E-Paper
Advertisement

Jana Nayagan OTT: విజయ్ జన నాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్..ఎప్పుడు?ఎక్కడంటే?

Jana Nayagan OTT: విజయ్ జన నాయగన్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్..ఎప్పుడు?ఎక్కడంటే?
Advertisement

Jana Nayagan OTT: కోలీవుడ్ స్టార్ విజయ్ థళపతి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జన నాయగన్(Jana Nayagan). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ (Vijay)సరసన పూజా హెగ్డే నటించగా విజయ్ కూతురి పాత్రలో మమితా బైజు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఓటీటీ విడుదల గురించి కూడా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అమెజాన్ ప్రైమ్..

ఈ సినిమా అన్ని భాష ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ ప్రకారం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించిన హక్కులను అమెజాన్ ప్రైమ్ కైవసం చేసుకున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి అధికారక ప్రకటన కూడా వెల్లడి కానుంది. ఇక ఈ సినిమా విజయ్ ఆఖరి సినిమా కావటం విశేషం. ఈయన టీవీ కె పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజకీయాల పరంగా విజయ్ పూర్తిస్థాయిలో దృష్టి సారించబోతున్న నేపథ్యంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసారు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్..

Advertisement

ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ చూస్తుంటే కనుక ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari)సినిమాకు రీమేక్ సినిమా అని స్పష్టమవుతుంది. అచ్చం ఆ సినిమాలో ఉన్న సన్నివేశాలను జననాయగన్ ట్రైలర్లో చూపించడంతో ఈ సినిమా పక్క రీమేక్ సినిమా అని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో చూస్తామని తెలుగు ప్రేక్షకులు కామెంట్లు రూపంలో తెలియపరుస్తున్నారు.

భగవంత్ కేసరి రీమేక్..

Advertisement

ఈ సినిమా మొదటి నుంచి కూడా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు పై దర్శకుడు హెచ్ వినోద్ స్పందిస్తూ ఈ సినిమా ఏ సినిమాకు రీమేక్ సినిమా కాదని, ఇది కేవలం నటుడు విజయ్ సినిమా అని మాత్రమే చెప్పుకు వచ్చారు. ఇక అనిల్ రావిపూడి కూడా ఈ సినిమా విషయంలో స్పందించారు. ఈ సినిమా విషయంలో వాళ్ళు నిజం దాస్తున్నారని, ఈ సినిమాలో మన పాత్ర ఉందా లేదా అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాల్సిందేనని అనిల్ రావిపూడి తెలిపారు. కానీ ట్రైలర్ విడుదలైన అనంతరమే ఈ సినిమా భగవంత్ రీమేక్ అని స్పష్టం అవుతుంది. మరి ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి ఆదరణ వస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Naa Anveshana: ఆస్ట్రేలియాలో నా అన్వేషణ పై కేసు నమోదు.. విదేశాలలోనూ మొదలైన వ్యతిరేకత!

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×