E-Paper
Advertisement

బోల్డ్ అవతార్ లో కీర్తి సురేష్.. రాధిక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్.. ‘అక్క’ ట్రైలర్ రిలీజ్!

బోల్డ్ అవతార్ లో కీర్తి సురేష్.. రాధిక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్.. ‘అక్క’ ట్రైలర్ రిలీజ్!
Advertisement

Akka trailer:ఈ మధ్యకాలంలో హీరోయిన్లు పరిమితులు దాటి మరీ బోల్డ్ అవతారంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకరేమో యాక్షన్స్ సన్నివేశాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే.. ఇంకొకరేమో తమ కెరియర్ లో ఎన్నడూ చేయని పాత్రల ద్వారా ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిలో మహానటి కీర్తిసురేష్ (Keerthy Suresh) కూడా ఒకరు. ఒకప్పుడు మహానటి చిత్రంతో సావిత్రి జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఏకంగా నేషనల్ అవార్డును అందుకున్న ఈమె.. దసరా అలాంటి చిత్రంలో డి గ్లామరస్ పాత్ర పోషించి మెప్పించింది. అలాంటి ఈమె తొలిసారి తన కెరీర్లో బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యింది. అదే అక్క క్రైమ్ థ్రిల్లర్ సిరీస్..

క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అక్క నుండి ట్రైలర్ రిలీజ్..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 30వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో కీర్తి సురేష్ బోల్డ్ అవతారంలో కనిపిస్తోంది. అటు కీర్తి సురేష్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే (Radhika Apte) పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ విషయానికి వస్తే.. పేర్నూరు అనే ప్రాంతం కోసం జరిగే ఫైట్ ఇందులో చూడవచ్చు. 1985 సంవత్సర కాలంలో జరిగిన స్టోరీగా చూపించారు. ఇక్కడ 800 ఏళ్లుగా ఆడాళ్ళదే రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని పాలించే వ్యక్తిని అక్క అని పిలుస్తుంటారు. భవాని నేతృత్వంలో ఆ రాజ్యం నడుస్తూ ఉంటుంది . ఇక ఇందులో కీర్తి సురేష్ భవాని అనే ఒక పవర్ఫుల్ పాత్ర పోషిస్తోంది.

ఆడవాళ్లు ఇంటినే కాదు వ్యాపారాన్ని కూడా చక్కదిద్దగలరు..

Advertisement

“ఆడవాళ్లు ఇంటినే కాదు వ్యాపారాన్ని కూడా చక్కదిద్దగలరు” అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇందులో అక్క సామ్రాజ్యాన్ని సవాలు చేయడానికి రుద్ర రూపంలో మరో లేడీ గ్యాంగ్ స్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె రాధిక ఆప్టే. ఇందులో ఈమె రుద్ర అనే మరో పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తోంది. అక్క, రుద్ర మధ్య జరిగే పోరాటం ఆసక్తిని రేపుతోంది. 2 నిమిషాల 23 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ వెబ్ సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచేసింది. “ఒకరు సామ్రాజ్యాన్ని స్థాపిస్తే.. మరొకరు విధ్వంసాన్ని సృష్టిస్తారు . చరిత్ర తిరగ రాయబడుతోంది అక్టోబర్ 30 నుంచి కేవలం నెట్ఫ్లిక్స్ లో మాత్రమే” అనే క్యాప్షన్ తో నెట్ ఫ్లిక్స్ ఈ ట్రైలర్ ను విడుదల చేసింది. మొత్తానికైతే ట్రైలర్ సీరీస్ పై ఆసక్తిని పెంచేసింది ..మరి ఈ నెల 30న నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కాబోతున్న ఈ క్రైమ్ సిరీస్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

also read: లైవ్ లో మెగా హీరోకి ప్రపోజ్ చేసిన శ్రీముఖి!

అక్క క్రైమ్ సిరీస్ తారాగణం..

Advertisement

అక్క క్రైమ్ సిరీస్ తారాగణం విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్ కి ఆదిత్య చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నటి తన్వి అజ్మీ తో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధర్మరాజు శెట్టి రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ పేర్నూర్ అనే ఒక కల్పిత నగరంలో మహిళా గ్యాంగ్ స్టార్ రాణుల పాలనలో సాగే కథాంశంతో అత్యంత పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ ప్రాజెక్టును తెరకెక్కించారు. ఈ లేడీ డామినేషన్, గ్యాంగ్స్టర్ రివెంజ్, పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

ఆ ఇంట్లో చిక్కుకుంటే ప్రాణాలు దక్కవు… ఒళ్లు గగుర్పొడిచే సర్వైవల్ థ్రిల్లర్

కూతురి జాడ వెతికితే షాకింగ్ ట్విస్ట్… మైండ్ బ్లాక్ చేసే మర్డర్ మిస్టరీ

డేంజరస్ యాక్షన్ థ్రిల్లర్… ఈసారి రక్తపాతమే… ఓటీటీలోకి మోస్ట్ అవైటెడ్ సిరీస్

సముద్రంలో సాహసం… బ్లాక్‌బస్టర్ యానిమేషన్ మూవీ రియల్ మనుషులతో… స్ట్రీమింగ్ తెలుగులోనే

షార్ట్ కట్‌లో కోటీశ్వరుడు కావాలని పాడు పని… రాత్రికి రాత్రే రోడ్డున పడే క్యాబ్ డ్రైవర్

భార్యాబిడ్డలను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌పై కక్ష తీర్చుకునేందుకు రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్… ఈ ఊచకోతను డోంట్ మిస్

కడుపున పుట్టిన పిల్లలకే ఆ తల్లి మృత్యువుగా మారితే… వెన్నులో వణుకు పుట్టించే హారర్ ను చూశారా?

Big Stories

Advertisement
×