E-Paper
Advertisement

K Dramas OTT : రొమాన్స్ నుంచి క్రైమ్ -కామెడీ వరకు… జనవరిలో రిలీజ్ కాబోతున్న కొరియన్ సినిమాలు, సిరీస్ లు ఇవే…

K Dramas OTT : రొమాన్స్ నుంచి క్రైమ్ -కామెడీ వరకు… జనవరిలో రిలీజ్ కాబోతున్న కొరియన్ సినిమాలు, సిరీస్ లు ఇవే…
Advertisement

K Dramas OTT : ఈ నెల కె డ్రామా ప్రియులకు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే జనవరిలో అనేక అద్భుతమైన సిరీస్ లు వస్తున్నాయి. ఇవి రొమాన్స్, థ్రిల్లర్, ఫాంటసీలతో ఆసక్తికరమైన కథనాలను అందిస్తున్నాయి. కాబట్టి ఈ కొత్త వాటిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.

1. ది జడ్జ్ రిటర్న్స్ (The Judge Returns)

14 ఎపిసోడ్స్ తో నడిచే ఈ సిరీస్ లో జి సంగ్ కరప్ట్ జడ్జ్ పాత్రలో నటించాడు. అతను 10 ఏళ్ల ముందుకు టైమ్ ట్రావెల్ చేసి తన జడ్జ్‌మెంట్స్ మార్చడానికి ప్రయత్నిస్తాడు. పార్క్ హీ సూన్, వాన్ జిన్ అహ్ సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. ఈ లీగల్ ఫాంటసీ డ్రామా జనవరి 2న నుంచి HBO Max, Viki, Wavveలో స్ట్రీమింగ్ అవుతోంది. కిమ్ సంగ్-హో దర్శకత్వంలో రూపొందిన ఈ లీగల్ డ్రామా థ్రిల్లర్ ప్రియులకు మస్ట్ వాచ్.

2. టు మై బిలవ్డ్ థీఫ్ (To My Beloved Thief)

Advertisement

జనవరి 3 నుంచి 16 ఎపిసోడ్స్ తో ఈ హిస్టారికల్ డ్రామా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో జంగ్ హే-ఇన్, జంగ్ సో-మిన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఒక థీఫ్, రాయల్ ప్రిన్సెస్ మధ్య జరిగే ప్రేమ కథతో ఈ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది. Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కిమ్ జిన్-మిన్ డైరెక్షన్ లో రూపొందింది.

3. స్ప్రింగ్ ఫీవర్ (Spring Fever)

జనవరి 5 నుంచి ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ ఒక ఉపాధ్యాయురాలి చుట్టూ తిరుగుతుంది. సిటీ నుంచి గ్రామీణ ప్రాంతంలోకి వచ్చిన ఆమె ఒక వ్యక్తిని కలుస్తుంది. ఆ తరువాత స్టోరీ లవ్ ట్రాక్ కి వెళ్తుంది.

4. కెన్ దిస్ లవ్ బి ట్రాన్స్‌లేటెడ్? (Can This Love Be Translated?)

Advertisement

జనవరి 16న Netflixలో వచ్చే ఈ రొమాన్టిక్ కామెడీ సిరీస్ లో కిమ్ సూన్ హ్యూన్, గో క్యుంగ్ ప్యో లీడ్ రోల్స్ లో నటించారు. ఒక ట్రాన్స్‌లేటర్, సినీ స్టార్ మధ్య ప్రేమ కథ నడుస్తుంది. ఈ క్యూట్, ఫన్ స్టోరీ రొమాన్స్ కామెడీ ఫ్యాన్స్‌కు సూపర్.

5. నో టేల్ టు టెల్ (No Tale to Tell)

జనవరి 26న SBSలో ప్రీమియర్ అవుతున్న ఈ మిస్టరీ డ్రామాలో కిమ్ హ్యే యూన్ ఇన్‌వెస్టిగేటర్ పాత్రలో నటించారు. ఇది ఒక సీరియల్ కేసు చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్. Netflix దీనిని చూడవచ్చు.

6. అండర్ కవర్ మిస్ హాంగ్ (Under Cover Miss Hong)

జనవరి 17న వచ్చే ఈ స్పై థ్రిల్లర్ లో పార్క్ షిన్ హే సీక్రెట్ అండర్‌కవర్ ఏజెంట్ పాత్రలో నటించారు. ఈ ఉత్కంఠభరితమైన స్టోరీ 1990ల కాలంలో సెట్ చేయబడింది. ఒక కంపెనీలో అవినీతిని వెలికితీసే అండర్ కవర్ వాచ్‌డాగ్ ఏజెంట్ పాత్రను పార్క్ షిన్ హే పోషించింది. దీనిని జనవరి 17 నుండి టీవీఎన్‌, నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

7. పాజిటివ్‌లీ యువర్స్ (Positively Yours)

జనవరిలో ప్రీమియర్ అవుతున్న ఈ వెబ్‌టూన్ అడాప్టేషన్ రొమాన్స్ డ్రామాలో షిన్ డా-జంగ్, చోయి డా-ఇల్ లీడ్ రోల్స్ లో నటించారు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే ఒక జంట చుట్టూ తిరిగే ఈ కామెడీ స్టోరీ జనవరి 17 నుండి వికీలో ప్రసారం అవుతుంది.

Read Also :  ఆస్కార్ రేసులోకి అడుగుపెట్టిన మరాఠీ మూవీ ‘దశావతార్’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×