SRH VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals) మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 216 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. హైదరాబాద్ పై అద్భుతంగా రాణిస్తాడు అనుకున్న వైభవ్ సూర్య వంశీ, డకౌట్ అయ్యాడు. తొలి బంతికే సలీల్ అరోరాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ధృవ్ జురైల్, లువాన్-డ్రే ప్రిటోరియస్ కూడా ప్రఫుల్ హింజ్ ( Praful Hinge ) వేసిన అద్భుతమైన ఓవర్ డకౌట్ అయ్యారు. ఈ తరుణంలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది రాజస్థాన్ రాయల్స్. ప్రస్తుతం 5 ఓవర్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్, 33 పరుగులు సాధించి, 5 వికెట్లు కోల్పోయింది.
Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక..రోహిత్ శర్మను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్షల ఫైన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య 21వ మ్యాచ్ సోమవారం రోజున ఉప్పల్ వేదిక జరుగుతోంది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది. ఇక ఈ టార్గెట్ ను సులభంగా రాజస్థాన్ రాయల్స్… ఛేదిస్తుంది అని అందరూ అనుకునే సమయంలో, చేతులెత్తేసింది. వైభవ్ సూర్యవంశీ నుంచి మొదలుకొని కెప్టెన్ రియాన్ పరాగ్ వరకు అందరు విఫలమయ్యారు.
తొలి బంతికే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ప్రఫుల్ వేసిన బంతికి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ ధృవ్ జురైల్, లువాన్-డ్రే ప్రిటోరియస్ కూడా డకౌట్ అయ్యారు. అటు యశస్వి జైష్వాల్ ను సకీబ్ హుస్సేన్ ఇంటికి పంపించాడు. ఈ మ్యాచ్ లో వైభవ్ ఒకే ఒక్క పరుగు చేసి వెనుతిరిగాడు. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ప్రఫుల్ హింజ్ ( Praful Hinge ) బౌలింగ్ లోనే నాలుగు పరుగులు చేసి అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 9 పరుగులు పూర్తయ్యే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన రవీంద్ర జడేజా అలాగే డోనోవన్ ఫెరీరా ( Donovan Ferreira) ఇద్దరు జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావడానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ పరువు తీసిన పాక్ రిపోర్టర్