E-Paper
Advertisement

ఆమె చూపు పడితే నాశనమే… ప్రేమిస్తే చావు మేళం పక్కా… భయపెడుతున్న హారర్ మూవీ

ఆమె చూపు పడితే నాశనమే… ప్రేమిస్తే చావు మేళం పక్కా… భయపెడుతున్న హారర్ మూవీ
Advertisement

Horror Thriller OTT : ఇండొనేషియన్ హారర్ సినిమాలు ప్రేక్షకులకు ప్యాంట్లు తడిపించేస్తాయి. ఇక్కడి నుంచి పాతకాలపు చేతబడులు, మూఢనమ్మకాలు, క్షుద్ర శక్తుల చుట్టూ తిరిగే కథలే ఎక్కువగా వస్తుంటాయి. గత ఏడాది పక్కా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే భయంకరమైన హారర్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో కేకలు పెట్టించింది. ఈ సినిమాలో రక్తం చిందే సీన్లు, ఒళ్ళు గగుర్ పొడిచే దృశ్యాలు కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి, ఇది కేవలం ధైర్యం ఉన్న పెద్దవాళ్లు మాత్రమే చూడాల్సిన సినిమా.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ ఇండోనేషియా హారర్ మూవీ పేరు ‘పెరుంపన్ పంబవా సియాల్’ (Perempuan Pembawa Sial). ఈ సినిమాను ఇండోనేషియాలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన IDN పిక్చర్స్ నిర్మించింది. దర్శకుడు ఫజర్ నుగ్రోస్ సాధారణంగా ప్రేమకథలు, కామెడీ సినిమాలు తీస్తుంటారు. కానీ మొదటిసారిగా పూర్తిస్థాయి హారర్ జోనర్‌లోకి అడుగుపెట్టి ఈ సినిమాను రూపొందించారు. హీరోయిన్ రాయహానున్ ఇండోనేషియాలో జాతీయ అవార్డు గ్రహీత, ఆమె తన నటనతో ఈ భయంకరమైన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. 97 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో రక్తపాతం ఎక్కువగానే ఉంటుంది. దీనికి 17+ (పెద్దలకు మాత్రమే) సెన్సార్ రేటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది 2025 సెప్టెంబర్ 18 ఇండోనేషియాలో విడుదలై సూపర్ హిట్ అయింది. అయితే ఇది ఏ ఓటీటీలోకి వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఎక్కువగా ఇండోనేషియన్ సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంటాయి. తొందరలోనే ఆ ఓటీటీలోకి వచ్చే అవకాశం అయితే ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక మారుమూల ఊళ్ళో మిరా అనే అమ్మాయి ఉంటుంది. ఆ పిల్ల చూడటానికి చాలా బాగుంటుంది కానీ, ఊర్లో అందరూ ఆమెను ‘శని తగిలిన పడతి’ అని పిలుస్తుంటారు. ఎందుకంటే, ఆమెను ప్రేమించినా లేదా ఆమెతో స్నేహం చేసినా ఆ మగాళ్లకి ఏదో ఒక పెద్ద దెబ్బ తగిలి చచ్చిపోవడమో లేదా అంగవైకల్యం రావడమో జరుగుతుంది. దీంతో ఊరంతా కలిసి ఆ పిల్లని వెలివేసి, దూరంగా పెట్టేస్తారు. తను రాకరాక ఊర్లోకి వచ్చినా సరే అందరూ అపశకునంగా భావించి తిట్టుకుంటారు.

అలాంటి టైంలో బాణా అనే ఒక కుర్రాడు ఆ ఊరికి వస్తాడు. అతను ఒక చిన్న హోటల్ పెట్టుకుని బతుకుతుంటాడు. అందరూ మిరా గురించి భయం భయంగా చెబుతున్నా, అతను మాత్రం అవన్నీ నమ్మడు. అదంతా వట్టి భ్రమ, ఆ పిల్లలో ఏ దోషం లేదని ఆమెకు దగ్గరవుతాడు. ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది కానీ, మిరాకున్న ఆ పాత శాపం మళ్ళీ బయటపడుతుంది. బాణా చుట్టూ భయంకరమైన శక్తులు తిరగడం, వాడి ప్రాణానికి ప్రమాదం రావడం స్టార్ట్ అవుతుంది. చివరికి ఆ శాపం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అది తన పూర్వీకుల నుండి వచ్చిందా ? ఎవడైనా చేతబడి చేశాడా ? దీని నుంచి ఆమె బయట పడుతుందా ? అనే విషయాలతో స్టోరీ చాలా ఉత్కంఠంగా సాగుతుంది.

Advertisement

Read Also : సైకో కిల్లర్ చేతిలో చిక్కుకున్న సైకాలజిస్ట్… 60 నిమిషాల డెడ్లైన్ తో అల్లకల్లోలం

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×