E-Paper
Advertisement

Netflix Best Horror Movie : దేవుడి గుడిలో వింత శాపం… అంతుచిక్కని చావులు… దడ పుట్టించే థాయ్ హారర్ మూవీ

Netflix Best Horror Movie : దేవుడి గుడిలో వింత శాపం… అంతుచిక్కని చావులు… దడ పుట్టించే థాయ్ హారర్ మూవీ

Netflix Best Horror Movie : తైవాన్ హారర్ సినీ చరిత్రలో హైయెస్ట్ గ్రాసింగ్ హారర్ ఫిల్మ్ గా ఓ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ సినిమా రియాలిస్టిక్ కంటెంట్ తో ఆడియన్స్ ని చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ముగ్గురు స్నేహితులు యూట్యూబ్ చానెల్ కోసం పురాతన ఆచారాలను పాటించే ఒక దేవత టెంపుల్ కి వెళ్లడంతో స్టోరీ మొదలవుతుంది. ఆ తరువాత గుండె దఢను పెంచే సన్నివేశాలతో స్టోరీ సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తుంది. ఈ హారర్ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2022లో విడుదలైన ఈ తైవానీస్ ఫౌండ్ ఫుటేజ్ అతీంద్రియ హారర్ మూవీ పేరు “ఇన్‌క్యాంటేషన్” (Incantation). డైరెక్టర్ కెవిన్ కో డైరెక్షన్‌లో త్సై హ్సుయాన్-యెన్ (లి రోనాన్) మెయిన్ రోల్‌లో నటించారు. ఇది 2005లో తైవాన్‌లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందింది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి స్కేరీ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. గోల్డెన్ హార్స్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ అవార్డ్స్ ని, టైపీ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ ఆర్ట్ డిజైన్ అవార్డ్స్ ని గెలుచుకుంది. మొత్తం14 నామినేషన్స్ లో 4 విభాగాల్లో అవార్డులు వచ్చాయి.

Read Also : థియేటర్లలో ప్లాఫ్ ఓటీటీలో హిట్… కూతురి ప్రేమకు అడ్డుపడే తండ్రి… ఎక్కడ చుడొచ్చంటే?

కథలోకి వెళ్తే

ఈ కథ రెండు వేర్వేరు టైమ్ లైన్లలో జరుగుతుంది. ఆరేళ్ల క్రితం లి రోనన్, ఒక యూట్యూబ్ ఛానెల్ కోసం అతీత శక్తులను పరిశోధించే తన స్నేహితులు డామ్, మరొక స్నేహితుడు యువాన్‌తో కలిసి ఒక మారుమూల గ్రామానికి వెళుతుంది. ఆ గ్రామంలోని ప్రజలు ‘మదర్ బుద్ధా’ అనే దేవతను ఆరాధిస్తూ వింత ఆచారాలను పాటిస్తుంటారు. ఈ బృందం అక్కడి ఆచారాలను పక్కన పెట్టి ఆ దేవత ముఖంపై ఉన్న ముసుగును తొలగిస్తారు. అంతేకాకుండా ఆ దేవాలయపు సొరంగంలోకి ప్రవేశిస్తారు. ఈ చర్య కారణంగా, వారిపై ఒక భయంకరమైన శాపం పడుతుంది. దాని ఫలితంగా డామ్, యువాన్ భయంకరమైన రీతిలో మరణిస్తారు.

ప్రస్తుత కాలంలో రోనన్ ఆరేళ్ల మానసిక చికిత్స తర్వాత తన కుమార్తె డోడో దగ్గరికి వస్తుంది. అయితే ఆ శాపం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు డోడోను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. డోడో వింతగా ప్రవర్తించడం, ఇంట్లో అతీత శక్తులను చూడటం, అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. రోనన్ తన కుమార్తెను రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. క్లైమాక్స్‌లో రోనన్ తన కుమార్తెను శాపం నుండి శాశ్వతంగా రక్షించడానికి ఒక భయంకరమైన అడ్వెంచర్ చేస్తుంది. ఆమె తిరిగి ఆ పాడుబడిన గ్రామంలో ఉన్న దేవత విగ్రహం దగ్గరికి ఒంటరిగా వెళ్తుంది. అక్కడ భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. చివరికి రోనన్ ఆ శాపాన్ని ఎలా పోగొడుతుంది ? ఆ దేవతా విగ్రహం దగ్గర ఆమె ఏం చేస్తుంది ? ఈ కథ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

 

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×