E-Paper
Advertisement

ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణాన్ని బట్టబయలు చేసే పవర్‌ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

ప్రభుత్వ ఉద్యోగాల కుంభకోణాన్ని బట్టబయలు చేసే పవర్‌ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్… ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

Crime Thriller Series on OTT : ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు జరగడం మామూలే. అయితే వీటి వెనుక జరిగే స్కామ్స్ తో సామాన్యుల జీవితాలు మాత్రం చిన్నాభిన్నం అవుతుంటాయి. ఇప్పటికే సివిల్‌ సర్వీస్‌, గ్రూపు-1, గ్రూపు-2 వంటి పోటీ పరీక్షల వెనుక జరిగిన స్కామ్‌లను మనం చాలానే చూశాం. ఎంతో మంది దొడ్డిదారిన ఉన్నత ఉద్యోగాల్లో పదవులు వెలగబెడుతున్నారు ఇప్పటికీ. దొరికిన వాడు దొంగ, దొరక్కపోతే దొర అన్నట్లు ఉంది ఈ వ్యవహారం. ఈ అంశాల నేపథ్యంలో ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రేపటినుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. ఇందులో చాలా కాలం తరువాత అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. దీని పేరు ? ఏ ఓటీటీలోకి వస్తోంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ఎగ్జామ్’ (Exam). దుషార విజయన్, అదితి బాలన్, అబ్బాస్, నరేన్ మణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు జాతీయ అవార్డు గ్రహీత ఎ సర్కుణం దర్శకత్వం వహించారు. ఇది ఈ నెల 15 నుంచి ప్రైమ్ వీడియో లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్‌ సిరీస్‌ మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందించారు. వాల్‌ వాచర్‌ ఫిల్మ్‌ పతాకంపై పుష్కర్‌, గాయత్రి కలసి దీనిని నిర్మించారు. ఇందులో ఒకప్పటి లవర్ బాయ్, సీనియర్ నటుడు అబ్బాస్ ఈ సిరీస్ ద్వారా చాలా కాలం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పైకి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథ ఒక అందమైన హిల్ స్టేషన్ అయిన ‘థైకారా’ నేపథ్యంలో సాగుతుంది. అక్కడ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాలు భారీ ఎత్తున లీక్ అవుతాయి. ఈ కుంభకోణం వెనుక ఒక క్రూరమైన నేరస్థుల ముఠా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ పేపర్ లీక్ ముఠాను, వాళ్ళ వెనుక ఉన్న అవినీతి రాజకీయ నాయకులను పట్టుకోవడమే ఈ సిరీస్ ముఖ్య కథాంశం. ఈ నేరాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ‘ఝాన్సీ’ (దుషారా విజయన్) అనే ఒక ధైర్యవంతురాలైన యువతి రంగంలోకి దిగుతుంది. ఆమె ఒక నకిలీ పోలీసు గుర్తింపును సృష్టించుకుని, ప్రాణాలకు తెగించి ఆ ప్రమాదకరమైన నేరస్థుల నెట్‌వర్క్‌లోకి రహస్యంగా వెళ్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో అపాయాలు ఎదురవుతాయి. చివరికి ఆ అవినీతి సామ్రాజ్యాన్ని ఆమె ఎలా బద్దలు కొట్టిందనే ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేషన్‌తో ఈ ఏడు ఎపిసోడ్‌ల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సాగుతుంది.

Read Also : ఇంటి కింద గుట్టలుగా పడి ఉన్న శవాలు… ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ట్రూ క్రైమ్ వెబ్ సిరీస్

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×