E-Paper
Advertisement

OnePlus Discount: 80W ఛార్జింగ్, 50MP డ్యుయర్ కెమెరాగల వన్‌ప్లస్ ఫోన్‌పై రూ.10000 తగ్గింపు.. ఆఫర్ ఎక్కడంటే

OnePlus Discount: 80W ఛార్జింగ్, 50MP డ్యుయర్ కెమెరాగల వన్‌ప్లస్ ఫోన్‌పై రూ.10000 తగ్గింపు.. ఆఫర్ ఎక్కడంటే
Advertisement

OnePlus Discount| వన్‌ప్లస్ పాపులర్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్13s కొనాలనుకునేవారికి ఇప్పుడు చాలా మంచి సమయం. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఇప్పుడు అతి తక్కువ ధరలో దొరుకుతోంది. ఒరిజినల్ ధర రూ.57,999. ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో రూ.50,999కే అందుబాటులో ఉంది. అంటే డైరెక్ట్ రూ.7,000 డిస్కౌంట్. బ్యాంక్ ఆఫర్‌తో కలిపి మొత్తం రూ.10,000 ఆదా అవుతుంది. ఈ ఆఫర్ వన్‌ప్లస్ అధికారిక సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

బ్యాంక్ ఆఫర్‌తో ఎక్స్‌ట్రా సేవింగ్స్

HDFC క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే EMIలపై రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ కూడా వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లోనే వర్తిస్తుంది. డైరెక్ట్ డిస్కౌంట్ + బ్యాంక్ ఆఫర్ కలిపి మొత్తం రూ.10,000 తగ్గుతుంది. అందుకే ఎఫెక్టివ్ ధర రూ.48,999కి తగ్గుతుంది. ప్రీమియం సెగ్మెంట్ ఫోన్‌కు ఇది చాలా ఆకర్షణీయ ధర.

డిస్‌ప్లే, డిజైన్

Advertisement

వన్‌ప్లస్ 13sలో 6.32 ఇంచ్ LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1216 x 2640 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 1,600 నిట్స్ వరకు ఉంటుంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. స్క్రాచ్‌లకు బాగా నిరోధకత ఉంటుంది. ఫోన్ సైజు 15.08 x 7.17 x 0.82 cm. IP65 రేటింగ్ ఉండటం వల్ల ధుమ్ము, నీటి చినుకుల నుంచి ప్రొటెక్షన్ ఫీచర్ ఉంది.

పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. 3nm టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఫాస్ట్, ఎఫిషియెంట్ పనితీరు ఇస్తుంది. 12GB RAM స్టాండర్డ్‌గా ఉంటుంది. స్టోరేజ్ 512GB వరకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 15తో OxygenOS 15 ఇంటర్‌ఫేస్ ఉంది. స్మూత్, క్లీన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

డ్యూయల్ 50MP కెమెరా సెటప్

Advertisement

ఫోన్ వెనక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP సోనీ LYT-700 సెన్సార్. OIS + EIS స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 50MP టెలిఫోటో కెమెరా (శాంసంగ్ JN5 సెన్సార్) ఉంది. 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. షార్ప్, డీటెయిల్డ్ ఫోటోలు తీస్తుంది. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సోషల్ మీడియా ఫోటోలకు బాగా సరిపోతుంది.

Also Read: ఆపిల్ కంపెనీలో పనిచేసే భారతీయుడికి రూ.200 కోట్లకు పైగా వేతనం.. సిఈఓ సాలరీ ఎంతో తెలుసా?

పెద్ద బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్

5,850mAh పెద్ద బ్యాటరీ ఉంది. హెవీ యూజ్‌తో కూడా రోజంతా సులభంగా రన్ అవుతుంది. 80W SUPERVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. త్వరగా ఛార్జ్ అవుతుంది. బిజీ యూజర్లకు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వన్‌ప్లస్ 13s ఇప్పుడు గొప్ప వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయింది. ఫ్లాగ్‌షిప్ లెవల్ పెర్ఫామెన్స్, డ్యూయల్ 50MP కెమెరాలు, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తం రూ.10,000 సేవింగ్స్‌తో ప్రీమియం ఫీచర్లు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఈ ఆఫర్ మిస్ చేయకండి.

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×