E-Paper
Advertisement

OTT Movie : థియేటర్లలో ప్లాఫ్ ఓటీటీలో హిట్… కూతురి ప్రేమకు అడ్డుపడే తండ్రి… ఎక్కడ చుడొచ్చంటే?

OTT Movie : థియేటర్లలో ప్లాఫ్ ఓటీటీలో హిట్… కూతురి ప్రేమకు అడ్డుపడే తండ్రి… ఎక్కడ చుడొచ్చంటే?
Advertisement

OTT Movie : రొమాంటిక్ లవ్ స్టోరీలకు అభిమానులు ఎక్కువే. అయితే రొటీన్ లవ్ స్టోరీలను థియేటర్లకు వెళ్ళి చూడటానికి, ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రీసెంట్ గా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఓ తెలుగు సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి ఓటీటీలో ఆదరణ లభిస్తోంది. నవంబర్ చివరి వారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు మరో ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఎలా వుంటుంది ? అనే విషయాలను కూడా తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ పేరు ‘శశివదనే’ (Sasivadane). 2025 అక్టోబర్ 10న థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. నవంబర్ 28న సన్ నెక్ట్స్ ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘శశివదనే’ సినిమాను ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి., ఏజీ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించాడు.

Advertisement

Read Also : తెలుగులో ఇలాంటి సినిమానా ? మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన సినిమా

స్టోరీ ఏమిటంటే

కోనసీమ గ్రామంలో రాఘవ అనే యువకుడు, సరదాగా ఫ్రెండ్స్ తో రోడ్లమీద తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. తల్లి లేని పిల్లాడు కావడంతో తండ్రి గారాబంగా పెంచుతాడు. అతను కాలేజ్ లో డిగ్రీ చదువుతుంటాడు. ఈ సమయంలో అతని లైఫ్ లోకి శశి అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆమెను చూడగానే లవ్ లో పడిపోతాడు. శశి కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. వాళ్లిద్దరూ కలిసి రొమాంటిక్ మూమెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ల ప్రేమకు అమ్మాయి తండ్రి అడ్డంకిగా మారుతాడు.

Advertisement

శశి తండ్రి పెద్ద సంబంధం తెచ్చి కూతురికి పెళ్లి చేయాలనుకుంటాడు. రాఘవది తక్కువ స్తాయి కావడంతో వీళ్ళ ప్రేమను ఏమాత్రం అంగీకరించడు. అతన్ని కలవకూడదని కూతురుకి వార్నింగ్ కూడా ఇస్తాడు. అయితే శశి, రాఘవ తమ ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో అనేక సమస్యలు వస్తాయి. చివరకు వీళ్ళ ప్రయత్నం ఫలిస్తుందా ? శశి తండ్రి వీళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటాడా ? వీళ్ళు లేచిపోతారా ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×