BigTV English
Advertisement

OTT Movie : పొలిమేరలో పొలికేక… శవాలను కూడా వదిలిపెట్టకుండా … వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్

OTT Movie : పొలిమేరలో పొలికేక… శవాలను కూడా వదిలిపెట్టకుండా … వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్

OTT Movie : హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు మంచి కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. గత ఏడాది ప్రేక్షకులను ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ బాగానే భయపెట్టింది. ఈ మూవీలో ఒక క్రియేచర్ అడవి ప్రాంతంలోకి వచ్చేవాళ్ళని చంపుతూ ఉంటుంది. ఆ క్రియేచర్ ని హీరో ఎదుర్కొనే సన్నివేశాలతో స్టోరీ నడుస్తుంది. వెన్నులో వణుకు పుట్టించే ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో

ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘కళింగ‘ (Kalinga). 2024, సెప్టెంబరు 13న విడుదలైన కళింగ సినిమాకు ధృవ వాయు దర్శకత్వం వహించాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమాలో  ధృవ వాయు, ప్రగ్యా నయన్, ఆడుకలం నరేన్, లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఓక మారుమూల ప్రాంతంలో కొంతమంది విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ శరీరాలను వల్లే తింటూ ఉంటారు. ఈ విషయం జమీందారికి తెలసి  పరిష్కారాన్ని కనుక్కోవాలని ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ ఊరు పొలిమేరకు ఎవరైనా వెళితే ఒక క్రియేచర్ వాళ్ళని చంపుతూ తినేస్తుంటుంది. ఈ క్రమంలో హీరో సారా అమ్మే వ్యక్తిగా ఎంట్రీ ఇస్తాడు. ఒకప్పుడు ఇతని తాతను కూడా క్రియేచర్ ఇతని కళ్ళముందే ఎత్తుకొని వెళ్లి తినేస్తుంది. అయితే ఆ ప్రాంతంలో నిధి ఉందని తాత ద్వారా హీరో తెలుసుకుంటాడు. నిధితో పాటు, అక్కడ ఉన్న రహస్యాలను కూడా తెలుసుకోవాలనుకుంటాడు. అదే ఊరిలో ఉండే పద్దు అనే అమ్మాయిని హీరో చినప్పటినుండి ప్రేమిస్తుంటాడు. అయితే ఆ ఊరు పెద్దమనిషి, అతని కొడుకు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వడ్డీకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆస్తులు రాయించుకుంటాడు. ఆతరువాత హీరోయిన్ మీద కన్ను పడ్డ వాళ్లకి, హీరో బుద్ధి చెప్తాడు. కొద్ది రోజులకి వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు.

ఆ తర్వాత ఒకరోజు హీరోయిన్ కి, హీరో చనిపోయినట్టు కల వస్తుంది. ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్లి తాయత్తు తీసుకొని అతనికి కడుతుంది. ఆ తర్వాత ఆ నిధి ఉన్న ప్రాంతాన్ని హీరో కనిపెడ తాడు. హీరోని ఫాలో అవుతూ వచ్చిన ఆ ఊరి రౌడీ గ్యాంగ్, హీరోని చంపాలనుకుంటారు. అయితే ఆ భయంకరమైన క్రియేచర్ అక్కడికి వచ్చి అందర్నీ చంపుతూ ఉంటుంది. చివరికి హీరో ఆ క్రియేచర్ నుంచి తప్పించుకుని బయటపడతాడా? నిధిని హీరో సొంతం చేసుకోగలుగుతాడా? ఆ ప్రాంతంలో జరుగుతున్న నరమేధాన్ని హీరో అంతం చేయగలుగుతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కళింగ’ (Kalinga) అనే ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

Big Stories

×