Kaantha OTT: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman)ఇటీవల నటించిన తాజా చిత్రం కాంత(Kaantha). ప్రముఖ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ(Bhagya Shri) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటించారు. పిరియాడిక్ జానెర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు రానా నిర్మాతగా వ్యవహరించారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది.
ఇలా నవంబర్ 14వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకోవడంతో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ (Net Flixe)కైవసం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాని డిసెంబర్ 12వ తేదీ నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన నెల రోజులు కూడా పూర్తి కాకుండ ఓటీటీలోకి రావటం విశేషం. దుల్కర్ సల్మాన్ అద్భుతమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా మంచి కంటెంట్ ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఈయన మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు సినిమాలలో నటిస్తూ ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవల దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన సీతారామం లక్కీ భాస్కర్ వంటి సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. నేపథ్యంలోనే కాంత సినిమాపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. మరి ఓటీటీలో అయినా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..
ఈ సినిమా ఒక దర్శకుడు హీరో మద్య కొనసాగే కథ అని చెప్పాలి. ఈ సినిమాలో సముద్రఖని (అయ్య) స్టార్ డైరెక్టర్ గా కనిపిస్తారు. దర్శకుడుగా ఎన్నో సినిమాలను చిత్రీకరించిన అయ్యా తన డ్రీం ప్రాజెక్టు శాంత సినిమాని చేయాలని కోరుకుంటారు. నట చక్రవర్తి టీకే మహదేవన్ అలియాస్ టేకేయం (దుల్కర్) తో చేయాలని భావిస్తారు అందుకు అనుగుణంగానే ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే షూటింగ్ ఆగిపోతుంది. ఇలా ఆగిపోయిన ఈ సినిమా తిరిగి ఎనిమిది సంవత్సరాల తర్వాత షూటింగ్ జరుపుకుంటుంది. డైరెక్టర్ కి ఇష్టం లేకపోయినా హీరోకు నచ్చినట్టుగా ఈ సినిమాని చేస్తూ ఉంటాడు అయితే సినిమా ఒకరోజు షూటింగ్ ఉందనగా స్టూడియోలో హత్య జరుగుతుంది. ఈ హత్య ఎవరు చేశారు? హీరో దర్శకుడికి మధ్య గొడవ ఏంటి? చివరికి వీరిద్దరూ కలిసారా అనేది ఈ సినిమా కథ.