E-Paper
Advertisement

North Korea: నార్త్‌‌కొరియా కిమ్ బెదిరింపులు.. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం, వార్నింగ్ ఎవరికి?

North Korea:  నార్త్‌‌కొరియా కిమ్ బెదిరింపులు.. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం,  వార్నింగ్ ఎవరికి?
Advertisement

North Korea: దక్షిణ కొరియా అధినేత లీ మిత్రదేశం చైనా పర్యటనకు శ్రీకారం చుట్టారు. కొన్ని గంటల తర్వాత ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో తూర్పు ఆసియాలో మళ్లీ అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో అటు జపాన్ కూడా అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

నార్త్‌‌కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

Advertisement

Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేయడం, ఇది జరిగిన కొద్ది గంటలకు నార్త్‌కొరియా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో మొదటిసారి ప్రపంచంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. విరామం తర్వాత ఉత్తర కొరియా మళ్లీ క్షిపణి ప్రయోగాలు మొదలుపెట్టింది. నార్త్‌కొరియా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వం గురించి దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రెండు నెలల తర్వాత కొరియా జరిపిన తొలి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష ఇదే. క్షిపణి సముద్రంలో పడిపోయి ఉంటుందని జపాన్ భావిస్తోంది. ఇలావుండగా ఆదివారం ఉదయం రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని తీరం నుంచి నార్త్‌కొరియా పలు క్షిపణులను ప్రయోగించిందని సౌత్‌కొరియా సైన్యం ప్రకటన చేసింది.

అలర్టయిన సౌత్‌కొరియా-జపాన్ దేశాలు

ఉన్నట్లుండి నార్త్‌కొరియా ఎందుకు ఇలా చేస్తోంది? ప్రత్యర్థులను తన దారికి తెచ్చుకునేందుకు ఎత్తుగడ. లేకుంటా అమెరికా దూకుడు కళ్లెం వేయాలని ఈ స్కెచ్ వేసిందా? అంటూ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు.

కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సానుకూలంగా స్పందిస్తారని దక్షిణకొరియా భావిస్తున్న తరుణంలో క్షిపణులతో కవ్వింపులకు దిగుతోంది ఆ దేశం. ఇలావుండగా నార్త్‌కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ శనివారం ఆ దేశ ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారు. క్షిపణుల ఉత్పత్తి రెట్టింపు చేయాలని ఆదేశించారు. అణుశక్తితో నడిచే జలాంతర్గామిని పరిశీలించారు.

ALSO READ: వెనిజులాలో రాజకీయ సంక్షోభం.. రష్యాకు ఆదేశ ఉపాధ్యక్షురాలు

పార్టీ సమావేశాలలోపు సైనిక బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు కిమ్ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం వెనిజులాలో ఏమి జరుగుతుందో చూసిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ ఎక్కువగా భయపడుతున్నాడని, అందుకే ఈ ప్రయోగం చేసినట్టు యోన్సే విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసర్ చెబుతున్నారు. పొరుగు దేశం క్షిపణుల ప్రయోగాలు అంతర్జాతీయ సమాజం శాంతి-భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి అన్నారు. మొత్తానికి తూర్పు ఆసియాలో మళ్లీ క్షిపణి అలజడి మొదలైంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×