E-Paper
Advertisement

Shambhala OTT release date : ఆది సాయికుమార్ సూపర్ హిట్ మిస్టిక్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో ఎప్పుడు చూడవచ్చో తెలుసా ?

Shambhala OTT release date : ఆది సాయికుమార్ సూపర్ హిట్ మిస్టిక్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో ఎప్పుడు చూడవచ్చో తెలుసా ?
Advertisement

Shambhala OTT release date : సాయికుమార్ వారసుడు ఆది నటించిన చిత్రం ‘శంబాల’ (Shambhala). ఈ సినిమా ట్రైలర్ విడుదలైన రోజు నుండే, ఈ మిస్టిక్ థ్రిల్లర్ చుట్టూ చాలా హైప్ క్రియేట్ అయింది. ఇక గత నెల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే 10 కోట్లకు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ వంటి నటుడు కూడా ఈ సినిమాని అభినందించడంతో, ఇక ఆడియన్స్ కూడా మూవీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ చిత్రం 2026 జనవరి 22 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కాబోతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. తాజా అప్‌డేట్ ప్రకారం ‘శంభాల’ మూవీ 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది అద్భుతమైన థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ సన్నివేశాలు చాలా ప్రశంసలు అందుకున్నాయి కూడా. గతంలో ఆది చాలా సినిమాలు చేసాడు, కానీ వాటిలో ఏవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. అయితే ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి మాత్రం విశేష స్పందన వచ్చింది.

Advertisement

Read Also :  శవాలతో నిండిపోయే నది… వరుస హత్యలతో వణుకు పుట్టించే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

శంబాల అనే ఒక చిన్న గ్రామానికి మంచి చరిత్ర ఉంది. అయితే ఒక రోజు అక్కడ ఒక ఉల్కాపాతం పడుతుంది. ఆ తర్వాత ఒక దుష్ట ఆత్మ విధ్వంసం సృష్టిస్తుంది. ఆ ఊరిలో ఊహించని సంఘ‌ట‌న‌లు జరుగుతాయి. హ‌త్యలు, ఆత్మ‌హ‌త్య‌ల‌తో ఊరు బెంబేలెత్తిపోతుంది. ప్రజలంతా ఏదో దుష్ట శక్తి వల్ల ఇదంతా జరుగుతోందని భ‌యంతో వ‌ణికిపోతుంటారు. ఈ సమయంలో మూఢనమ్మకాలను అస్సలు నమ్మని విక్రమ్ (ఆది)అనే శాస్త్ర‌వేత్త‌ ఆ ఊరికి వస్తాడు. ఆ ఊరిలో జరుగుతున్న రహస్యాలను ఛేదించేందుకు ప్రభుత్వం అతన్ని పంపిస్తుంది. సైన్స్‌నే న‌మ్ముకుని ఏ పనైనా చేసే విక్రమ్, ఆ ఊరికి వచ్చాక భయంకరమైన సంఘటనలను ఫేస్ చేస్తాడు. చివరికి విక్రమ్ ఆ ఊళ్లో జ‌రుగుతున్న అంతుచిక్కని మిస్టరీ గుట్టు విప్పాడా ? సైన్స్‌ నే నమ్ముకున్న విక్రమ్, దుష్ట శక్తులను కూడా నమ్మడా ? ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరుగుతోంది ? అనే విషయాలను, ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×