E-Paper
Advertisement

Revolver Rita on OTT : థియేటర్లలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ 2 గంటల 30 నిమిషాల కామెడీ థ్రిల్లర్… ఇప్పుడు ఓటీటీలోకి

Revolver Rita on OTT : థియేటర్లలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ 2 గంటల 30 నిమిషాల కామెడీ థ్రిల్లర్… ఇప్పుడు ఓటీటీలోకి
Advertisement

Revolver Rita on OTT : ప్రతివారం కొత్త కొత్త సినిమాలు ఓటీటీలో అడుగు పెడుతున్నాయి. అందులో చాలా వరకు హిట్ సినిమాలు ఉంటే, మరికొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉంటాయి. అయితే థియేటర్లలో డిజాస్టర్ అన్పించుకున్న సినిమాలు సైతం ఓటీటీలో మాత్రం అదుర్స్ అన్పిస్తాయి. అచ్చం ఇలాగే థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఒక సూపర్ ఫ్లాప్ సినిమా ఇప్పుడు మాత్రం డిజిటల్ ఎంట్రీకి సిద్ధం అవుతోంది. అందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడం విశేషం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’. జె.కె. చంద్రు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-కామెడీ క్రైమ్ డ్రామా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే థియేటర్ల నుండి ఈ మూవీని తీసేశారు.ఈ సినిమా డిసెంబర్ 26 నుంచి OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 26 నుండి ఈ సినిమా డిజిటల్ గా ప్రీమియర్ అవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తమిళం, తెలుగు వెర్షన్‌లతో పాటు, మలయాళం, కన్నడ ఆడియో వెర్షన్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. బిగ్ స్క్రీన్ పై పెద్దగా ఆడలేదు కానీ ఓటీటీలో మాత్రం పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుండడం గమనార్హం. మరి దీన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. సీన్ రోల్డాన్ సంగీతం సమకూర్చారు. రాధిక శరత్‌కుమార్, సునీల్, రెడిన్ కింగ్స్లీ ఇతరులు ప్రముఖ పాత్రలు పోషించారు. నవంబర్ 28న థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది. కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ ప్రశంసలు పొందినా, స్క్రీన్‌ప్లే, కామెడీ టైమింగ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. IMDbలో కేవలం 5.8 రేటింగ్ మాత్రమే ఉంది.

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

పాండిచ్చేరిలో జరుగుతుంది స్టోరీ అంతా. అక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ షాప్ మేనేజర్ రీటా (కీర్తి సురేష్). తండ్రి చనిపోవడంతో తల్లి చెల్లమ్మ (రాధికా శరత్‌కుమార్), ఇద్దరు చెల్లెళ్లతో కలిసి రీటా నివశిస్తుంది. ఒక రోజు ఆమె మేనకోడలు బర్త్‌ డే పార్టీ సందర్భంగా డ్రంక్ గ్యాంగ్‌స్టర్ డ్రాకులా పాండియన్ ఇంట్లోకి వచ్చి గందరగోళం సృష్టిస్తాడు. ఆ టైమ్ లో పాండియన్ యాక్సిడెంటల్‌గా చనిపోతాడు. దీంతో రీటా కుటుంబం ఆ డెడ్ బాడీని దాచి, ఓవైపు పోలీసులు- మరోవైపు గ్యాంగ్‌స్టర్స్ నుంచి తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం ఉండదు. తరువాత కథలో రెండు గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి పాండియన్ గ్యాంగ్ అయితే, మరొకటి రైవల్ గ్యాంగ్. రీటా తన తెలివి, ధైర్యంతో ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ గ్యాంగ్ వార్‌లో ఇరుక్కుంటుంది. మరి ఆ రెండు గ్యాంగ్ ల నుంచి తన ఫ్యామిలీని రీటా ఎలా కాపాడుకుంది ? శవాన్ని ఏం చేశారు ? ఆ గ్యాంగ్ నుంచి ఎలా తప్పించుకున్నారు? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also :  భర్త అస్థికలు కలపడానికెళ్ళి కిల్లర్ చేతిలో ట్రాప్… కిడ్నాప్ అయిన అమ్మాయి కోసం ముసలావిడ సాహసం… క్రేజీ ట్విస్టులు

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×