E-Paper
Advertisement

OTT Movie : ఏం సిరీస్ గురూ… భయం అంటే ఎలా ఉంటుందో చూపించే అసలైన హర్రర్ సిరీస్… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు డోంట్ వాచ్

OTT Movie : ఏం సిరీస్ గురూ… భయం అంటే ఎలా ఉంటుందో చూపించే అసలైన హర్రర్ సిరీస్… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు డోంట్ వాచ్
Advertisement

OTT Movie : మూవీ లవర్స్ లో మంచి డిమాండ్ ఉన్న హర్రర్ పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అందులో హర్రర్ కంటే ఎక్కువ వేరే ఎలిమెంట్స్ ఉండడం, లేదా హారర్ మూవీనే అయినా అంచనాలను అందుకోలేకపోవడం వంటివి జరుగుతాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ మాత్రం మోస్ట్ డిస్టర్బింగ్ సీన్స్ తో భయం ఏంటో చూపిస్తుంది. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు? ఆ సిరీస్ పేరేంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఫ్రీగా స్ట్రీమింగ్

కుమారన్ సుందరం దర్శకత్వం వహించిన Karuvanam (2024) ఒక అద్భుతమైన తమిళ్ సైకలాజికల్ హారర్ వెబ్ సిరీస్. సింగపూర్ ప్రొడక్షన్ హౌస్ మీడియాకార్ప్ ఈ సిరీస్ ను నిర్మించింది. 12 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ సుమారు 20-50 నిమిషాలు. మలేషియన్ నటి జయశ్రీ విజయన్ (షాలిని), ఉదయ సౌందరి (మీరా) ఇందులో మెయిన్ లీడ్స్ అయిన ట్విన్ సిస్టర్స్‌గా నటించారు. విఘ్నేష్ వడరాజన్ (మీరా భర్త రాజ్), వీరరాఘవన్ తదితరులు ఇందులో కీ రోల్స్ పోషించారు. సపోర్టింగ్ కాస్ట్ సెలెక్షన్ బాగుంటుంది. ఈ సిరీస్ హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ ట్రామా వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. IMDbలో 8.5 రేటింగ్ ఉన్న ఈ గ్రిప్పింగ్ హారర్ సిరీస్ 2024 బెస్ట్ తమిళ్ వెబ్ సిరీస్ గా నిలిచింది. అలాగే విమర్శకులతో సూపర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అనే ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సిరీస్ ను ఫ్రీగానే యూట్యూబ్ లో వీక్షించవచ్చు.

Advertisement

Read Also :  ‘లిటిల్ హార్ట్స్’ – ‘ఎయిర్’ డిజిటల్ పాన్ ఇండియా ఎంట్రీ… అన్నీ భాషలలొ ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్ ?

స్టోరీలోకి వెళ్తే…

పుట్టగానే అనాథలుగా మారతారు ట్విన్ సిస్టర్స్ మీరా, షాలిని. ఆర్ఫనేజ్‌లో పెరిగి పెద్దవుతారు. మీరా ఒక సాధారణ అమ్మాయి. అందరిలా కామన్ గా లైఫ్ ను గడుపుతూ, భర్త రాజ్‌తో సంతోషంగా ఉంటుంది. కానీ షాలిని ఇంట్రోవర్ట్. గతాన్ని మరచిపోవడానికి ట్రై చేస్తుంది. . అలాంటి టైం లో ఈ సిస్టర్స్ బయోలాజికల్ తల్లి మరణించగా, ఆమె పాత ఇల్లు వారసత్వంగా దొరుకుతుంది. ఈ ఇల్లు సింగపూర్‌లోని ఒక మారుమూల ఏరియాలో ఉంటుంది. ఆ ఇంటి చుట్టూ అడవి ఉండడంతో భయంకరమైన వాతావరణం ఉంటుంది. ఆ ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఈ సిస్టర్స్‌కు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. గత జ్ఞాపకాలు గుర్తు రావడంతో పాటు, షాడోస్ కన్పించడం, వింత వింత సౌండ్స్ విన్పించడం వంటివి జరుగుతాయి. మీరా – షాలిని తల్లి గతం, కుటుంబంలో జరిగిన భయంకరమైన సంఘటనలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇంతకీ ఈ ట్విన్ సిస్టర్స్ తల్లి గతం ఏంటి? ఆ ఇంట్లో ఏం ఉంది? ఎందుకు ఈ సిస్టర్స్ కు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి? అనే విషయాలు తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×