E-Paper
Advertisement

లైవ్ లో మెగా హీరోకి ప్రపోజ్ చేసిన శ్రీముఖి!

లైవ్ లో మెగా హీరోకి ప్రపోజ్ చేసిన శ్రీముఖి!
Advertisement

Sree Mukhi:ఈ మధ్యకాలంలో మ్యూజిక్ డైరెక్టర్లు లైవ్ కాన్సర్ట్ తో పాటు బుల్లితెర షోలలో కూడా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా సింగర్స్ తో కలిపి పదుల సంఖ్యలో పాటలు పాడుతూ మరింత ఆదరణ సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న తమన్ (Thaman ) సింగర్స్ తో కలిసి ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కి సంబంధించి రెండవ ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. ఇందులో యాంకర్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి మెగా హీరోకి ప్రపోజ్ చేయడం వైరల్గా మారింది.

మెగా హీరోకి శ్రీముఖి ప్రపోజల్..

పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీముఖి ఆ తర్వాత పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అటు సినిమా ఈవెంట్ మొదలుకొని అవార్డు ఫంక్షన్ల వరకు యాంకర్ గా వ్యవహరించి ఊహించని ఆదరణ సొంతం చేసుకున్న ఈమె.. సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఒకవైపు బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో కూడా సందడి చేసిన శ్రీముఖి ఈమధ్య ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ముక్కు అవినాష్, ఎక్స్ప్రెస్ హరి , యాదమ్మ రాజు వంటి వారితో కలిసి హోస్టుగా చేస్తోంది. ఇక తాజాగా తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించగా అందులో మెగా హీరో పై మనసు పారేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

తమన్ ను ఇరికించేసిన శ్రీముఖి..

Advertisement

ప్రోమో విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పండి అని తమన్ ను శ్రీముఖి అడిగింది. అఖిల్ , సాయి ధరం తేజ్ పేర్లను చెప్పగా.. శ్రీముఖి మాట్లాడుతూ.. సాయి ధరంతేజ్ (sai Dharam Tej)కి ఇప్పుడే ఫోన్ చేసి అర్జెంటుగా ఒక లక్ష రూపాయలు కావాలని అడగండి అంటూ చెప్పింది. తమన్ శ్రీముఖి చెప్పినట్టు సాయిధరమ్ తేజ్ కి ఫోన్ చేసి.. నువ్వు నా ఫ్రెండేనా ?అని అడిగాడు. సాయి ధరంతేజ్ దానికి కాదు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక తమన్ మాట్లాడుతూ నేను ఏదైనా సహాయం అడిగితే చేస్తావా లేదా అని అడగ్గా.. సాయి ధరంతేజ్ చేస్తానని చెప్పాడు. అప్పుడు తమన్ మాట్లాడుతూ.. నాకు ఒక లక్ష రూపాయలు కావాలి. పొద్దున్నే ఇచ్చేస్తాను అని చెప్పాడు.

also read:ముఖేష్ పర్సనల్ ఎటాక్.. కన్నీళ్లు పెట్టుకున్న శివ!

శ్రీముఖి కి జలక్ ఇచ్చిన మెగా హీరో

Advertisement

ఇంత ఫాస్ట్ గా ఎలా ఇస్తావురా అని సాయిధరమ్ తేజ్ అడిగితే శ్రీముఖి.. నా ఫ్రెండ్స్ దగ్గర తెచ్చి ఇస్తానని చెప్పు అని సైలెంట్ గా చెబుతుండగానే సాయిధరమ్ తేజ ఆ అమ్మాయి ఎవరు అంటూ గొంతు పట్టేశాడు. తమన్ మాట్లాడుతూ.. రేయ్ నువ్వు స్మెల్ కూడా పట్టేస్తావా ? ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. పెళ్లి చేసుకుంటావా అని ప్రశ్నించగా? ఎవరు అని సాయి ధరమ్ తేజ్ అడిగారు. ఇక అంతలోనే శ్రీముఖి ఫోన్ తీసుకొని హాయ్ అండి.. మీరంటే నాకు చాలా ఇష్టం.. ముఖ్యంగా మీ కండలంటే మరింత ఇష్టం అంటూ చెప్పేసింది. ఇక సాయిధరమ్ తేజ్ ఆమెకు కౌంటర్ ఇస్తూ నాకంటే మా వాడి కండలు ఇంకా బాగుంటాయండి అంటూ ఝలక్ ఇచ్చారు మొత్తానికి అయితే ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

తెలంగాణ యాంకర్ల పారితోషికం ఎంతో తెలుసా? ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారంటే!

ముఖేష్ పర్సనల్ ఎటాక్.. కన్నీళ్లు పెట్టుకున్న శివ!

బల ప్రదర్శన.. కళ్ళు తిరిగి పడిపోయిన వర్షిణి!

రీఎంట్రీలో మరింత జోరు పెంచిన షాలిని.. ఆ నోటికి హద్దు అదుపు లేదా?

కంటెస్టెంట్స్ కి ఊహించని షాక్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు క్లాస్ పీకిన మీనా.. బాలు గెలిచాడు.. రోహిణి దొరుకుతుందా..?

Podarillu Today Episode : కేశవకు షాక్.. మహా ప్లాన్ అదుర్స్.. ఫ్యామిలీ పార్టీ..

Big Stories

Advertisement
×