E-Paper
Advertisement

Horror Comedy Movies OTT : ‘ది రాజా సాబ్’ చూడాలనుకుంటున్నారా ? అంతకంటే ముందు ఓ లుక్కేయ్యాల్సిన టాప్ 5 హర్రర్-కామెడీ మూవీస్

Horror Comedy Movies OTT : ‘ది రాజా సాబ్’ చూడాలనుకుంటున్నారా ? అంతకంటే ముందు ఓ లుక్కేయ్యాల్సిన టాప్ 5 హర్రర్-కామెడీ మూవీస్
Advertisement

Horror Comedy Movies OTT : రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ సంక్రాంతి కానుకగా “ది రాజా సాబ్” అనే హర్రర్ మూవీతో ఆడియన్స్ ను పలకరించారు. నెగెటివ్ టాక్ ఉన్నప్పటికీ ఈ చిత్రం మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించి, దుమ్మురేపింది. మొదటి రోజే ఈ మూవీ 100 కోట్ల మార్కును అధిగమించింది. దీంతో ప్రభాస్ ఒకటి, రెండు కాదు, ఏకంగా ఆరు సినిమాలతో100 కోట్లకు పైగా ఓపెనింగ్ రాబట్టిన మొట్టమొదటి, ఏకైక స్టార్ గా నిలిచాడు. మరి మీరు కూడా ఈ మూవీని చూడాలి అనుకుంటున్నారా ? అంతకంటే ముందు ఓటీటీలో ఉన్న ఈ టాప్ 5 హారర్ సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి.

ముంజ్య (Munjya)

తక్కువ బడ్జెట్ తో రూపొందిన ‘ముంజ్య’ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహారాష్ట్ర జానపద కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ఆకట్టుకునే హారర్ తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంటుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కల నెరవేరని పిశాచి కథ ఇది.  జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ.

సు ఫ్రమ్ సో (Su From So)

Advertisement

కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన హర్రర్ కామెడీ మూవీ ‘సు ఫ్రమ్ సో’. కేవలం 6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ భారీ కలెక్షన్లు సాధించింది. షనీల్‌ గౌతమ్‌, జేపీ తుమినాడ్‌, సంధ్య అరకెరె, ప్రకాశ్‌ తుమినాడ్‌, రాజ్‌ బి.శెట్టి మెయిన్ రోల్స్ పోషించిన ఈ సినిమాకు జేపీ తుమినాడ్‌ దర్శకుడు. కర్ణాటకలోని ఓ ఊళ్ళో దెయ్యం పట్టినట్టుగా నటించి, అడ్డంగా బుక్కయ్యే అబ్బాయి గురించి ఉంటుంది స్టోరీ. జియో హాట్ స్టార్ లో దీన్ని చూడొచ్చు.

శుభం (Subham)

2025లో విడుదలైన అచ్చ తెలుగు హర్రర్ మూవీ ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్, కనకవల్లి టాకీస్ బ్యానర్‌పై స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీని నిర్మించగా, ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశారు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి ఇందులో ప్రధాన పాత్రల్లో కన్పిస్తారు. Jio Hotstarలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

డీడీ రిటర్న్స్ (DD Returns)

Advertisement

2023లో తెరపైకి వచ్చిన తమిళ కామెడీ హారర్ మూవీ ‘డీడీ రిటర్న్స్’ (DD Returns). సంతానం హీరోగా నటించారు. ఈ సినిమాలో దెయ్యాలు ఉన్న బంగ్లాలో నుంచి డబ్బును తెచ్చుకోవడానికి హీరో అండ్ టీం పడే కష్టాలు కడుపుబ్బా నవిస్తాయి. Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

రోమాంచమ్ (Romancham)

ఇక ఈ లిస్ట్ లో మర్చిపోకుండా చెప్పాల్సిన మలయాళం మూవీ ‘రోమాంచమ్’. జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో విడుదలైంది. సౌబిన్‌ షాహిర్‌, అనంతరామన్‌, షాజిన్‌ గోపు, సిజు సన్నీ, అఫ్జల్‌ పి.హెచ్‌, జగదీష్‌ కుమార్‌, అర్జున్‌ అశోకన్‌ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడుగురు ఫ్రెండ్స్ కలిసి ఓయీజా గేమ్ ఆడి దెయ్యాన్ని రప్పిస్తారు. ఆ తరువాత జరిగే కథ అంతా కామెడిగా ఉంటుంది. ఈ మూవీని కూడా జియో హాట్ స్టార్ లోనే చూడవచ్చు.

పడక్కలం (Padakkalam)

2025లో వచ్చిన బ్లాక్ కామెడీ ఫాంటసీ మూవీ ‘పడక్కలం’. మను స్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సూరజ్ వెంజరమూడు, షరాఫ్ యు ధీన్, సందీప్ ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ మ్యాజిక్ తో ఓ ఆట ఆడుకునే కాలేజ్ లెక్చరర్, దానివల్ల వింత చేష్టలు చేసే స్టూడెంట్స్… సస్పెన్స్ తో పాటు కామెడీ కూడా కావలసినంత ఉన్న మూవీ ఇది. జియో హాట్ స్టార్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Read Also : ఇండియన్ ఓటీటీలోకి 2000 కోట్ల హాలీవుడ్ హారర్-థ్రిల్లర్… కల్లోనూ వెంటాడే కథ

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×