E-Paper
Advertisement

OTT Thriller: క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. మలయాళీ ‘డైమండ్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో!

OTT Thriller: క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. మలయాళీ ‘డైమండ్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో!
Advertisement

OTT Thriller:ఇండియాలో ఎన్ని సినీ ఇండస్ట్రీస్ ఉన్నా మలయాళం ఇండస్ట్రీకి, అందునా అక్కడి నుండి డెలివర్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న సంగతి కొత్తగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మిగతా ఇండస్ట్రీల కన్నా ఇక్కడి మేకర్స్ రాసే స్టోరీలు, స్క్రీన్‌ప్లేలు మైండ్ బెండ్ అయ్యేలా ఉంటాయంటే అది ఎగ్జాగరేషన్ కాదు.

ఒకప్పుడు కేవలం కేరళకే పరిమితమైన మలయాళీల సత్తా, కరోనా పుణ్యమా అని మనకు కూడా పరిచయం అయిపోయింది. అలా కిష్కిందకాండ, కన్నూర్ స్క్వాడ్, బ్రహ్మయుగం వంటి ఎన్నో సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక మన తెలుగులో వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సినిమా కూడా అక్కడ మోహన్ లాల్ నటించిన మాస్టర్ పీస్‌కు రీమేక్ అనే విషయం తెలియని వారుండరు.

జోజూ జార్జ్ నటన – కమల్ హాసన్ ప్రశంసలు

Advertisement

ఈ క్రమంలో మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘ఇరట్టా’ (Iratta). రోహిత్ కృష్ణన్ దర్శకత్వంలో జోజూ జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, చూసిన ప్రతి ఒక్కరికీ ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగిస్తుంది. ఇద్దరు ట్విన్స్ మధ్య ఉండే వైరుధ్యాన్ని, ఒక పోలీస్ స్టేషన్ నేపథ్యంలో జరిగే ఇన్వెస్టిగేషన్‌ను అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్.

జోజూ జార్జ్ అంటే మనకు అడపా దడపా సూర్య నటించిన రెట్రో, డబ్ అయిన పాని వంటి సినిమాలతో పరిచయమైన వాడే. కానీ మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్‌లకు దీటుగా ఇతనికి కూడా ఫ్యాన్ బేస్ ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఒకానొక సందర్భంలో లోకనాయకుడు కమల్ హాసన్ మాట్లాడుతూ… తన కెరీర్‌లో మొదటిసారి ఒక నటుడిని చూసి జలస్‌గా ఫీల్ అయ్యానని, అది జోజూ జార్జ్ నటన చూసేనని స్టేట్‌మెంట్ ఇచ్చారంటే, ఆయన ఎంతలా ఇంపాక్ట్ చూపించారో అర్థం చేసుకోవచ్చు.

ట్విస్ట్ తెలియకుండా చూడటమే అసలైన మజా!

Advertisement

‘ఇరట్టా’ సినిమాలో జోజూ జార్జ్ డబుల్ రోల్‌లో కనిపించడం విశేషం. ముఖ్యంగా రెండు డిఫరెంట్ రోల్స్‌ను ఆయన పోషించిన తీరు మెచ్చుకోకుండా ఉండలేము. అంజలి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ముందే తెలుసుకోకుండా చూడటమే అసలైన మజా.

ఎందుకంటే ప్రారంభం నుండి చివరి వరకు ఉత్కంఠగా సాగే ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం వేరే లెవల్‌లో ఉంటుంది. ముఖ్యంగా ఎండింగ్ సీన్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. కథ ముందే తెలిస్తే ఆ థ్రిల్ మిస్ అవుతారు కాబట్టి, ఎక్కడా స్పాయిలర్స్ చూడకుండా డైరెక్ట్‌గా సినిమా చూడటం ఉత్తమం.

ఎక్కడ చూడాలి?

జోజూ జార్జ్ డబుల్ రోల్‌లో అదరగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏమాత్రం లేట్ చేయకుండా చూసెయ్యండి!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×