E-Paper
Advertisement

వాంపైర్ల మధ్య సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీ… ఓటీటీలో టాప్ ట్రెండింగ్ అవుతున్న నెక్స్ట్ లెవెల్ హారర్

వాంపైర్ల మధ్య సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీ… ఓటీటీలో టాప్ ట్రెండింగ్ అవుతున్న నెక్స్ట్ లెవెల్ హారర్
Advertisement

Horror Series on OTT : దెయ్యాల సినిమాలు, సిరీస్‌ లు ఆడియన్స్ ను రకరకాలుగా భయపెడుతుంటాయి. అయితే వీటికి ఏమాత్రం తీసిపోవు వాంపైర్ స్టోరీలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ భయపెట్టడమే కాకుండా, వాంపైర్ల క్రూరత్వాన్ని చాలా డీప్ గా చూపిస్తారు. ఇది చిన్న పిల్లలు చూసే సిరీస్ అయితే అస్సలు కాదు, ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన కంటెంట్. ఎందుకంటే ఇందులో భయానక హత్యలు, బూతులు, అడల్ట్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వాంపైర్లకు అమరత్వం వస్తే ఎలా మారిపోతాయనేది ఈ సిరీస్‌లో చాలా స్టైలిష్‌గా ప్రెసెంట్ చేశారు. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

2022లో వచ్చిన ఈ హారర్ సిరీస్ పేరు ‘ఇంటర్వ్యూ విత్ ది వాంపైర్’ (Interview with the Vampire). ఏఎమ్‌సి నిర్మించిన ఈ హారర్ టెలివిజన్ సిరీస్ ను మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో చూడవచ్చు. ఈ సిరీస్ మొదటి రెండు సీజన్లు విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకున్నాయి. ప్రస్తుతం దీని మూడప సీజన్ “ది వాంపైర్ లెస్టాట్” (The Vampire Lestat) అనే పేరుతో రాబోతోంది. ఈ సరికొత్త సీజన్ 2026 జూన్ 7న ఏఎమ్‌సి (AMC) ఛానల్‌లో విడుదల కానుంది. జాకబ్ ఆండర్సన్, సామ్ రీడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్, వాంపైర్ జోనర్‌లోనే ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇంటర్వ్యూ విత్ ది వాంపైర్ కథ అంతా లూయిస్ అనే ఒక వాంపైర్ చుట్టూ తిరుగుతుంది. 2022లో దుబాయ్‌లో ఉన్న లూయిస్, డానియల్ అనే ఒక జర్నలిస్ట్‌ను పిలిపించి తన జీవితంలో జరిగిన అసలు నిజాలను ఇంటర్వ్యూ రూపంలో చెప్తాడు. కథ ఫ్లాష్‌బ్యాక్‌లో 1910 నాటి న్యూ ఓర్లియన్స్ నగరానికి వెళ్తుంది. అక్కడ లూయిస్ ఒక పెద్ద బిజినెస్‌మెన్‌గా ఉంటూ, తన ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాడు. ఆ టైమ్‌లోనే అతనికి లెస్టాట్ అనే ఒక విచిత్రమైన, పవర్‌ఫుల్ ఫ్రెంచ్ వాంపైర్ పరిచయమవుతాడు. లూయిస్ పర్సనాలిటీ నచ్చి, లెస్టాట్ అతన్ని కూడా తనలాగే ఒక వాంపైర్‌గా మార్చేస్తాడు. ఆ తర్వాత లూయిస్ రక్తం తాగుతూ, చావో బతుకో తెలియని ఒక వింత జీవితాన్ని గడపాల్సి వస్తుంది.

వాంపైర్‌గా మారిన లూయిస్‌కు, లెస్టాట్‌కు మధ్య చాలా గొడవలు నడుస్తాయి. ఈ లోపు వాళ్లిద్దరూ కలిసి క్లాడియా అనే ఒక చిన్న అమ్మాయి ప్రాణాలను కాపాడి, ఆమెను కూడా వాంపైర్‌గా మారుస్తారు. వాళ్లు ముగ్గురు ఒక ఫ్యామిలీలా కలిసి ఉంటారు. అయితే క్లాడియాకు వయసు పెరిగినా శరీరం మాత్రం చిన్న పిల్లలాగే ఉండిపోవడంతో ఆమెకు పిచ్చెక్కిపోతుంది. లెస్టాట్ చేసే టార్చర్‌ను భరించలేక లూయిస్, క్లాడియా కలిసి అతనిపై ఎదురుదాడి చేసి అక్కడి నుండి పారిపోతారు. ఆ తర్వాత వాళ్లు పారిస్ వెళ్లి అక్కడ వేరే వాంపైర్లను కలుస్తారు. అక్కడ ఏం జరిగింది ? అసలు లెస్టాట్ ఏమయ్యాడు ? లూయిస్ దుబాయ్ వరకు ఎలా వచ్చాడు ? అనేదే మిగతా ఇంట్రెస్టింగ్ స్టోరీ.

Advertisement

Read Also : ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణాన్ని బట్టబయలు చేసే పవర్‌ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

వచ్చేవారం నెట్ ఫ్లిక్స్ లో 3 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్!

Big Stories

Advertisement
×