BigTV English

Group War In ADONI: ఆదోనిలో అదోరకం! కూటమిలో మూడు ముక్కలాట ఎందుకు మొదలైంది?

Group War In ADONI: ఆదోనిలో అదోరకం! కూటమిలో మూడు ముక్కలాట ఎందుకు మొదలైంది?

 Group War In ADONI: 3 పార్టీలు.. నాలుగు గ్రూపులు. ఒకరంటే ఒకరికి పడదు. ఎవ్వరినీ.. ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ.. అందరికీ గుర్తింపు కావాలి. అన్నింట్లో వాళ్లే ముందుండాలి. కానీ.. అన్నిసార్లు.. అన్నీ కుదరట్లేదు. పక్కన పెట్టేస్తున్నారని ఒకరు.. పట్టించుకోవట్లేదని ఇంకొకరు.. అసలు మీతో పనేంటని మరొకరు.. సర్లే.. ఏదో ఒకటని ఇంకొకరు. ఆదోని రాజకీయమంతా.. అదోరకంగా ఉంది. కూటమిలో.. ఈ మూడు ముక్కలాట ఎందుకు మొదలైంది? ఆదోని పొలిటికల్ పిక్చర్‌లో కనిపిస్తున్న రంగులేంటి?


ఆదోని బీజేపీ ఎమ్మెల్యే టీడీపీ నేతల్ని పట్టించుకోవట్లేదా?

కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా గడవకముందే.. కర్నూలు జిల్లా ఆదోని రాజకీయం అదోరకంగా మారిపోయింది. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి డాక్టర్ పార్థసారథి గెలిచారు. ఆదోని ప్రజలు మార్పును బలంగా కోరుకోవడంతో.. స్థానికేతరుడైనప్పటికీ పార్థసారథికి పట్టం కట్టారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత కొన్ని నెలల వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు కూటమిలో వర్గపోరు మొదలైందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోనే.. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడి వర్గం, మహిళా నేత గుడిసె కృష్ణమ్మ గ్రూపులు కొనసాగుతున్నాయి. ఇక.. జనసేన ఇంచార్జ్ మల్లప్ప వర్గం, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వర్గంతో.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితులున్నాయ్. ఇదే.. లోకల్ పాలిటిక్స్‌లో కొత్త హీట్ పుట్టిస్తోంది.


వైసీపీ కసితో పార్థసారథికి పట్టం కట్టిన ఆదోని

గత వైసీపీ పాలకులపై ఉన్న కసితో.. ఆదోని ప్రజలంతా పార్థసారథికి పట్టం కట్టారు. 18 వేలకు పైగా మెజారిటీతో గెలిపించారు. వైసీపీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న ముస్లిం, మైనార్టీలు సైతం బీజేపీ వైపు మొగ్గు చూపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ.. కొద్ది నెలల్లోనే ఆదోనిలో పొలిటికల్ పిక్చర్ మారిపోయిుంది. పార్థసారథి ఎమ్మెల్యేగా గెలిచాక.. కూటమిలోని కీలక నేతలను దూరం పెట్టేశారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే తీరు నచ్చక మీనాక్షి నాయుడు దూరమవగా.. జనసేన నేత మల్లప్ప.. అవకాశం కోసం అనుసరించక తప్పట్లేదనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు వైసీపీ నేత సాయిప్రసాద్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసిన పార్థసారథి.. ఎమ్మెల్యేగా గెలిచాక కూటమి నేత మీనాక్షి నాయుడిని సైతం.. సాయిప్రసాద్ రెడ్డితో కలిపి విమర్శలు చేయడం.. లోకల్‌గా పెద్ద చర్చకే దారితీసింది.

కూటమి నేతల వర్గ విభేదాలపై అధిష్టానం దృష్టి

ఆదోని కూటమి నాయకుల మధ్య ఏర్పడిన వర్గ విభేదాలపై.. అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత మీనాక్షి నాయుడు, జనసేన నేత మల్లప్ప, బీజేపీ నేత జైన్, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మకు.. అంతా కలిసి పనిచేయాలని అధిష్టానం గతంలోనే సూచించింది. అయినప్పటికీ.. ఎమ్మెల్యే వారిని కలుపుకుపోవట్లేదనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. ఇక.. ఓపిక నశించిన తెలుగు తమ్ముళ్లు.. తమ పరిస్థితిని.. జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడి దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే పార్థసారథి కలుపుకొని వెళ్లడం లేదని ఫిర్యాదు

తమ నాయకుడు మీనాక్షి నాయుడిని.. ఎమ్మెల్యే పార్థసారథి కలుపుకొని వెళ్లడం లేదని.. టీడీపీ క్యాడర్‌ని కూడా పట్టించుకోవడం లేదని.. జిల్లా పర్యటనలో అడ్డుకొని మరీ అన్నీ చెప్పేశారు. దాంతో.. కర్నూల్ గెస్ట్ హౌజ్‌లో జిల్లా టీడీపీ నేతలతో మంతనాలు జరిపారు మంత్రి నిమ్మల. రాజకీయంగా వర్గ పోరుని పక్కనపెట్టి.. కలిసి ముందుకు సాగాలని ఇరు వర్గాలకు సూచించారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. మంత్రిగారి మాటతో.. ఆదోనిలో రాజకీయం మారుతుందా? లేక.. మూడు ముక్కలాటగా ఎవరికి వారే అన్నట్లుగా ఉంటారా? అన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్.

ఆదోనిలో అభివృద్ధి జరగడం లేదని జనంలో అభిప్రాయం

మరోవైపు.. పాత నేతలను పక్కనపెట్టి, కొత్త నాయకుడికి పట్టం కట్టినా.. ఆదోనిలో అభివృద్ధి జరగడం లేదనే అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో ఉందంటున్నారు. వాళ్లకు కావాల్సిన దందాలు మాత్రం బాగా చేసుకుంటున్నారని భగ్గుమంటున్నారట. గతంలో వైసీపీ నేత సాయిప్రసాద్ రెడ్డి, టీడీపీ నేత మీనాక్షి నాయుడు.. ఎవరు అధికారంలో ఉంటే వారు.. నియోజకవర్గంలోని పనుల్ని 60-40గా పంచుకున్నారనే టాక్ ఉంది. ఈ పర్సంటేజీల బంధం వల్లే.. ఆదోని అభివృద్ధి పక్కకు పోయిందనే ఫీలింగ్ జనంలో ఉంది. అందుకోసమే.. వాళ్లిద్దరినీ కాదని కొత్త నాయకుడైన పార్థసారథిని ఆదరిస్తే.. ఆయన కూడా వారి బాటలోనే నడుస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎర్రమట్టి మాఫియా, రేషన్ బియ్యం, ఇసుక, భూదందాలను అరికట్టడంలో విఫలమయ్యారని చెబుతున్నారు. గతంలో జరిగిన అక్రమాలన్నీ ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఫైర్ అవుతున్నారు. వీటన్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టేలా.. కూటమి పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×