E-Paper
Advertisement

Crime Thriller OTT : అమ్మాయిల తలలు తెగ్గోసే సీరియల్ కిల్లర్… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

Crime Thriller OTT : అమ్మాయిల తలలు తెగ్గోసే సీరియల్ కిల్లర్… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ
Advertisement

Crime Thriller OTT : ‘రాట్ససన్’ లాంటి ఇంటెన్స్ సైకో థ్రిల్లర్ కోసం ఓటీటీలో వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. విభిన్నమైన కథలతో, ఊహకందని స్క్రీన్ ప్లేతో సినిమాలు తీసి ఆకట్టుకుంటాడు డైరెక్టర్ మిస్కిన్. విశాల్ తో ‘డిటెక్టివ్’ అనే సినిమాను తీసి తెలుగులోనూ ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గ్రిప్పింగ్ తమిళ సైకో థ్రిల్లరే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తమిళ చిత్రం పేరు ‘సైకో’ (psycho). పేరులోనే సైకో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీకి డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహించారు. ఉదయనిధి స్టాలిన్ ఇందులో హీరోగా నటించారు. రాజ్ కుమార్, అదితి రావ్ హైదరి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో నటించారు. అరుణ్ మోజి మణికం నిర్మించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఇళయరాజా. 2020లో విడుదలైన ఈ మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. థియేటర్లలో అప్పట్లో తమిళంలో మాత్రమే విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మాయిలను మాత్రమే చంపే సీరియల్ కిల్లర్, వాడిని పట్టుకోవడానికి పరుగులు పెట్టే పోలీసులు, తన ప్రేయసిని కిడ్నాప్ చేసిన వాడిని పట్టుకోవడానికి బయల్దేరే కళ్ళు లేని ప్రేమికుడు… ఇలా మెయిన క్యారెక్టర్స్ తో మూవీ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.

Advertisement

Read Also : ఒక్క ఓటీటీ కూడా కొనని వెబ్ సిరీస్… దానికోసమే ప్రత్యేకంగా వెబ్ సైట్… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

స్టోరీలోకి వెళ్తే…

కోయంబత్తూర్ లో అమ్మాయిలను ఎత్తుకెళ్తాడు ఒక సైకో. తరువాత వాళ్ళ తలలు నరికేస్తాడు. తలలు లేని ఆ అమ్మాయిల మొండెంను ఎక్కడో ఒక చోట పారేస్తాడు. ఇలాంటి ఒళ్లు గగుర్పొడిచే మర్డర్స్ ను చూసి జనాలు భయభ్రాంతులకు గురవుతారు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. కిల్లర్ మాత్రం దర్జాగా వరుస హత్యలు చేస్తూ, పోలీసులకు చెమటలు పట్టిస్తాడు. ఈ నేపథ్యంలోనే దాహిణి (అదితి రావు హైదరి) అనే అమ్మాయిని ఆ కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు.

Advertisement

ఇప్పటి వరకూ కిడ్నాప్ చేసిన అమ్మాయిలు అందరినీ చంపేసిన ఆ సైకో… హీరోయిన్ ను మాత్రం చంపకుండా బంధించి ఉంచుతాడు. దానికో ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఆలోగా దాహిణిని ప్రేమించిన గౌతమ్ (ఉదయ్ నిధి స్టాలిన్) ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. అతనికి కళ్ళు కనిపించకపోయినా సైకోను పట్టుకోవడానికి తన తెలివితేటలు ఉపయోగిస్తాడు. వికలాంగురాలైన మాజీ పోలీస్ కమల (నిత్య మీనన్) హీరోకి సహాయం చేస్తుంది. అసలు కిల్లర్ హీరోయిన్ ను ఎందుకు చంపలేదు ? ఎందుకిలా హత్యలు చేస్తున్నాడు ? పోలీసులకే చిక్కని ఆ కిల్లర్ హీరో చేతికి ఎలా చిక్కాడు ? అన్నది తెరపై చూడాల్సిందే.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×