Deepthi Sunaina : సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది సెలబ్రిటీలు గా మారారు. వీడియోలతో పాటు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎంతోమంది బాగా ఫేమస్ అయ్యారు. టెక్నాలజీ కొందరి జీవితాలని తలకిందులు చేస్తే మరికొందరి జీవితాలని ఆకాశానికి ఎత్తేసింది. మంచికి వాడి స్టార్ ఇమేజ్ ను అందుకున్న వారేందరో ఇప్పుడు స్టార్స్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. టాలెంట్ ఉండి దానిని ఎలా బయటపెట్టాలో తెలియని ఎంతో మందికి ఇది వేదికలా మారింది. రీల్స్, వీడియోలతో పలువురు ప్రతిభావంతులు తమ టాలెంట్‌ని నిరూపించుకుని ఎన్నో అవకాశాలు పొందారు. కొంతమంది ఇంకా పొందుతున్నారు. ఏదైనా కానీ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ని చూపించుకొని ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్న నటీనటులు చాలామంది ఉన్నారు.. అలాంటి వారిలో యూట్యూబర్ దీప్తి సునయన ఒకరు.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ మెటీరియల్ అనే చెప్పాలి. అందానికి తగ్గట్లు అభినయం కూడా ఉండడంతో ఆమెకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే కేవలం యూట్యూబ్ కి మాత్రమే ఈమె పరిమితమైనట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న దీప్తి సునైనా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాకా అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇస్తూ ఒక టాటూ ని రివిల్ చేసింది. ప్రస్తుతం టాటూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
దీప్తి సునయన గురించి చెప్పాలంటే.. ఈమె ఒక హైదరాబాద్ ఈ అమ్మాయి.. షార్ట్ ఫిలింస్, ఇతర వీడియోలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకుంది. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ సీజన్ 2 తెలుగులో ఛాన్స్ కొట్టేసింది. అందులో తన అమాయకత్వం తన ఆటతీరు తన మాట తీరుతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. హౌస్ లో ఆమె టాస్కులు చేసింది తక్కువైనా చాలా వారాలు హౌస్ లోనే ఉంది. తన క్యూట్ నెస్ తన అందం ప్లస్ గా మారింది. హౌస్‌లో ఉన్న సమయంలో యంగ్ హీరో తనీష్‌తో క్లోజ్‌గా ఉంటూ కుర్రాళ్లకు షాకిచ్చింది. బిగ్‌బాస్ తర్వాత తెలుగునాట బాగా పాపులర్ అయ్యారు దీప్తి..
దీప్తికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ , దీప్తి సునైనా పీకలతో ప్రేమలో మునిగిపోయారు. అయితే బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య బ్రేకప్ అయినట్టు వార్తలు వినిపించాయి. షన్నూతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తోన్న దీప్తి తన కెరీర్‌పై గట్టిగా ఫోకస్ చేశారు. కెరీర్ ను బిజీగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది. షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ ఆల్బమ్స్‌లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఖాళీ సమయాల్లో విహారయాత్రలకు వెళ్లే దీప్తిలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. ఇటీవల తన ఫ్రెండ్స్ మెహబూబ్, దెత్తడి హారికలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీప్తి.. రీసెంట్ కాశీ విశ్వనాధుని కూడా దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమె తన చేతిపై ఒక టాటూను కూడా వేయించుకుంది.. ఆ టాటూ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శివుడి ప్రతి రూపాన్ని టాటూగా వేయించుకుంది. నీ వెనకే నేను అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దాంతో ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈమె షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బిజీగా ఉంది..