead people” అనే డైలాగ్ ఎంత ఫేమసో, ఈ సినిమా క్లైమాక్స్ కూడా అంతే ఫేమస్. ఒక చిన్న పిల్లాడికి కనిపించే ఆత్మల వెనుక ఉన్న నిజాన్ని దర్శకుడు మనోజ్ నైట్ శ్యామలన్ అద్భుతంగా చూపించారు. Jio Hotstar లో ఇది అందుబాటులో ఉంది.

5. Friday the 13th (1980)

ఒక లేక్ వద్ద వరుస హత్యలు చేసే కిల్లర్ ఎవరో అని ఊహిస్తుంటే, చివరికి వచ్చే ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జేసన్ వూర్హీస్ పుట్టుకకు దారితీసిన అసలు కథ ఇది. Amazon Prime Video లో ఇది అద్దెకు అందుబాటులో ఉంది.

6. Se7en (1995)

ఏడు రకాల పాపాలు చేసే వారిని చంపే ఒక సీరియల్ కిల్లర్ కోసం ఇద్దరు డిటెక్టివ్స్ చేసే వేట. క్లైమాక్స్‌లో వచ్చే సీన్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి గా నిలిచిపోయింది. ఇది Netflix / Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

7. The Wicker Man (1973)

మత విశ్వాసాలు, వింత ఆచారాల నేపథ్యంలో సాగే సినిమా. ఒక మిస్సింగ్ గర్ల్ కోసం వెతికే పోలీస్ ఆఫీసర్ కి ఎదురయ్యే అనుభవం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. Apple TV, Amazon Primeలో దీనిని రెంట్ కు తీసుకోవచ్చు.

8. Don’t Look Now (1973)

తమ బిడ్డను కోల్పోయిన దంపతులు వెనిస్ వెళ్తారు. అక్కడ వాళ్ళకు ఎదురయ్యే వింత అనుభవాలు, చివరికి క్లైమాక్స్‌లో కనిపించే ఆ ఎర్రటి కోటు వేసుకున్న ఆకారం మర్చిపోలేం. MUBIలో దీనిని చూడచ్చు.

9. The Mist (2007)

ఒక వింత పొగమంచు పట్టణాన్ని కమ్మేస్తుంది. అందులో భయంకరమైన జీవులు ఉంటాయి. కానీ ఈ సినిమా ముగింపు చూశాక, దీని కంటే ఆ జీవుల చేతిలో చనిపోవడం బెటర్ అనిపిస్తుంది. అత్యంత బాధాకరమైన క్లైమాక్స్ ఇది. Amazon Prime Videoలో ఇది అందుబాటులో ఉంది.

10. Scream (1996)

హారర్ సినిమాల రూల్స్ ని బ్రేక్ చేస్తూ వచ్చిన సినిమా ఇది. ముసుగు వేసుకున్న కిల్లర్ ఎవరు అనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగుతుంది. Jio hotstar , Apple TVలో ఇది అందుబాటులో ఉంది.

ఈ సినిమాలు కేవలం రక్తం, చావులు మాత్రమే కాదు, మనిషి మెదడుతో ఆడుకునే సైకలాజికల్ అంశాలను కూడా ఉంటాయి. మీరు ఇప్పటికీ వీటిని చూడకపోతే, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. అరరె ఇలాంటి సినిమాలు మిస్ చేసామా అనిపిస్తుంది.

Read Also : బ్లాక్ మెయిల్ ఉచ్చులో వయ్యారి భామ… ఆటాడేసుకునే అపరిచితుడు… మైండ్ గల్లంతయ్యే క్లైమాక్స్

Tags

Related News

అన్నతో అలాంటి పని… బుర్రపాడు రొమాంటిక్ మూవీ

అఘాయిత్యం చేశాడని పార్ట్స్ కట్ చేసి కాకుల కేసే అమ్మాయి… బ్రూటల్ రివేంజ్ డ్రామా

పీక్ యాక్షన్ సీన్స్… రా అండ్ రస్టిక్ స్టోరీ… మామూలు రివేంజ్ కాదు మావా

తలలు తెగిపడే శవాలు… పోలీసులకు చెమటలు పట్టించే సైకో కిల్లర్

వీళ్ళు పిల్లలు కాదు బాబోయ్ పిశాచాలు… కమ్యూనిటీలోకి వెళ్ళే బేబీసిట్టర్లు మాయం

దారిద్రాన్ని పాకెట్లో పెట్టుకుని తిరిగే హీరో… ట్విస్టులతో పిచ్చెక్కించే స్పోర్ట్స్ డ్రామా

ఏకంగా ఐలాండ్ కే శాపం… దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా ఉండే ఒక్కో ఎపిసోడ్

బాబోయ్ ఇదేం స్టోరీ ? ఈ కాలేజీలో అడుగు పెడితే ఖతం… ఒంటరిగా చూడాల్సిన హర్రర్ మూవీ

Big Stories

×