OTT Movie : హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఈ సినిమాలలో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ కే ఎక్కువగా ఫీదా అవుతారు మూవీ లవర్స్. హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సినిమాలకు వీళ్ళు పెట్టే బడ్జెట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అవుట్ పుట్ కూడా క్వాలిటీ గానే వస్తుంది. హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సైన్సు ఫిక్షన్ మూవీ, డిఫరెంట్ స్టోరీ తో ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘ఐ బాయ్‘ (iBoy). ఈ మూవీకి ఆడం రాండల్ దర్శకత్వం వహించాడు. ఒక ప్రమాదంలో కోమా నుండి ఒక యువకుడు బయటపడతాడు. స్మార్ట్‌ఫోన్ శకలాలు అతని మెదడులో ఉండటంతో అతనికి సూపర్ హ్యూమన్ పవర్స్ వస్తాయి. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
టామ్ ఒక కాలేజ్ స్టూడెంట్. ఇతనికి డాని అనే ఫ్రెండ్ కూడా ఉంటాడు. టామ్ కి ఫోన్ లేకపోవడంతో, ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ వాడుకోమని డాని అతనికి ఇస్తాడు. ఆ తర్వాత లూసీ అనే అమ్మాయితో టామ్ కి పరిచయమవుతుంది. ఆమెతో మాట్లాడటానికి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు అక్కడ లూసీ బ్రదర్ రక్తపు మడుగులో పడి ఉంటాడు. లూసీ గట్టిగా అరుస్తూ ఉంటుంది. టామ్ అక్కడికి వెళ్లి చూడగా లూసీని ఎవరో అఘాయిత్యం చేస్తూ ఉంటారు. దానిని ఒక వ్యక్తి వీడియో కూడా తీస్తుంటాడు. టామ్ ని చూడగానే గన్ తీసుకొని షూట్ చేస్తారు. అయితే ఆ బుల్లెట్ టామ్ ఫోన్ కి తగిలి పేలిపోతుంది. ఆ తర్వాత హాస్పిటల్ లో అతనికి ఆపరేషన్ చేస్తారు. ఫోన్ పేలిపోవడంతో అందులో ఉండే సెల్ ఫోన్ విడిభాగాలు అతని మెదడులో చిక్కుకొని ఉంటాయి. ఆపరేషన్ ద్వారా కొన్నిటిని తీసేస్తారుగాని, కొన్ని మాత్రమే మెదడులో ఉండిపోతాయి. ఏదైనా సీరియస్ అయితే హాస్పిటల్ కి రమ్మని డాక్టర్లు చెబుతారు. అప్పటినుంచి టామ్ కి ఎదుటి వ్యక్తులు ఫోన్లో ఏం చేస్తున్నారో ప్రతిదీ తెలిసిపోతూ ఉంటుంది.
అతడు ఫోన్లను, టెక్నాలజీని హ్యాక్ చేయగలిగే శక్తిని పొందుతాడు. అలా తన శక్తి గురించి తెలుసుకున్న టామ్, లూసిపై దాడి చేసిన వాళ్లని శిక్షించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే వాళ్ల ఫోన్లను హ్యాక్ చేసి, వాళ్ల సీక్రెట్స్ తెలుసుకొని ఇబ్బంది పెడతాడు. వీళ్లంతా డ్రగ్స్ డీలర్లకు అనుచరులుగా ఉంటారు. లూసి బ్రదర్ ని వీళ్ళ గ్యాంగ్ లో చేరమంటారు. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో లూసిపై ఈ పని చేసి ఉంటారు. చివరికి కొంతమందిని తన టెక్నాలజీ పవర్ ద్వారా జైలుకు పంపుతాడు టామ్. అయితే ఈ విషయం గ్యాంగ్ స్టర్ కి తెలుస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారో కనిపెట్టాలనుకుంటాడు గ్యాంగ్ స్టర్. ఈ క్రమంలోనే ఇదంతా చేస్తున్నది టామ్ అని తెలుసుకుంటాడు. టామ్, లూసీని ఒకచోట బంధిస్తాడు గ్యాంగ్ స్టర్. చివరికి వీళ్ళిద్దరూ ఆ గ్యాంగ్ స్టర్ నుంచి తప్పించుకుంటారా? టామ్ వాళ్లందరికీ శిక్ష వేస్తాడా? అతనికి ఉన్న సూపర్ పవర్ అలాగే ఉంటుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే.