BigTV English

OTTMovie : మొదటి రాత్రే పైకి పోయే పెళ్లి కొడుకు … ప్రియుడి ఆత్మతో గందరగోళం… మైండ్ బ్లాక్ చేసే మిస్టరీ థ్రిల్లర్

OTTMovie : మొదటి రాత్రే పైకి పోయే పెళ్లి కొడుకు … ప్రియుడి ఆత్మతో గందరగోళం…  మైండ్ బ్లాక్ చేసే మిస్టరీ థ్రిల్లర్

OTTMovie : బెంగాల్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇప్పుడు కొత్త కొత్త స్టోరీలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలతో ఓటీటీ లో అదరగొడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్, ఊహకు అందని ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంది. ఇందులో మొదటి రాత్రే భర్త చనిపోతాడు. దీని వెనక అసలు కారణం క్లైమాక్స్లో తెలుస్తుంది. ఈ క్రమంలో ఎన్నో రహస్యాలు బయటపడతాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ బెంగాలీ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘కాలరాత్రి’ (Kaalraatri). 2024 లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కి అయాన్ చక్రబోర్తి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో సౌమిత్రిషా కుండూ ప్రధాన పాత్రలో నటించింది. రుపంజన మిత్రా, రాజ్‌దీప్ గుప్తా, సైరిటీ బెనర్జీ, దిపన్విత సర్కార్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ స్టోరీ దేబీ అనే నవవధువు చుట్టూ తిరుగుతుంది. ఇది హోయిచోయ్ (Hoichoi) , ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ (Airtel Xtream) , ప్రైమ్ వీడియోల (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘కాలరాత్రి’ అనే పదం బెంగాలీ వివాహ సంప్రదాయంలో, నవవధువు తన అత్తవారింట్లో గడిపే మొదటి రాత్రిని ఇలా పిలుస్తారు.


స్టోరీలోకి వెళితే

దేబీకి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. రాయ్ బర్మన్ కుటుంభంలో పెద్ద కొడుకు రుద్రతో పెళ్లి జరుగుతుంది. ఆమె పెళ్లి రోజున, ఆమె స్నేహితురాలు మాయా ఒక భయంకరమైన జోస్యం చెబుతుంది. ఆమె భర్త చనిపోతాడాని చెప్పడంతో దేబీ షాక్ అవుతుంది. ఆమె భర్త రుద్ర మరణం గురించి చెప్పిన ఆ జోస్యం మరుసటి రోజు నిజమవుతుంది.దేబీ భర్త రుద్ర హత్యకు గురవుతాడు. దేబీ, దు:ఖంలో మునిగిపోయి, తన కొత్త కుటుంబం అయిన రాయ్ బర్మన్ కుటుంబంలోని రహస్యాలు, కుట్ర కోణం లో చిక్కుకుంటుంది. డిఎస్‌పీ సత్యాకి సన్యాల్ ఈ కేసును విచారిస్తూ, దేబీ చీకటి రహస్యాన్ని కనుగొంటాడు. రాయ్ బర్మన్ కి నలుగురు కొడుకుల ఉంటారు. ఆ కుటుంభంలో కొన్ని గందరగోళ పరిస్తితులు ఉంటాయి. పెద్దవాడు ఇప్పుడు చనిపోవడంతో మిగతా వాళ్ళను కూడా అనుమానిస్తారు పోలీసులు. రుద్ర కి ఇదివారకే మొదటి భార్య చనిపోయి ఉంటుంది. ఆమె ఎలా చనిపోయింది అనే విషయం రహస్యంగానే ఉంచుతారు. దేబీ కి కూడా గతంలో ఒక ప్రియుడు ఉంటాడు. అతను ఇప్పుడు ఆత్మ రూపంలో ఆమెను నీడలా వెంబడిస్తాడు. చివరికి రుద్రను ఎవరు హత్య చేస్తారు ? రుద్ర మొదటి భార్య ఎలా చనిపోతుంది ? దేబీ గతంలో ఉన్న రహస్యాలు ఏమి ఉంటాయి ?  ఈ విషయాలను, ఈ బెంగాలీ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్ ను చూసి తలుసుకోండి.

Read Also : మనుషులను చంపే తోడేళ్ళ గుంపు … బుర్ర పాడు చేసే క్రేజీ యాక్షన్-థ్రిల్లర్

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×