E-Paper
Advertisement

Horror thriller OTT: జోంబీలుగా మారే శవాలు… పరుగులు పెట్టే జనం… జడిపిస్తున్న హారర్ థ్రిల్లర్

Horror thriller OTT: జోంబీలుగా మారే శవాలు… పరుగులు పెట్టే జనం… జడిపిస్తున్న హారర్ థ్రిల్లర్
Advertisement

Horror thriller OTT : జోంబీ సినిమాలంటేనే బీభత్సం ఓ రేంజ్ లో ఉంటుంది. ఇలాంటి సినిమాలలో ఒళ్లు జలదరించే సీన్స్ కూడా చాలానే ఉంటాయి. రీసెంట్ గా వచ్చిన ఒక జోంబీ మూవీ ఆడియన్స్ ను బాగానే భయపెట్టింది. ఈ సినిమాను ఆస్ట్రేలియాలోని అల్బానీ ప్రాంతంలో చిత్రీకరించారు. ఒక సైనిక ప్రమాదం తర్వాత, తన భర్త ఆచూకీ కోసం వెతుకుతున్న అవా (డైసీ రిడ్లీ) అనే మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో చచ్చిన శవాలు జోంబీలుగా మారి వణుకు పుట్టిస్తుంటాయి. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ ఆస్ట్రేలియన్ జోంబీ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వీ బరీ ది డెడ్’ (We Bury the Dead). దీనికి జాక్ హిల్డిచ్ రచించి దర్శకత్వం వహించారు. ఇందులో హాలీవుడ్ నటి డైసీ రిడ్లీ ప్రధాన పాత్రలో నటించగా, మార్క్ కోల్స్ స్మిత్, బ్రెంటన్ త్వైట్స్ ముఖ్య పాత్రల్లో నటించారు. 2024లో ఈ సినిమా అడిలైడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ఇది 2026 జనవరి 2 నుంచి థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియో (prime video)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

టాస్మేనియాలో ఒక మిలిటరీ ప్రయోగం అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఊరికి ఊరే నాశనమైపోతుంది. ఆ గందరగోళంలో అవా (డైసీ రిడ్లీ) మొగుడు కనిపించకుండా పోతాడు. అతను ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అవా శవాలను వెతికి తీసే ఒక టీమ్‌లో చేరుతుంది. అక్కడ వేల సంఖ్యలో ఉన్న బాడీలను వెతుకుతూ, తన భర్త కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. చనిపోయిన ఆ శవాలన్నీ ఒక్కొక్కటిగా మళ్ళీ బ్రతకడం మొదలవుతాయి. అవి మామూలు మనుషుల్లా కాకుండా చాలా క్రూరంగా మారి ఎదురుగా ఉన్న వాళ్లపై దాడి చేస్తుంటాయి. ఒక పక్క భర్త కోసం వెతుకులాట, మరో పక్క ప్రాణాలు తీయడానికి వస్తున్న శవాలు.. వీటి మధ్య అవా ఎలా సర్వైవ్ అయిందనేదే ఈ హారర్ థ్రిల్లింగ్ స్టోరీ.

Read Also : రాత్రయితే భార్యతో సైకోలా మారే భర్త … పని మనిషితో రెచ్చిపోయి… మైండ్ బ్లాక్ చేసే క్లైమాక్స్

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×