E-Paper
Advertisement

డెడ్లీ మార్షల్ ఆర్ట్స్… దుమ్మురేపే యాక్షన్ సీన్స్… ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్

డెడ్లీ మార్షల్ ఆర్ట్స్… దుమ్మురేపే యాక్షన్ సీన్స్… ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్
Advertisement

Action Fantasy Series : ఖడ్గాలు మెరుస్తుంటాయి. పిడికిళ్లు గాలిని చీలుస్తాయి. ఒక్క మనిషి పదుల సంఖ్యలో కొద్దీ శత్రువులను నేలకూలుస్తాడు. అందుకే ఇది సాధారణ యాక్షన్ సిరీస్ కాదు.. పోస్ట్ అపోకలిప్టిక్ ప్రపంచం, రక్తపాతం నిండిన రాజ్యాలు, అధికార పోరాటాలు, రహస్య శక్తులు, అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ అన్నీ కలిసిన అరుదైన యాక్షన్ గాథ.. అదే ఇంటూ ది బ్యాడ్ ల్యాండ్స్..! ఇది ప్రస్తుం యాపిల్‌ టీవీలో స్ట్రీమ్‌ అవుతుంది.

అదరగొట్టిన డేనియల్ పూ:

2015లో ప్రారంభమైన ఈ అమెరికన్ యాక్షన్ ఫాంటసీ సిరీస్ మూడు సీజన్ల పాటు ప్రేక్షకులను అలరించింది. అల్ఫ్రెడ్ గఫ్, మైల్స్ మిల్లర్ రూపొందించిన ఈ సిరీస్‌లో డేనియల్ వూ ప్రధాన పాత్రలో నటించారు. నిక్ ఫ్రోస్ట్, ఎమిలీ బీచమ్, అరామిస్ నైట్, మేడలీన్ మాంటాక్ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. విడుదలైన సమయంలో కథ కంటే ఎక్కువగా ఇందులోని యాక్షన్ సన్నివేశాలే ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. కథ భవిష్యత్తులో జరిగే ఒక విచిత్ర ప్రపంచంలో సాగుతుంది. పాత నాగరికతలు కూలిపోయిన తర్వాత కొత్త రాజ్యాలు ఏర్పడతాయి. ఈ ప్రాంతాలను శక్తివంతమైన పాలకులు నియంత్రిస్తూ ఉంటారు. ఆయుధాలు, సైన్యాలు, బానిస వ్యవస్థల మధ్య బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి నెలకొంటుంది.

Advertisement

ఈ ప్రపంచంలో సన్నీ అనే అత్యంత ప్రమాదకర యోధుడిగా డేనియల్ వూ కనిపిస్తాడు. అతను ఒక రాజ్యానికి విశ్వాసపాత్రుడైన యోధుడు. వందలాది యుద్ధాలు చూసిన అతను శత్రువులకు పీడకల లాంటివాడు. కానీ ఒక యువకుడిని కలిసిన తర్వాత అతని జీవితం మారిపోతుంది. ఆ యువకుడిలో సాధారణ మనుషులకు లేని రహస్య శక్తులు ఉంటాయి. ఆ శక్తుల వెనుక దాగి ఉన్న నిజాన్ని తెలుసుకునే ప్రయాణమే కథకు ప్రధాన బలం. ఇంటూ ది బ్యాడ్ ల్యాండ్స్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని యాక్షన్ కొరియోగ్రఫీ. ప్రతి ఫైట్ సీన్ ఒక కళాఖండంలా ఉంటుంది. హాలీవుడ్ స్టైల్ యాక్షన్‌తో పాటు ఆసియా మార్షల్ ఆర్ట్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఖడ్గ యుద్ధాలు, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, భారీ యాక్షన్ సెట్స్ ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెడతాయి.

మరోవైపు అధికార దాహం, ద్రోహం, కుటుంబ బంధాలు, స్వేచ్ఛ కోసం పోరాటం, మంచి చెడుల మధ్య సంఘర్షణ లాంటి అంశాలు కూడా కథలో కీలకంగా ఉంటాయి. ప్రతి సీజన్‌లో కొత్త రహస్యాలు, కొత్త శత్రువులు, కొత్త శక్తులు పరిచయం అవుతుండటంతో ఆసక్తి ఎక్కడా తగ్గదు. యాక్షన్ అభిమానులకు, మార్షల్ ఆర్ట్స్ ప్రేమికులకు, ఫాంటసీ ప్రపంచాలు ఇష్టపడేవారికి ఇంటూ ది బ్యాడ్ ల్యాండ్స్ ఒక తప్పక చూడాల్సిన సిరీస్. ఇప్పటికీ చాలామంది దీన్ని టెలివిజన్ చరిత్రలో అత్యుత్తమ యాక్షన్ సిరీస్‌లలో ఒకటిగా చెబుతుంటారు.

Advertisement

Read Also : ఇష్టంలేని పెళ్లి… కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్… పెళ్ళయిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ

Tags

Related News

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

Big Stories

Advertisement
×