E-Paper
Advertisement

Bangalore Crime News: 5 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై హత్య, నిందితుడ్ని ఏం చేశారంటే

Bangalore Crime News: 5 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై హత్య, నిందితుడ్ని ఏం చేశారంటే
Advertisement

Bangalore Crime News: కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్నారులు ఒంటరిగా కనిపిస్తే చాలు మృగాళ్లుగా మారిపోతున్నారు. వీళ్ల దాటికి అన్నెం పుణ్యం తెలియని బాలికలు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా కర్ణాటకలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి చంపేశాడు ఓ వ్యక్తి. ఆపై పోలీసులపై దాడికి యత్నించాడు. చివరకు పోలీసులు నిందితుడ్ని ఎన్‌కౌంటర్ చేశారు.  ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన ఓ దంపతులకు ఐదేళ్ల బాలిక ఉంది. చిన్నారి తల్లి బ్యూటీ పార్లర్‌లో పని చేస్తోంది. ఆమె తండ్రి పెయింటర్. ప్రతీ రోజూ వారి పనుల్లో బిజీగా ఉండేవారు. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడాన్ని గమనించాడు 35 ఏళ్ల రితేష్‌కుమార్. ఈ కామాంధుడి కళ్ల ఆ బాలికపై పడింది.

Advertisement

ఒకరోజు బాలికను ఇంటి నుంచి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు తెలిస్తే తన పనైపోతుందని భావించాడు. చివరకు బాలికను హత్య చేశాడు. చివరకు పేరెంట్స్ వెతికారు. ఈ దంపతులు ఇంటికి ఎదురుగా ఉన్న చిన్న భవనంలోని బాత్రూంలో కనిపించింది. అది చూసి పేరెంట్స్ షాకయ్యారు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు.

ఈ వ్యవహారంపై కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తడం మొదలయ్యాయి. చివవరకు ఈ కేసుపై పోలీసులు దృష్టిపెట్టారు. బాలిక ఇంటి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లో నిందితుడు చేసిన వ్యవహారం బయటపడింది. దీంతో నిందితుడు రితేష్ కుమార్‌ని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద హత్య అభియోగాలు మోపారు.

Advertisement

ALSO READ: దంపతుల సూసైడ్, ఆ పిల్లల పరిస్థితి ఏంటి?

నిందితుడు చాలా సంవత్సరాలుగా ఇంటికి దూరంగా ఉన్నాడని తేలింది. అందుబాటులో ఉన్న చోట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దాదాపు మూడు నెలల కిందట రితేష్ కుమార్ హుబ్బళ్లికి వచ్చాడు. అండర్‌పాస్ సమీపంలో పాడుబడిన ఇంట్లో ఉంటున్నాడు.

సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు నిందితుడ్ని కొప్పల్ ప్రాంతానికి తీసుకెళ్లారు పోలీసులు. ఆదివారం తెల్లవారుజామున నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో పోలీసులపై దాడి చేసి తప్పించు కున్నాడు. వాహనంపై రాళ్లు రువ్వాడు. ఈ ఘటనలో మహిళా అధికారి గాయపడింది. గాయపడిన అధికారిణి పోలీసుల వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక వ్యవహారంపై పోలీసులు ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ అతడి కాలికి తగిలింది, మరొకటి వీపుకు తగిలిందని పోలీసులు తెలిపారు.  అక్కడి నుంచి పారిపోయే పాడుబడిన ఇంట్లో ఉన్నాడు. వెంటనే పోలీసులు నిందితుడ్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నిందితుడు మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.

పై విషయాలను కొప్పల్ పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు. నిందితుడు ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో బాధిత బంధువుల ఆవేశాలు కాస్త శాంతించాయి.  తమ కూతురికి న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. ఎన్‌కౌంటర్ వ్యవహారంపై పోలీసులపై ఆరోపణలు మొదలయ్యాయి.

ALSO READ: లిప్ట్ మీద పడి డాక్టర్ మృతి

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×