E-Paper
Advertisement

Crime Thriller Movie OTT : తమ్ముడి జోలికొస్తే తలలు తీసే అన్న… ఐయండిబిలో 7.5 రేటింగ్…ఇదో ఆగని ప్రతీకార సెగ

Crime Thriller Movie OTT : తమ్ముడి జోలికొస్తే తలలు తీసే అన్న… ఐయండిబిలో 7.5 రేటింగ్…ఇదో ఆగని ప్రతీకార సెగ
Advertisement

Emotional Drama OTT :గత ఏడాది ఒక కిరాక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఇది చాలా డిఫరెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఐయండీబిలో 7.5 రేటింగ్ కూడా ఉంది. ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరిగే ఈ కథ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ కి. అంతేకాదు గ్యాంగ్ స్టర్ గొడవలతో ఈ సినిమా పిచ్చెక్కిస్తుంది కూడా. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ రష్యన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘This Summer Will End’. ఇందులో ప్రధాన పాత్రలో ప్రముఖ రష్యన్ నటుడు యురా బోరిసోవ్ నటించారు. ఇది 2025 ఫిబ్రవరి 27న రష్యాలో విడుదలైంది. 2025 ఏప్రిల్ 12 నుండి mubi ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను వ్లాదిమిర్ మున్కుయేవ్, మాగ్జిమ్ అర్బుగేవ్ కలిసి డైరెక్ట్ చేశారు. వీళ్ళు గతంలో డాక్యుమెంటరీల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈ సినిమా కూడా చాలా సహజంగా ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా రష్యాలోని ఒక మారుమూల పల్లెటూర్లో జరుగుతుంది. కేశా అనే కుర్రాడు జైలు శిక్ష అనుభవించి, తన ఊరికి తిరిగి వస్తాడు. ఎలాగైనా బుద్ధిగా బతకాలి, తన 17 ఏళ్ల తమ్ముడు టిమాని బాగా చూసుకోవాలని గట్టిగా డిసైడ్ అవుతాడు. కానీ విధి ఆడని వింత నాటకంలో, అతను ఒక గోల్డ్ మైనింగ్ గ్యాంగ్‌తో చేరాల్సి వస్తుంది. అక్కడ పని చేసే వాళ్లంతా ఆకతాయిలు, ప్రమాదకరమైన మనుషులు. ఇక ఈ గ్యాంగ్‌తో కలిసి పని చేస్తున్నప్పుడు, వీడు తన తమ్ముడిని కూడా ఆ ముఠాలోకి లాగుతాడు. అయితే అక్కడ పనులు అనుకున్నట్టు జరగవు. ఒక గొడవలో కేశా ఆ ముఠా దగ్గర ఉన్న బంగారాన్ని కొట్టేసి, తన తమ్ముడిని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. ఇక అక్కడి నుండి మొదలవుతుంది అసలు రచ్చ. ఆ గ్యాంగ్ మొత్తం వీళ్ల వెంట పడుతుంది. అన్నదమ్ములు ఇద్దరూ ఆ అడవుల్లో, మంచులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతారు. చివరికి వీళ్ళు ఆ గ్యాంగ్ నుంచి ప్రాణాలతో బయట పడతారా ? వాళ్ళ చేతిలో బలైపోతారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also :  దెయ్యాలను రప్పించే కొత్త ఆట… సరదాగా మొదలై చావు దాకా… వణికిస్తున్న హారర్ థ్రిల్లర్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×