E-Paper
Advertisement

Dhurandhar 2 OTT:ఓటీటీ  పార్ట్నర్ ను మార్చేసిన ధురంధర్ 2 … ఈ సారి స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Dhurandhar 2 OTT:ఓటీటీ  పార్ట్నర్ ను మార్చేసిన ధురంధర్ 2 … ఈ సారి స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Dhurandhar 2 OTT: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్(Ranaveer Singh) ఇటీవల యాక్షన్ స్పై చిత్రంగా ధురంధర్(Dhurandhar) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.. ఇలా ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇలా వందల కోట్ల కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్(Net Flix) లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థియేటర్లో వచ్చినంత ఆదరణ నెట్ ఫ్లిక్స్ లో దక్కించుకోలేకపోయింది. థియేటర్లలో ప్రసారమై దాదాపు 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాపడుతూ సంచలనాలను సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.

అంచనాలు పెంచిన టీజర్..

ధురంధర్ 2 (Dhurandhar 2)సినిమాను మేకర్స్ మార్చి 19వ తేదీ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇన్ని రోజులపాటు ఈ సినిమా విడుదల విషయంపై ఎన్నో సందేహాలు ఉండేవి కానీ చిత్ర బృందం అధికారకంగా విడుదల తేదీని ప్రకటించడంతో సినిమా పట్ల మంచి అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.. టీజర్ వీడియో సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హాట్ స్టార్ చేతికి ధురంధర్ 2 ..

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఈసారి నెట్ ఫ్లిక్స్ కాకుండా జియో హాట్ స్టార్(Jio Hot Star) కైవసం చేసుకుందని తెలుస్తోంది.. ఇలా ఈ సినిమా సీక్వెల్ డిజిటల్ రైట్స్ జియో హాట్ స్టార్ దక్కించుకోవడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా పార్ట్ 1 ఎక్కడైతే స్ట్రీమింగ్ అవుతుందో సీక్వెల్ కూడా అదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారమవుతుంది కానీ, ధురంధర్2 విషయంలో మాత్రం భిన్నంగా జరిగింది.

భారీ డీల్ ఆఫర్ చేసిన హాట్ స్టార్..

Advertisement

ఇలా ధురంధర్ 2 ఓటీటీ పార్ట్నర్ మారిపోవడానికి కారణం లేకపోలేదని చెప్పాలి . పార్ట్ వన్ థియేటర్లలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్ సినిమాపై కూడా అంతకుమించి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే హాట్ స్టార్ భారీ డీల్ ఆఫర్ చేయడంతోనే ఈ సినిమా డిజిటల్ రైట్స్ హాట్ స్టార్ చేతికి వెళ్లాయని తెలుస్తోంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ సారా అర్జున్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పై యాక్షన్ సీక్వెల్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి ఈ సీక్వెల్ సినిమా ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు పోటీగా కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాల విడుదలపై మరింత ఆసక్తి నెలకొంది.

Also Read: Vijay Rashmika Wedding: రష్మిక విజయ్ పెళ్లి ఫిబ్రవరి 26నే..ఫుల్ క్లారిటీ ఇచ్చిన రష్మిక!

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×