E-Paper
Advertisement

గన్ పట్టిన చేత్తో పెన్ పడితే… 47 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ ఆత్మ 18 ఏళ్ల స్టూడెంట్ లోకి… ఓ చూపు చూడాల్సిన సిరీస్

గన్ పట్టిన చేత్తో పెన్ పడితే… 47 ఏళ్ల  గ్యాంగ్‌స్టర్ ఆత్మ 18 ఏళ్ల స్టూడెంట్ లోకి… ఓ చూపు చూడాల్సిన సిరీస్
Advertisement

Action Drama OTT : ఓటీటీలోకి ఎన్నో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. అయితే కొన్ని సిరీస్ లను చూస్తే దిల్ ఖుష్ అవుతుంది. అలాంటి సిరీస్ లు కొరియన్ నుంచి చాలా వచ్చాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. అందుకే దీనికి IMDbలో 8/10 వంటి మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. 47 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ ఆత్మ 19 ఏళ్ల హైస్కూల్ విద్యార్థి శరీరంలోకి అనుకోకుండా వెళ్తుంది. ఆ తరువాత స్టోరీ చాలా క్రేజీగా సాగుతుంది. ఇందులో గ్యాంగ్‌స్టర్ తన తెలివితేటలతో స్కూల్ సిస్టమ్‌ను ఎలా మార్చాడు, తన ఫ్రెండ్‌ను కష్టాల నుండి ఎలా కాపాడాడు అనే యాక్షన్, ఫ్రెండ్షిప్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఇది యూత్‌కి మాత్రమే కాకుండా అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2024లో వచ్చిన ఈ కొరియన్ టీన్ యాక్షన్ డ్రామా పేరు ‘హై స్కూల్ రిటర్న్ ఆఫ్ ఏ గ్యాంగ్‌స్టర్’ (High School Return of a Gangster).
దీనిని “I, a Gangster, Became a High Schooler” అనే పాపులర్ వెబ్ నావెల్ ఆధారంగా తీశారు. ఇందులో మెయిన్ హీరోగా నటించిన యూన్ చాన్-యంగ్, ఇంతకుముందు ‘All of Us Are Dead’ అనే జాంబీ సిరీస్‌తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. ఇక ఈ డ్రామాలో అతను ఒకేసారి అమాయకపు స్టూడెంట్‌గా, రఫ్ గ్యాంగ్‌స్టర్‌గా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అలాగే ఇందులో మరో ముఖ్య పాత్ర పోషించిన బాంగ్ జే-హ్యూన్, రియల్ లైఫ్‌లో ‘Golden Child’ అనే ఫేమస్ కే-పాప్ గ్రూప్‌లో సింగర్ కావడం విశేషం. ఈ సిరీస్ కేవలం 8 ఎపిసోడ్లతో కథ చాలా ఫాస్ట్‌గా, బోర్ కొట్టకుండా సాగుతుంది. ఈ సిరీస్ ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ గ్రూపులో కిమ్ ద్యుక్-పాల్ అంటే ఏరియాలో అందరికీ హడల్. 47 ఏళ్ల వయసున్న ఇతగాడు రౌడీయిజం చేస్తున్నా, లోపల మాత్రం మంచిగా చదువుకోవాలనే కోరిక ఉంటుంది. ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే, ఒక కుర్రాడు చావడానికి సిద్ధపడి పైనుంచి దూకేస్తాడు. వాడిని కాపాడబోయిన ద్యుక్-పాల్ చనిపోయి, అనుకోకుండా ఆ కుర్రాడి బాడీలోకి దూరిపోతాడు. అంటే గ్యాంగ్‌స్టర్ ఆత్మ, కుర్రాడి శరీరంలోకి సెట్ అయిందన్నమాట. కట్ చేస్తే.. ఆ కుర్రాడు అసలుకే సాఫ్ట్, స్కూల్లో అందరూ వాడిని ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు బాడీలో ఉంది ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కదా! సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. తనని ఏడిపించిన రౌడీ బ్యాచ్‌ని తన గ్యాంగ్‌స్టర్ స్టైల్‌లో ఉతికి ఆరేస్తాడు. ఆ స్కూల్ పిల్లలకి చుక్కలు చూపిస్తూ, తన మాస్ పవర్ ఏంటో చూపిస్తాడు. అప్పటివరకు భయపడి చచ్చిన కుర్రాడు ఒక్కసారిగా డైమండ్ లాగా మారిపోవడంతో స్కూల్ మొత్తం షాక్ అవుతుంది. కేవలం కొట్టడమే కాకుండా, తనకి ఇష్టమైన చదువు మీద కూడా ఫోకస్ పెడతాడు. ఒక పక్క గ్యాంగ్ వార్స్, ఇంకో పక్క స్కూల్ ఎగ్జామ్స్.. ఇలా రెండిటినీ తనదైన స్టైల్‌లో హ్యాండిల్ చేస్తూ ఆ కుర్రాడి జీవితాన్ని ఎలా సెట్ చేసాడన్నదే ఈ కిర్రాక్ స్టోరీ.

Read Also : నిద్ర లేచి చూస్తే పక్కనే శవం… ఊహించని మలుపులతో కేక పెట్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×