BigTV English

OTT Movie: డబ్బులు ఇచ్చి బాయ్ ఫ్రెండ్ తో ఆ పని చేయించుకునే రిచ్ గర్ల్… ఇలాంటి కిలాడి లేడినీ ఎక్కడా చూసిండరు భయ్యా

OTT Movie: డబ్బులు ఇచ్చి బాయ్ ఫ్రెండ్ తో ఆ పని చేయించుకునే రిచ్ గర్ల్… ఇలాంటి కిలాడి లేడినీ ఎక్కడా చూసిండరు భయ్యా

OTT Movie : హాలీవుడ్ సినిమాలకి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉంటారు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలను చూసి ఎంటర్టైన్ అవుతారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక డబ్బున్న అమ్మాయి, పేదింటి అబ్బాయి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. సినిమా మొత్తం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేసే ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? పేరు ఏమిటి అనే వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix)

ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘ఇసి & ఒస్సీ‘ (Isi&Osi). 2020 లో వచ్చిన ఈ జర్మన్ రొమాంటిక్ కామెడీ మూవీకి ఆలివర్ కీన్లే దర్శకత్వం వహించారు , డెన్నిస్ మోజెన్, లిసా వికారి, క్రిస్టినా హెకే, పెగా ఫెరిడోని నటించారు. ఈ స్టోరీ ఒక బిలియనీర్ కుమార్తె, ఒక బాక్సర్ చుట్టూ తిరుగుతుంది. తన డ్రీం నెరవేర్చుకోవడానికి యువ బాక్సర్ తో, ఒక డీల్ సెట్ చేసుకుంటుంది బిలియనీర్ కుమార్తె. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ ధనవంతులకు పుట్టిన అమ్మాయి కావడంతో, ఎక్కువగా ఎవరితో కలవనియకుండా పెంచుతారు. అయితే హీరోయిన్ మంచి చెఫ్ అవ్వాలనుకుంటుంది. చదువులో మాత్రం వెనకబడే ఉంటుంది. మరోవైపు హీరో పేద ఇంటికి చెందిన వాడు కావడంతో, చదువుకి దూరంగానే ఉంటాడు. అయితే బాక్సింగ్ ని ప్రొఫెషన్ గా ఎంచుకుంటాడు. ఇతని గ్రాండ్ ఫాదర్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జైలుకు వెళ్తూ ఉంటాడు. ఇలా సాగిపోతుండగా, ఒకరోజు హీరోయిన్ స్కూల్లో పాస్ అయినట్టు సర్టిఫికెట్స్ ఇస్తారు. అయితే అవి డబ్బులు ఇచ్చి హీరోయిన్ ని పాస్ చేపించి ఉంటారు పేరెంట్స్. ఈ విషయం తెలిసి హీరోయిన్ తల్లిదండ్రులపై కోప్పడుతుంది. తాను చెఫ్ అవ్వాలనుకుంటున్నానని, కాలేజీకి వెళ్లే ప్రసక్తే లేదని చెప్తుంది. పేరెంట్స్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. పేరెంట్స్ ని బెదిరించి తన కోరికను తీర్చుకోవాలనుకుంటుంది.

ఈ క్రమంలో హీరో, హీరోయిన్ కి పరిచయం అవుతాడు. తనతో బాయ్ ఫ్రెండ్ గా నటించి హెల్ప్ చేయాలని చెప్తుంది. హీరోకి కూడా బాక్సింగ్ కాంపిటీషన్ కి డబ్బు పే చేయాల్సి ఉండటంతో ఒప్పుకుంటాడు. ఇలా ఇద్దరూ తల్లిదండ్రుల ముందర ప్రేమికులుగా నటిస్తారు. కూతురు చేయి దాటిపోతుందేమో అని, కొద్దిరోజులకి తల్లిదండ్రులు హీరోయిన్ కండిషన్స్ కి ఒప్పుకుంటారు. అయితే హీరోకి దూరంగా ఉండమని పేరెంట్స్ కండిషన్ పెడతారు. వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత చాలా బాధపడుతుంటారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా, హీరోయిన్ బాగా రిచ్ కావడంతో, హీరో తనని ప్రేమించడానికి వెనకాడుతూ ఉంటాడు. చివరికి వీరిద్దరూ ప్రేమించుకుంటారా? హీరో బాక్సింగ్ కాంపిటేషన్ లో పాల్గొంటాడా? హీరోయిన్ చెఫ్ గా లైఫ్ స్టార్ట్ చేస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఇసి & ఒస్సీ’ (Isi&Osi) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ

Virgin Boys: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్జిన్ బాయ్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

OTT Movie : పర్వతంపై అమ్మాయి మృతదేహం… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ

Mothevari Love Story Review : మోతెవరి లవ్ స్టోరీ రివ్యూ… లవ్ స్టోరీలో ఆస్తుల రచ్చ

Big Stories

×