Action Thriller Series: దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుడికి యుద్ధం కంటే పెద్ద శత్రువు ఎవరైనా ఉంటారా అంటే.. అది తన వాళ్లే చేసే కుట్ర. నమ్మిన వాళ్లే మోసం చేస్తే, కనిపించని శత్రువులు వెంటాడితే అతడి పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇప్పటికే ఎన్నో ప్రాణాంతకమైన పోరాటాలను ఎదుర్కొన్న ఓ నేవీ సీల్ కమాండర్ కు ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. గతంలో తన జీవితాన్ని మార్చేసిన కుట్ర నుంచి బయటపడ్డాడు అనుకునేలోపే… మరో ప్రమాదం అతడిని చుట్టుముట్టింది. ఈసారి అతడి పోరాటం ఒక్క మనిషి మీద కాదు… ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఓ రహస్య నెట్‌వర్క్‌తో. ఆ పోరాటమే ‘ది టెర్మినల్ లిస్ట్’ రెండో సీజన్ (The Terminal List Season 2). మరి యాక్షన్ తో దుమ్మురేపుతున్న ఈ సినిమా ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? కథ ఏంటి ? సీజన్ 2లో జరిగేది ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.
జేమ్స్ రీస్ ఓ శిక్షణ పొందిన నేవీ సీల్ కమాండర్. గతంలో ఎదురైన కుట్రలు, వ్యక్తిగత నష్టాలు అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. తనకు జరిగిన అన్యాయానికి కారణమైన వారిని గుర్తించి, వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే మొదటి సీజన్ లో అతడి టార్గెట్. అయితే ఆ పోరాటం ముగిసినంత మాత్రాన అతడి సమస్యలన్నీ తీరిపోవు. గతం నుంచి బయటపడాలను అనుకున్న ప్రతిసారీ కొత్త ప్రమాదాలు అతడిని వెంటాడుతూనే ఉంటాయి.
రెండో సీజన్‌లో రీస్ మరో ప్రమాదకరమైన మిషన్ లోకి అడుగుపెడతాడు. ఈసారి అతడు ఎదుర్కోవాల్సింది ఒక్క వ్యక్తిని కాదు… ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఓ రహస్య కుట్రను. దాని వెనుక ఉన్న అసలు నిజాన్ని బయట పెట్టేందుకు అతడి ప్రయాణం పలు ప్రాంతాలకు విస్తరిస్తుంది. రష్యా నుంచి లాంగ్లీ వరకు సంబంధాలు ఉన్న రహస్య వ్యవహారాలు అతడిని చుట్టుముడతాయి. మరోవైపు, అతడి కుటుంబ గతానికి సంబంధించిన విషయాలు కూడా ఈ కుట్రలో కీలకంగా మారతాయి.
ఈ పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని శత్రువుగా చూడాలో అర్థంకాని పరిస్థితి రీస్ కు ఎదురవుతుంది. ఒకవైపు ప్రాణాలకు తెగించి చేసే ఆపరేషన్లు… మరోవైపు వెన్నుపోటు వల్ల జరిగే కుట్రలు… ఇలా ప్రతి మలుపులోనూ ప్రమాదం పొంచి ఉంటుంది. తన గతాన్ని ఎదుర్కొంటూనే, కొత్త శత్రువుల అసలు లక్ష్యాన్ని గుర్తించి వారి ఆట కట్టించాల్సి వస్తుంది.
మొదటి సీజన్‌లో వ్యక్తిగత ప్రతీకారం చుట్టూ తిరిగిన కథ… రెండో సీజన్ లో అంతర్జాతీయ కుట్రలు, రహస్య మిషన్లతో మరింత విస్తరించింది. దీంతో రీస్ ఈసారి ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటాడు, కుట్ర వెనుక ఉన్న నిజాన్ని ఎలా బయటపెడతాడనే అంశాలు కథలో ఆసక్తిని పెంచుతాయి. మరి ఇంతకీ ఆ కుట్ర ఏంటి ? చివరికి ఏమైంది ? అన్నది తెరపై చూడాల్సిందే.
క్రిస్ ప్రాట్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది టెర్మినల్ లిస్ట్’ రెండో సీజన్ అక్టోబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. మిలిటరీ ఆపరేషన్లు, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ కుట్రలతో కూడిన ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉంటుంది.
Read Also: కూతురి ప్రాణాలు కాపాడుకోవడానికి లండన్ వెళ్తే ఊహించని షాక్… తండ్రికి నరకం… మస్ట్ వాచ్ థ్రిల్లర్