E-Paper
Advertisement

Vijay Rashmika Wedding: రష్మిక విజయ్ పెళ్లి ఫిబ్రవరి 26నే..ఫుల్ క్లారిటీ ఇచ్చిన రష్మిక!

Vijay Rashmika Wedding: రష్మిక విజయ్ పెళ్లి ఫిబ్రవరి 26నే..ఫుల్ క్లారిటీ ఇచ్చిన రష్మిక!
Advertisement

Vijay Rashmika Wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక(Rashmika) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)వివాహం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో విజయ్ దేవరకొండ రష్మిక కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకున్నప్పటికీ వీరి నిశ్చితార్థం గురించి విజయ్ దేవరకొండ గానీ రష్మిక గాని ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు. ఇలా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ముస్తాబవుతున్న ఉదయపూర్ ప్యాలెస్..

విజయ్ దేవరకొండ రష్మిక ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే సోషల్ మీడియాలో వీరి పెళ్లి కోసం ఉదయపూర్ ప్యాలెస్ ముస్తాబవుతున్న వీడియోలు కూడా బయటకు రావడంతో అభిమానులు వీరిద్దరి వివాహపు గడియలు కోసం ఎదురుచూస్తున్నారు. ఇక వీరిద్దరూ ఉదయపూర్ లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని స్పష్టం అవుతుంది. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగబోతుందని తెలుస్తోంది.

ఫిబ్రవరి 26న వివాహం..

Advertisement

ఇలా పెళ్లి వేడుకలు మొదలైనప్పటికీ రష్మిక మాత్రం ఎక్కడా తన పెళ్లి తేదీ గురించి వెల్లడించలేదు. అయితే తాజాగా ఈమె పెళ్లి తేదీ పై స్పందించారని తెలుస్తోంది. ఇటీవల రష్మిక ముంబై నుంచి హైదరాబాద్ రావడంతో ఎయిర్ పోర్టులో ఒక అభిమాని రష్మిక తో మాట్లాడుతూ కంగ్రాట్యులేషన్స్ రష్మిక అని చెప్పగా దేనికి రా అంటూ రష్మిక మాట్లాడటంతో ఫిబ్రవరి 26 వెడ్డింగ్ అంటూ అభిమాని చెప్పగా రష్మిక నవ్వుతూ థాంక్యూ అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా ఫిబ్రవరి 26న పెళ్లి కంగ్రాట్స్ అని అభిమాని చెప్పగా రష్మిక థాంక్యూ అనడంతో వీరి పెళ్లి అదే రోజేనని రష్మిక కన్ఫర్మ్ చేసేసింది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

?igsh=MTR6NDl4dXNxbXFkaQ%3D%3D

Advertisement

ఇక త్వరలోనే రష్మిక విజయ్ దేవరకొండ సరైన సమయం చూసుకొని వీరి పెళ్లి తేదీని అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తారా లేదంటే కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ వివాహపు వేడుక జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక వీరి వివాహం ఉదయపూర్ ప్యాలెస్ లో జరిగినప్పటికీ హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక రష్మిక విజయ్ దేవరకొండ గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో నటించారు. ఈ సినిమాల సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఇక తాజాగా వీరిద్దరూ కలిసి రణబాలి అనే సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే.

Also Read: Takshakudu: ఆనంద్ దేవరకొండ తక్షకుడు టీజర్ అప్డేట్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×