E-Paper
Advertisement

Minister Uttam: కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.. అసలు నిజాలివే, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

Minister Uttam: కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.. అసలు నిజాలివే, మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో గత పాలకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 శాతం పనులు పూర్తయ్యాయని కేసీఆర్, హరీష్ రావు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఉత్తమ్ కొట్టిపారేశారు. వారి పాలనలో రూ. 27,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, కేవలం 35 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.

ప్రాజెక్ట్ 90 శాతం పనులు పూర్తయితే మరి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఎందుకు అందలేదు? అని ఆయన నిలదీశారు. కేవలం ఫోటోల కోసం ఒక మోటార్ ఆన్ చేసి ఆ తర్వాత వెంటనే బంద్ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 మోటార్లను సిద్ధం చేశామని మంత్రి వివరించారు. ప్రాజెక్టు అంచనాలపై స్పందిస్తూ, డీపీఆర్ విలువ రూ. 55,000 కోట్లుగా ఉందని, దీనికి అదనంగా భూసేకరణ కోసం మరో రూ. 6,000 కోట్లు అవసరమవుతాయని ఉత్తమ్ తెలిపారు. ఇంకా 30,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కనీసం ఒక్క డిస్ట్రిబ్యూటరీ కాలువను కూడా నిర్మించలేదని, కాలువలే లేకుండా సాగునీరు ఎలా సరఫరా చేస్తామని వారు చెప్పుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమతోనే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.

Advertisement

కేంద్రానికి రాసిన లేఖలపై క్లారిటీ ఇస్తూ.. 90 టీఎంసీల నీటి కేటాయింపుల కోసమే తాము డీపీఆర్ అనుమతులు అడిగామని, ఎక్కడా తక్కువ నీరు అడగలేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సాంకేతిక, పర్యావరణ అనుమతులు ఏవీ సాధించకుండానే సాధించామని ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కృష్ణా జలాల వినియోగం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఉత్తమ్ విమర్శించారు. వేల కోట్ల అప్పులు చేసినా ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరు అందించలేకపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ. 7,000 కోట్లు ఖర్చు చేసి పనులను పరుగులు పెట్టిస్తోందని ఆయన వివరించారు. 2021లోనే ప్రాజెక్టు పనులను జాప్యం చేయాలని కేసీఆర్, హరీష్ రావులు ఆదేశాలు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

Advertisement

ALSO READ: Medaram Jatara 2026: 200 ఏళ్లు చెక్కుచెదరని శిలా నిర్మాణం.. మేడారంలో సీఎం రేవంత్ యజ్ఞం: మంత్రులు సీతక్క, పొంగులేటి

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×