E-Paper
Advertisement

15 మందిని బలితీసుకున్న రాత్రి… హెల్ హౌస్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలు… ఓటీటీలో వణికిస్తున్న సినిమా

15 మందిని బలితీసుకున్న రాత్రి… హెల్ హౌస్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలు… ఓటీటీలో వణికిస్తున్న సినిమా
Advertisement

Horror Thriller Movie on OTT : దెయ్యాల సినిమాలు ఓటీటీలో బోలెడు ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు భయం పుట్టిస్తూ బీభత్సం సృష్టిస్తాయి. ఇప్పుడు మనం అలాంటి హారర్ మూవీ గురించే చెప్పుకోబోతున్నాం. ఇది ఇప్పటివరకు నాలుగు భాగాలుగా వచ్చింది. ఒక హాంటెడ్ హౌస్ చుట్టూ సాగే ఈ కథ నిజంగానే వణికించేస్తుంది. ఆ హోటల్ లోపల జరుగుతున్న దారుణాలన్నీ మన కళ్ళ ముందే నిజంగా జరుగుతున్నాయేమో అన్నట్టు భయం పుట్టిస్తాడు డైరెక్టర్. ఇందులో దెయ్యాలు డిస్కో డాన్సులు చేయవు కానీ, ఆ నిశ్శబ్దంలో వచ్చే శబ్దాలు, ఆ మనుషుల అరుపులు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉన్న ఆ జోకర్ బొమ్మలు ఉన్నాయే.. అవి చేసే రచ్చ మామూలుగా ఉండదు. అవి ఒకచోట పెడితే ఇంకోచోట కనిపిస్తుంటాయి, మెల్లగా మన వైపు చూస్తున్నట్టు తిరుగుతాయి. గుండె ధైర్యం ఉన్నవాళ్లే ఈ సినిమాను చీకట్లో ఒంటరిగా చూడగలరు, లేదంటే ఆ రాత్రి నిద్రపోవడం కష్టమే మరి. దీని పేరు ? ఏ ఓటీటీలో చూడచ్చు అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు “హెల్ హౌస్ ఎల్‌ఎల్‌సి” (Hell House LLC). 2015లో వచ్చిన ఈ సినిమా “ఫౌండ్ ఫుటేజ్” (Found Footage) శైలిలో రూపొందింది. ఈ సినిమాను స్టెఫెన్ కాగ్నెట్టి అనే దర్శకుడు తెరకెక్కించగా, ఇందులో ర్యాన్ జెన్నిఫర్, డానీ బెల్లిని, గోర్ యాబ్లాన్, ఆడమ్ ష్నైడర్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ స్టెఫెన్ కాగ్నెట్టి కేవలం 25,000 డాలర్ల (దాదాపు 20 లక్షల రూపాయలు) అతి తక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. సినిమాలో మనం చూసే ఆ భయంకరమైన హోటల్ నిజానికి పెన్సిల్వేనియాలో ఉన్న వాల్డోర్ఫ్ హోటల్. ఇది నిజంగానే ఒక హాంటెడ్ అట్రాక్షన్ ప్లేస్. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వల్ల దీనికి వరుసగా నాలుగు భాగాలు వచ్చాయి. మొదటి మూడు సినిమాలు ‘అబద్దాన్ హోటల్’ చుట్టూ తిరిగితే, 2023లో వచ్చిన ‘ది కార్మైకేల్ మేనర్’ కథను మరో కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాల్లో ఎక్కడా భారీ గ్రాఫిక్స్ వాడకుండా, కేవలం సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా యాంగిల్స్‌తోనే భయాన్ని పుట్టిస్తారు. అందుకే హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘హెల్ హౌస్’ సిరీస్ ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ‘ప్లెక్స్’ (Plex)ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఐదుగురు కుర్రాళ్లు కలిసి ఏదో ఒక బిజినెస్ చేసి పైసలు సంపాదించాలని ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలో న్యూయార్క్‌లో పాడుబడిపోయిన ఒక పాత హోటల్‌ను అద్దెకు తీసుకుంటారు. దాన్ని ఒక ‘దెయ్యాల కొంప’ (Haunted House) లాగా రెడీ చేసి, జనాన్ని భయపెట్టి టికెట్లు అమ్ముకోవాలని వాళ్ళ ప్లాన్. కానీ ఆ హోటల్‌కు ఒక బ్యాడ్ హిస్టరీ ఉంటుంది. వీళ్ళు లోపల సామాన్లు సర్దుతుంటే, అక్కడ ఉన్న జోకర్ బొమ్మలు వాటంతట అవే కదలడం, రాత్రి పూట వింత శబ్దాలు రావడం మొదలవుతాయి. ఒకడైతే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది, వెళ్ళిపోదాం పదండిరా అని మొత్తుకున్నా, మిగిలినోళ్లు వినకుండా అంతా మన భ్రమ అని లైట్ తీసుకుంటారు.

అయితే గ్రాండ్ ఓపెనింగ్ రోజు రానే వస్తుంది. ఊర్లో ఉన్న జనం అంతా ఆ షో చూడటానికి ఎగబడతారు. లోపల లైట్లు డిమ్ చేసి, భయంకరమైన మ్యూజిక్ వేసి షో నడిపిస్తుంటారు. సరిగ్గా అదే టైమ్‌లో సీన్ రివర్స్ అవుతుంది. గారడీ అనుకున్నది కాస్తా గండంలా మారుతుంది. లోపల నిజమైన దెయ్యాలు ఎంట్రీ ఇచ్చి నానా బీభత్సం చేస్తాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 15 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పోలీసులు వచ్చినా, అది ఒక యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేస్తారు. కానీ అసలు కథ అక్కడ మొదలవుతుంది. కొన్ని ఏళ్ల తర్వాత ఒక డాక్యుమెంటరీ టీమ్ ఆ హోటల్ లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలని లోపలికి వెళ్తుంది. ఆ ప్రమాదం జరిగినప్పుడు రికార్డ్ అయిన ఒక ఒరిజినల్ వీడియో ఫుటేజ్ బయటపడుతుంది. ఆ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులో ఆ జోకర్ బొమ్మలు చేసే పనులు, ఆ చీకట్లో కనిపించే ఆకారాలు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఆ తరువాత ఈ టీంకు లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Read Also : జాంబి ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన కొరియన్ సినిమాలు… చూస్తే గుండె గల్లంతే

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×