E-Paper
Advertisement

అప్పుడే ఓటీటీలోకి రాబోతున్న ‘యూత్’.. ఈ రొమాంటిక్ కామెడీ స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

అప్పుడే ఓటీటీలోకి రాబోతున్న ‘యూత్’.. ఈ రొమాంటిక్ కామెడీ స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?
Advertisement

Youth Movie: థియేటర్లలో సందడి చేసిన ఎన్నో చిత్రాలు అలా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే కొన్ని చిత్రాలు ఒప్పందం ప్రకారం నాలుగు వారాలకు లేదా ఎనిమిది వారాలకు సందడి చేస్తూ ఉంటాయి. మరికొన్ని చిత్రాలు ఏడాది అయినా ఓటీటీలోకి రాకుండా అభిమానులను నిరాశ పరుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం అప్పుడే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి రాబోతోంది. థియేటర్లలో విడుదలైన 15 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ రాబోతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

15 రోజుల్లోనే ఓటీడీలోకి రాబోతున్న యూత్..

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించి తెలుగులో కూడా మంచి ఆదరణ పొందిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ యూత్. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 16 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది . కెన్ కరుణాస్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించడంతోపాటు ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. అనీషా అనిల్ కుమార్, మీనాక్షి దినేష్, ప్రియాన్షీ యాదవ్, సూరజ్ వెంజరమూడు, దేవదర్శని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19న తమిళంలో, మార్చి 27న తెలుగులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. మరి అంతలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

ALSO READ:గ్రాండ్ గా హారిస్ జయరాజ్ మ్యూజిక్ కాన్సర్ట్.. ఎప్పుడు? ఎక్కడంటే?

యూత్ సినిమా స్టోరీ..

సినిమా కథ విషయానికి వస్తే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన టీనేజర్ ప్రవీణ్ (కెన్ కరుణాస్) అతడి అల్లరి పనుల వల్ల స్కూల్లో ఏ అమ్మాయి కూడా అతని వైపు కన్నెత్తి కూడా చూడదు. అయితే ప్రవీణ్ మాత్రం తన స్కూల్ లైఫ్ పూర్తయ్యే లోపు ప్రేమించాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతని జీవితంలోకి గంగవల్లి, ప్రేషిక, సోనాల్ అనే ముగ్గురు అమ్మాయిలు వస్తారు . మరి ఆ ముగ్గురు వల్ల ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? ప్రేమ, బ్రేకప్ , అవమానాలు లాంటి అనుభవాలతో ప్రవీణ్ నేర్చుకున్న జీవిత పాఠం ఏంటి? ఈ ప్రయాణంలో అతని తల్లిదండ్రుల పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి ? వారి కలలను ప్రవీణ్ నెరవేర్చాడా ?అన్నదే మిగిలిన కథ. సాధారణంగా అందరి జీవితాలలో టీనేజ్ లైఫ్ ఎప్పుడు కూడా ప్రత్యేకమే. ఆ వయసులో స్కూల్, కాలేజీల్లో కొట్టే ప్రేమ కథలు, బ్రేకప్ లు , పరిణతి లేని వ్యక్తిత్వంతో చేసే పొరపాట్లు, వాటి వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్ని విలువైన జీవిత పాఠాలే.. ఇక వీటన్నింటినీ చాలా చక్కగా సహజంగా తెరపై ఆవిష్కరించారు.

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×