E-Paper
Advertisement

Horror web Series OTT : లైవ్ లో దెయ్యాలను చూపిద్దామని వెళ్ళి అడ్డంగా బుక్… వణికించే హర్రర్ సిరీస్

Horror web Series OTT : లైవ్ లో దెయ్యాలను చూపిద్దామని వెళ్ళి అడ్డంగా బుక్… వణికించే హర్రర్ సిరీస్
Advertisement

Horror web Series OTT : దెయ్యాల స్టోరీలు ఎక్కువగా పాత బంగ్లాల చుట్టూనే ఎక్కువగా తిరిగాయి. అలాంటి ఇంట్లో కి కొత్తగా వచ్చిన వాళ్ళతో దెయ్యాలు ఆటాడేసుకుంటూ ఉంటాయి. ఇవి విభిన్న కథనాలతో వస్తూనే ఉన్నాయి. వీటిని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ కూడా ఇదే తరహాలో సాగుతుంది. ఒక టివి ఛానల్ TRP కోసం, ఒక దెయ్యాల బంగ్లాలో లైవ్ టెలీకాస్ట్ చేయడంతో స్టోరీ భయంకరమైన మలుపులు తీసుకుంటుంది. ఇది నటి కాజల్ అగర్వాల్‌ మొదటిసారిగా డిజిటల్ అరంగేట్రం చేసిన సిరీస్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2021లో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘లైవ్ టెలికాస్ట్’ (Live Telecast). ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్ జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో 2021ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది. ఇది ఏడు ఎపిసోడ్లతో తమిళ ఒరిజినల్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ డబ్డ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జెన్నిఫర్ (కాజల్ అగర్వాల్) ఒక టీవీ షో డైరెక్టర్. తన టీవీ షో రేటింగ్స్‌ను పెంచుకోవడం కోసం ఆమె ఒక ప్లాన్ వేస్తుంది. ఒక పాత బంగళాలో దయ్యాలు ఉన్నాయని, అక్కడ ఒక షోను లైవ్ లో చేయాలని తన టీమ్ తో కలిసి వెళ్తుంది. అయితే అక్కడ ఏమీ కనిపించక పోవడంతో ప్రజలను నమ్మించడానికి, కొన్ని నకిలీ దయ్యం సీన్లను సృష్టించాలని అనుకుంటుంది. అయితే ఆ ఇంట్లో నిజంగానే ఒక శక్తివంతమైన దుష్టశక్తి ఉందని వారికి ఆలస్యంగా అర్థమవుతుంది. ఆ దయ్యం వారిని బయటకు వెళ్లనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటుంది. ఇక కెమెరాలు ఆన్ లో ఉన్నప్పుడే, లక్షలాది మంది ప్రేక్షకులు చూస్తుండగానే ఆ టీమ్ సభ్యులు ఒక్కొక్కరుగా ప్రాణాపాయంలో పడతారు. చివరికి ఆ బంగ్లా నుండి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారా ? ఆ దెయ్యానికి  బలయ్యారా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఆది సాయికుమార్ సూపర్ హిట్ మిస్టిక్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో ఎప్పుడు చూడవచ్చో తెలుసా ?

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×