Horror movies OTT : ఇండోనేషియా వాళ్లు హారర్ సినిమాలు తీస్తే అది మామూలుగా ఉండదు ఒళ్లు గగుర్పొడవాల్సిందే! మన దగ్గర దెయ్యం అంటే తెల్ల చీర కట్టుకుని, కొవ్వొత్తి పట్టుకుని తిరుగుతుంది అనుకుంటాం కానీ, వాళ్ల దగ్గర దెయ్యాలు చాలా వెరైటీగా, ఇంకాస్త భయంకరంగా ఉంటాయి. అసలు విషయం ఏంటంటే, ఇండోనేషియా వాళ్లు మనలాగే దేవుడిని ఎంత నమ్ముతారో, దెయ్యాన్ని కూడా అంతే నమ్ముతారు. అందుకే వాళ్ల హారర్ సినిమాల్లో ఆ నేటివిటీ బాగా పండుతుంది. రక్తం చిందించడం, వింత శబ్దాలు, వికృతమైన ముఖాలు.. ఇవన్నీ కలిపి ఒక పక్కా మాస్ హారర్ మీల్స్ వడ్డిస్తారు. సైకలాజికల్ థ్రిల్లర్లు మెదడుకి పని పెడితే, ఈ ఫోక్ లోర్ సినిమాలు మాత్రం గుండెకి పని పెడతాయి. రాత్రి పూట ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సినిమాలు చూస్తే గుండె గల్లంతు అవ్వడం ఖాయం.
దీన్ని చాలా మంది ఇండోనేషియన్ ఈవిల్ డెడ్ అని కూడా అంటారు. ఇందులో హీరో ఒక అమ్మాయి. తన తండ్రి ఏదో పాత బంగళాలో వింత వ్యాధితో చనిపోతుంటే, ఆ ఆస్తి కోసం అక్కడికి వెళ్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే.. వాళ్ళ నాయన గతం లో డబ్బు కోసం, సుఖం కోసం దెయ్యంతో ఒప్పందం చేసుకుంటాడు. ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఆ దెయ్యం వచ్చి ఇంట్లో ఉన్నోళ్ళందరినీ ఒక్కొక్కరిని వేటాడి చంపేస్తుంది. ఇందులో రక్తం ఏరులై పారుతుంది. ఆ దెయ్యం పట్టాక మనుషులు చేసే విన్యాసాలు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. పక్కా ఊర మాస్ హారర్ ఇది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూడవచ్చు.
ఇది మాత్రం పిచ్చెక్కించే చేతబడి సినిమా. ముగ్గురు స్నేహితులు తమ ఫ్యామిలీతో కలిసి, చిన్నప్పుడు పెరిగిన అనాథ శరణాలయానికి వెళ్తారు. అక్కడ ఉన్న పాత యజమాని చనిపోతుంటే చూడటానికి వెళ్తే.. అక్కడ అసలు కథ మొదలవుతుంది. అంతకు ముందు ఎప్పుడో జరిగిన ఒక సంఘటనకు, పగ తీర్చుకోవడానికి ఒక ఆత్మ ఇప్పుడు విరుచుకుపడుతుంది. ఇందులో బాడీ హారర్ మామూలుగా ఉండదు. ఒంటి మీద పురుగులు పాకడం, చర్మం ఒలుచుకోవడం లాంటి సీన్లు చూస్తుంటే కడుపులో తిప్పేస్తుంది కూడా. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ లో ఉంది.
ఇది ఒక రేంజ్ హర్రర్ సినిమా. ఇందులో ఒక తల్లి చనిపోయి మళ్ళీ దెయ్యంలా తిరిగి వస్తుంది. కానీ ఆమె ఆత్మ మాత్రం ఇంట్లోనే తిరుగుతున్నట్టు పిల్లలకి కనిపిస్తుంటుంది. తీరా చూస్తే, ఆమె బతికున్నప్పుడు పిల్లల కోసం దెయ్యంతో ఏదో డీల్ కుదుర్చుకుందని తెలుస్తుంది. ఆ దెయ్యం వచ్చే సౌండ్ వింటే చాలు, ఒంట్లో వణుకు పుట్టాల్సిందే. Shudder, prime videoలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
ఈ సినిమా ఒక శాపం చుట్టూ తిరుగుతుంది. ఒక పల్లెటూరికి వెళ్తే, అక్కడ ఉన్నవాళ్లంతా చేతబడులు చూస్తుంటే ఎలా ఉంటుంది? ఇందులో చూపించే కథకు ఒళ్ళు జలదరిస్తుంది. ఇది ప్యూర్ విలేజ్ హర్రర్. ఒక అమ్మాయి తన ఊర్లో ఆస్తి ఉందని తెలుసుకుని తన ఫ్రెండ్‌ని తీసుకుని అక్కడికి వెళ్తుంది. కానీ ఆ ఊర్లో పుట్టే పిల్లలందరూ చర్మం లేకుండా పుడుతుంటారు. దానికి కారణం ఈ అమ్మాయి తండ్రి చేసిన పాపమే అని ఊరి జనం నమ్ముతారు. ఆ ఊరోళ్లంతా కలిసి ఈ పిల్లని పట్టుకుని చంపాలని చూస్తుంటే.. అసలు ఆ సీన్స్ చూస్తే పిచ్చెక్కిపోద్ది. prime video, netflix లో ఈ సినిమాను చూడచ్చు.
ఇది ఒక రియల్ స్టోరీ అని చెప్తారు. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్ పని మీద ఒక మారుమూల గ్రామానికి వెళ్తారు. అక్కడ ఒక అడవిలోకి వెళ్లకూడదని రూల్ ఉంటుంది. కానీ వీళ్ళు ఆ రూల్ బ్రేక్ చేస్తారు. అక్కడ ఒక డాన్సర్ దెయ్యం వీళ్లని పట్టుకుంటుంది. ఆ దెయ్యం డాన్స్ వేయడం, అది వీళ్లని వేధించడం.. మొత్తం సినిమా చూస్తున్నంత సేపు ఒక రకమైన భయం ఉంటుంది. prime videoలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : ప్రేమ కోసం బోలెడన్ని మర్డర్లు…రక్తపాతంతో సాగే సైకో రాసలీల… ఒక్కో సీన్ అరాచకం…