E-Paper
Advertisement

Glass Bottle Microplastics: ప్లాస్టిక్ బాటిలే కాదు.. గ్లాస్ బాటిల్స్ కూడా డేంజరేనట, వామ్మో అలా అవుతుందా?

Glass Bottle Microplastics: ప్లాస్టిక్ బాటిలే కాదు.. గ్లాస్ బాటిల్స్ కూడా డేంజరేనట, వామ్మో అలా అవుతుందా?
Advertisement

Glass Bottle Microplastics: ప్లాస్టిక్ బాటిళ్లే కాదు గాజు సీసాలు డేంజర్ అంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ బాటిల్స్ కంటే గాజు సీసాలలో ఎక్కువ మైక్రోప్లాస్టిక్ లు ఉంటాయని ఫ్రెంచ్ పరిశోధకులు అంటున్నారు. గాజు సీసాలలో నిల్వ చేసిన పానీయాలలో ప్లాస్టిక్ కంటైనర్లలో కంటే ఎక్కువ మైక్రోప్లాస్టిక్‌లు ఉండవచ్చని ఓ నివేదిక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఇటీవల ఫ్రాన్స్ లో విక్రయించే సోడా, బీర్, ఐస్డ్ టీ, లెమన్ వాటర్ వంటి వివిధ రకాల డ్రింక్స్ ను పరీక్షించారు. గాజు సీసాలలో లీటరుకు సగటున 100 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ప్లాస్టిక్ సీసాలు లేదా మెటల్ డబ్బాల కంటే ఐదు నుండి 50 రెట్లు ఎక్కువగా గాజు సీసాలలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు గుర్తించారు.

గాజు సీసా మూతల వల్లే

పరిశోధకులు ముందుగా ప్లాస్టిక్ సీసాలలో ఎక్కువ మైక్రోప్లాస్టిక్ కణాలు ఉంటాయని భావించారు. కానీ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ మైక్రోప్లాస్టిక్‌లు కేవలం గాజు సీసా వల్ల కాదని కనుగొన్నారు. గాజు సీసా బాటిల్ మూతలపై ఉన్న పెయింట్ అని గుర్తించారు. గాజు సీసా మూతలపై గీతలు, బయట నుంచి ఘర్షణతో మైక్రోప్లాస్టిక్ లుగా మారాతాయి. బాటిల్ మూత తెరిచినప్పుడు మైక్రోస్కోపిక్ ప్లాస్టిక్ లు వాటర్ లో ఫ్రాన్స్ ఆహార భద్రతా సంస్థ ANSES అధ్యయనంలో తెలిసింది.

బీర్ బాటిళ్లలో అత్యధికంగా

Advertisement

బీర్ బాటిళ్లలో అత్యధికంగా లీటరుకు 60 మైక్రోప్లాస్టిక్ కణాలు, నిమ్మరసంలో 40 శాతం ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ప్లాస్టిక్ సీసాలలో లీటరుకు 1.6 కణాలతో పోలిస్తే గాజు సీసాలలో దాదాపు 4.5 కణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వైన్ మినహా అన్ని గాజు పానీయాల్లో ఎక్కువగా కలుషితాలు ఉన్నాయని ఫలితాలు చెబుతున్నాయి. ఎందుకంటే వైన్ బాటిళ్లను మెటల్ మూతలు కాకుండా కార్క్ స్టాపర్లతో మూసి ఉంచారు కాబట్టి అని అధ్యయనం తెలిపింది.

అయితే ఈ పరిశోధనలో కొన్ని అస్పష్టంగానే ఉందని ANSES పరిశోధన డైరెక్టర్ గుయిలౌమ్ డఫ్లోస్ అన్నారు. మైక్రోప్లాస్టిక్ ఎంత హానికరమో ఇంకా అధ్యయనాలు చెప్పకపోయినప్పటికీ, డ్రింక్స్ తయారీ కంపెనీలు కాలుష్యాన్ని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గాజు సీసాలను సీల్ చేసే ముందు ఎయిర్, ఆల్కహాల్‌తో మూతలను క్లీన్ చేస్తే ప్లాస్టిక్ కణాలు 60% తగ్గాయని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

Also Read: Burial Tradition: అర్ధరాత్రి లేచొచ్చి నృత్యం చేసే మృతదేహాలు.. ఆ పర్వతం మీదకు వెళ్లినవారి కథ కంచికే!

మైక్రోప్లాస్టిక్ వల్ల నష్టం

1950లలో 1.5 మిలియన్ టన్నులుగా ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తి 2022 నాటికి 400.3 మిలియన్ టన్నులకు చేరింది. అయితే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల తయారీ పెరగడం వల్ల భూమి, నీటి కాలుష్యానికి దారితీస్తుంది. మరియానా ట్రెంచ్ నుంచి ఎవరెస్ట్ శిఖరం వరకు ఐదు మిల్లీమీటర్ల కంటే చిన్న ప్లాస్టిక్ ముక్కలైన మైక్రోప్లాస్టిక్‌లను పరిశోధకులు కనుగొన్నారు. మానవ మెదడుల్లో, ప్లాసెంటా, సముద్రపు చేపల కడుపులలో కనుగొన్నారు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×