Airbus Helicopters: ఏపీకి మరో భారీ పరిశ్రమ రాబోతోందా? టీడీపీ హయాంలో కియా కార్ల పరిశ్రమ రాగా, ఇప్పుడు హెలికాఫ్టర్ యూనిట్ వంతు కానుందా? హెలికాఫ్టర్ యూనిట్‌ని దక్కించుకునేందుకు నాలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయా? దావోస్ టూర్ తర్వాత క్లారిటీ రానుందా? అవుననే అంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు.
ఎయిర్‌బస్ సంస్థ ఇండియాలో హెలికాఫ్టర్లు తయారు చేసే యూనిట్ పెట్టాలని చాన్నాళ్లుగా ఆలోచన చేస్తోంది. ఈ విషయంలో ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. ఆ కంపెనీ ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కంపెనీ ప్రతినిధులు నాలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు.
వాటిలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉన్నాయి. ఆయా రాష్ట్రాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈనెల 20 నుంచి దావోస్ సదస్సుకు సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్టును ఓకే చేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
గతంలో 2014-19 మధ్యకాలంలో సీఎం చంద్రబాబు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. విమానాలు లేదా హెలికాఫ్టర్లు ఏదైనా ప్రొడక్షన్ యూనిట్ పెడితే తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చిన విషయం తెల్సిందే. అప్పుడే అనంతపురంలో భూములను సిద్ధం చేశారు కూడా. ఆ తర్వాత ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైంది. ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్లింది.
ALSO READ: వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్.. కుమారుడి చేతికే రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం
కేంద్రంలో ఎన్డీయే సర్కార్, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండడంతో ఆ ప్రాజెక్టు ఏపీకి రావడం ఖాయమని అంటున్నారు. అనంతపురం హెలికాఫ్టర్ యూనిట్ నెలకొల్పితే కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణకు మధ్యలో ఉంటుందని అంచనా వేస్తోంది చంద్రబాబు సర్కార్.
ఎయిర్‌బస్ కంపెనీ విషయానికొద్దాం. ఫ్రాన్స్‌కు చెందిన విమాన తయారీ కంపెనీ. ఎయిర్ బస్ హెచ్ 125 హెలికాఫ్టర్లను తయారు చేయగలదు. సింగిల్ ఇంజన్ కావడంతో అందులో ఆరుగురు మాత్రమే ప్రయాణించగలరు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆ తరహా హెలికాఫ్టర్లకు మాంచి మార్కెట్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తరహా హెలికాఫ్టర్లు తయారు చేయాలన్నది ఆ కంపెనీ ఆలోచన.
ఇండియాలో తక్కువ ఖర్చుతో ప్రొడక్షన్ యూనిట్ పెట్టాలన్నది ఆ కంపెనీ ఆలోచన. ఇండియాలో ప్లాంట్ పెడితే ఆసియాతోపాటు యూరప్ లాంటి దేశాలకు ఎగుమతులు చేయవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో ఇండియాపై ఫోకస్ చేసింది. దీన్ని దక్కించుకునేందుకు నాలుగు రాష్ట్రాలు రేసులో ఉన్నాయి.
రీసెంట్‌గా కుప్పం టూర్‌లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పం ప్రాంతానికి కార్గో ఎయిర్ పోర్టు వస్తుందన్నారు. త్వరలో విమానాలు ఏపీలో తయారు చేసే అవకాశముందని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల వెనుక కారణమిదేనని అంటున్నారు కొందరు నేతలు. అనంతపురానికి ఎయిర్‌బస్ వస్తే ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
🚁Airbus shortlists four states for copter unit.
Uttar Pradesh
Gujarat
Andhra Pradesh
Karnataka
The final assessment of sites underway and an announcement is expected soon!#InvestInAP #AndhraPradesh @tgbharath @naralokesh @AP_EDB @Airbus pic.twitter.com/wU1q3s5ALF— Andhra Nexus (@AndhraNexus) January 18, 2025