E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్.. త్వరలో పూర్తిస్థాయి చార్జ్‌షీట్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్.. త్వరలో పూర్తిస్థాయి చార్జ్‌షీట్
Advertisement

Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దూకుడు పెంచింది. కేసు దర్యాప్తును వేగవంతం చేసే దిశగా ఆదివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిట్ అధికారులతో సీపీ సజ్జనార్ కీలక సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన సిట్ బృందంతో జరిగిన ఈ తొలి భేటీలో కేసు పురోగతిపై సమీక్షించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని సిట్ నిర్ణయించింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, దర్యాప్తు అత్యంత పారదర్శకంగా, కోర్టుకు జవాబుదారీగా ఉండాలని సజ్జనార్ అధికారులను ఆదేశించారు. కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, వీలైనంత త్వరగా పూర్తిస్థాయి చార్జ్‌షీట్ (Charge Sheet) దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడైన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావును సిట్ బృందం గత 10 రోజులుగా కస్టోడియల్ విచారణ చేస్తోంది. ఈ విచారణలో ట్యాపింగ్ నెట్‌వర్క్, ఆపరేషన్లకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ప్రభాకర్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా ముందుగా చార్జ్‌షీట్ వేయాలని, ఆ తర్వాత ఈ కేసుతో లింక్ ఉన్న రాజకీయ నాయకులు, ఇతర ఉన్నతాధికారులను విచారించాలని సిట్ వ్యూహం రచిస్తోంది. చార్జ్‌షీట్ దాఖలైన వెంటనే రాజకీయ ప్రముఖులకు నోటీసులు వెళ్లే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.

Read Also: KCR On CBN: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. చంద్రబాబు మోకాళ్లపై పరుగులు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Related News

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

Big Stories

Advertisement
×