Common Puja Mistakes: ఇంట్లో నిత్యం పూజ చేయడం అనేది దేవుడిపై మన భక్తి, విశ్వాసాన్ని చాటుతుంది. అయితే తెలియక చేసే కొన్ని చిన్న చిన్ని పొరపాట్లు లేదా లోపాల వల్ల ఆ పూజ ఫలితం అందకపోవచ్చు. ఈ లోపాలను తెలుసుకుని సరిదిద్దుకోవడం ద్వారా మన పూజ మరింత శుద్దిగా, సక్రమంగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో సాధారణ పూజా లోపాలు:
1. పరిశుభ్రత లోపాలు:
పూజలో అత్యంత ముఖ్యమైనది పరిశుభ్రత. పరిశుభ్రత విషయంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
స్నానం చేయకుండా పూజించడం: ఉదయం స్నానం చేయకుండా, శుభ్రమైన వస్త్రాలు ధరించకుండా పూజ గదిలోకి అడుగుపెట్టడం లేదా దేవుడిని తాకడం చేయకూడదు.
పాత్రల పరిశుభ్రత: పూజకు ఉపయోగించే రాగి లేదా వెండి పాత్రలు (కలశం, దీపం, హారతి ప్లేట్) శుభ్రంగా తోమకుండా, పాత జిడ్డుతో ఉపయోగించడం.
పూజ గది అపరిశుభ్రత:పూజ గదిని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం, దేవుడి పటాలపై పేరుకుపోయిన దుమ్మును తొలగించకపోవడం.
2. దీపారాధన, అగరుబత్తి పొరపాట్లు:
దీపారాధన అనేది దైవశక్తికి ప్రతీక. ఇక్కడ చేసే లోపాలు కూడా ఉంటాయి.
ఒకే వత్తితో దీపం: ఒకే ఒక వత్తితో దీపారాధన చేయడం శుభప్రదం కాదు. కనీసం రెండు వత్తులను కలిపి (జంట వత్తి) దీపం వెలిగించాలి.
నువ్వుల నూనె వాడకపోవడం: కొన్ని ప్రత్యేక పూజలలో ముఖ్యంగా శనీశ్వరుడికి చేసే పూజ సమయంలో నువ్వుల నూనెను వాడకపోవడం. సాధారణంగా ఆవు నెయ్యి లేదా మంచి నూనె (వేరుశనగ కాకుండా) వాడాలి.
కింద పెట్టి దీపం: దీపాన్ని నేలపై నేరుగా కాకుండా, ఒక పళ్లెం లేదా పీటపై ఉంచి వెలిగించాలి.
ఎక్కువ అగరుబత్తిలు: అగరుబత్తీలను దీపంతో సహా మూడింటికి మించి ఎక్కువ వెలిగించడం.
3. మంత్రాలు, నియమాలలో లోపాలు:
తప్పుగా మంత్ర పఠనం: మంత్రాలను లేదా శ్లోకాలను సరిగా ఉచ్చరించకుండా.. అర్థం తెలియకుండా తప్పుగా చదవడం. మంత్రం తెలియకపోతే, కేవలం ‘ఓం నమః శివాయ’ లేదా ‘ఓం నమో నారాయణాయ’ వంటి నామ స్మరణ చేయవచ్చు.
తప్పిపోయిన ఉపచారాలు: గంధం, కుంకుమ, పసుపు, అక్షతలు, పుష్పాలు వంటి పంచోపచారాలు పూర్తి చేయకుండా కేవలం దీపం వెలిగించి ముగించడం.
నిలబడి పూజ: వీలైతే.. కూర్చొని (పద్మాసనం లేదా సుఖాసనం) పూజ చేయాలి. నిలబడి చేయడం పూర్తి ధ్యానాన్ని ఇవ్వలేదు.
తూర్పు దిశ: పూజ చేసేవారు సాధ్యమైనంత వరకు తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి కూర్చోవడం మంచిది.
Also Read: ఏ దిశలో నిద్రించాలి ? వాస్తు, సైన్స్ చెప్పే విషయాలివే !
4. నివేదన, ప్రసాద లోపాలు:
నివేదన లేకపోవడం: పూజ పూర్తయ్యాక దేవుడికి పండు, బెల్లం లేదా ఏదైనా ప్రసాదం తప్పనిసరిగా నివేదించాలి. కేవలం దీపం వెలిగించి ప్రసాదం పెట్టకపోవడం.
శుద్ధి లేని ప్రసాదం: ప్రసాదాన్ని తయారుచేసేటప్పుడు మాటలు లేదా ఇతర పనుల్లో ధ్యాస పెట్టడం. ప్రసాదం ఎప్పుడూ పరిశుభ్రంగా, భక్తితో తయారుచేయాలి.
తులసి: వినాయకుడి పూజలో తులసిని ఉపయోగించకూడదు. అదేవిధంగా.. శివుడికి కేతకీ (మొగలి) పువ్వును ఉపయోగించకూడదు.
5. ఇతర సాధారణ లోపాలు:
గంట మోగించకపోవడం: పూజ ప్రారంభంలో.. మధ్యలో, హారతి ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా గంట మోగించాలి. ఇది అశుభ శక్తులను దూరం చేస్తుంది.
చిరిగిన పూలు: వాడిపోయిన లేదా చిరిగిపోయిన పూలను దేవుడికి సమర్పించడం. తాజా పూలు లేదా పత్రాలను మాత్రమే ఉపయోగించాలి.
హారతిని కళ్లకద్దుకోకపోవడం: హారతి ఇచ్చాక, కర్పూరం లేదా దీపం యొక్క వేడిని నెమ్మదిగా కళ్లకద్దుకోవడం సంప్రదాయం.