E-Paper
Advertisement

జాంబి ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన కొరియన్ సినిమాలు… చూస్తే గుండె గల్లంతే

జాంబి ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన కొరియన్ సినిమాలు… చూస్తే గుండె గల్లంతే
Advertisement

Best Korean zombie movies on OTT : హారర్ సినిమాలంటే ఒకప్పుడు కేవలం దెయ్యాలు, ఆత్మలు మాత్రమే ఉండేవి. కానీ, గత దశాబ్ద కాలంలో ‘జాంబీ’ జోనర్ ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ముఖ్యంగా కొరియన్ చిత్ర పరిశ్రమ ఈ జోనర్‌లో తనదైన ముద్ర వేసింది. కేవలం భయం మాత్రమే కాకుండా, ఎమోషన్స్, సోషల్ మెసేజ్‌ను జోడించి కొరియన్లు తీసే జాంబీ సినిమాలు చూస్తే గుండె గల్లంతవ్వాల్సిందే. ప్రస్తుతం ఓటీటీలో దడ పుట్టిస్తున్న ఆ టాప్ సినిమాలపై ఓ లుక్కేద్దాం.

1. ట్రైన్ టు బుసాన్ (Train to Busan – 2016)

జాంబీ సినిమాల గురించి మాట్లాడుకుంటే మొదటగా గుర్తుకు వచ్చే పేరు ‘ట్రైన్ టు బుసాన్’. ఒక తండ్రి, తన కూతురిని తీసుకుని రైలులో ప్రయాణిస్తుండగా వైరస్ వ్యాప్తి చెంది ప్రయాణికులందరూ జాంబీలుగా మారిపోతారు. గమ్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు చేసే పోరాటం, తండ్రి పడే ఆరాటం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఇది భయపెట్టే మూవీ త్రమే కాదు, గుండెల్ని పిండేసే ఎమోషన్ కూడా.
Amazon Prime Video, Zee5లో దీనిని చూడవచ్చు.

2. ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ (All of Us Are Dead) 

Advertisement

ఒక హైస్కూల్‌లో వైరస్ మొదలైతే, అక్కడి విద్యార్థులు తమను తాము ఎలా కాపాడుకున్నారనే కథాంశంతో ఇది వచ్చింది. ఈ సిరీస్ గ్లోబల్ హిట్ అయ్యింది. స్కూల్ బెంచీలు, క్లాస్ రూమ్స్ మధ్య జరిగే జాంబీ అటాక్స్ చాలా కొత్తగా, ఉత్కంఠభరితంగా ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ లో దీనిని చూడచ్చు.

3. పెనిన్సులా (Peninsula – 2020)

ఇది ‘ట్రైన్ టు బుసాన్’కు సీక్వెల్. ఒక సిటీ మొత్తం జాంబీలతో నిండిపోయి ఉంటుంది. ఆ తర్వాత, ఒక మిషన్ కోసం తిరిగి ఆ సిటీకి వెళ్ళిన కొంతమంది సైనికులు అక్కడ ఎదుర్కొన్న సవాళ్లే ఈ సినిమా. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఇందులో హైలైట్. Amazon Prime Video, Zee5లో ఇది అందుబాటులో ఉంది.

4. హ్యాపీనెస్ (Happiness – 2021)

Advertisement

పేరులో హ్యాపీనెస్ ఉన్నా, ఈ సిరీస్ ఇచ్చే టెన్షన్ మామూలుగా ఉండదు. ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఒక కొత్త రకం ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, ప్రజలు ఒకరినొకరు ఎలా అనుమానించుకుంటారు, మనుషుల్లోని క్రూరత్వం జాంబీస్ కంటే ప్రమాదకరంగా ఎలా మారుతుందనేది ఇందులో చూడొచ్చు. Netflix, Vikiలో దీనిని చూడచ్చు.

5. స్వీట్ హోమ్ (Sweet Home – 2020-2024)

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్ ఇది. ఇందులో మనుషులు కేవలం జాంబీలుగానే కాదు, వారిలోని కోరికల ఆధారంగా వింత వింత రాక్షసులుగా మారుతారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్, మేకప్ అదిరిపోతాయి. Netflix (నెట్‌ఫ్లిక్స్)లో దీనిని చూడచ్చు.

6. ది వైలింగ్ (The Wailing – 2016)

ఇది ప్యూర్ జాంబీ మూవీ కాదు, కానీ హారర్, షామానిజం, వైరస్‌ల కలయికతో ఇది రూపొందింది. ఒక గ్రామంలో వింత మరణాలు సంభవించినప్పుడు జరిగే ఇన్వెస్టిగేషన్ మీకు నిద్ర లేకుండా చేస్తుంది. Amazon Prime Videoలో ఇది అందుబాటులో ఉంది.

Read Also : పెళ్లి వద్దు… మా ఇంటికి ఆడోళ్లే వద్దనే ముగ్గురన్నదమ్ములు… ఓటీటీలో నవ్వించి చంపేస్తున్న కామెడీ సినిమా

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×