Korean Thriller OTT : ఒక అదిరిపోయే కొరియన్ థ్రిల్లర్ సిరీస్ ని చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ పై ఓ లుక్ వేయండి. దీనిని చూసేకొద్దీ చూడాలనిపిస్తుంటుంది. అయితే ఈ సిరీస్‌లో హింస, రక్తపాతం ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది కేవలం పెద్దలకు మాత్రమే. ముఖ్యంగా హీరో పాత్రలో నటించిన జంగ్ హే-ఇన్ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. మీరు క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ కథలను ఇష్టపడితే, ఈ సిరీస్ మాత్రం బెస్ట్ సజెషన్. దీని పేరు ఏమిటి, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
2022లో వచ్చిన ఈ కొరియా సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘కనెక్ట్’ (Connect). ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక కొరియన్ డ్రామాను జపాన్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు తకాషి మైకే తెరకెక్కించడం ఇదే మొదటిసారి. ఇది 2022 డిసెంబర్ 7న 6 ఎపిసోడ్స్ తో Jio Hotstar ప్లాట్ ఫామ్లో అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, కొరియన్ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో జంగ్ హే-ఇన్, కో క్యుంగ్-ప్యో, కిమ్ హ్యే-జున్ లీడ్ రోల్స్ లో నటించారు. ఐయండిబిలో దీనికి 6.5/10 రేటింగ్ ఉంది.
Read Also : మెట్రో స్టేషన్ లో మతిపోగొట్టే డెడ్లీ డెత్ గేమ్స్… మెట్రో అంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ
ఈ కథ హా డాంగ్-సూ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను ‘కనెక్ట్’ అనే ఒక కొత్త జాతికి చెందిన వ్యక్తి. ఇతనికి ఒక విచిత్రమైన పవర్ ఉంటుంది. అంటే చనిపోయినా మళ్ళీ బతికే శక్తి ఉంటుందన్నమాట. ఒక రాత్రి డాంగ్-సూను స్మగ్లర్లు కిడ్నాప్ చేసి, అతని ఒక కన్నును తీసేస్తారు. ఆ కన్నును ఓ జిన్-సియోప్ అనే సీరియల్ కిల్లర్‌కు అమర్చుతారు. అయితే ఆ తరువాత అక్కడి నుంచి డాంగ్-సూ తప్పించుకుంటాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. దీనివల్ల డాంగ్-సూకి తన కన్ను ద్వారా ఆ హంతకుడు చేసే పనులు, హత్యలు కనిపిస్తూ ఉంటాయి. తన కన్నును తిరిగి పొందడానికి, ఆ కిల్లర్ చేస్తున్న దారుణాలను ఆపడానికి డాంగ్-సూ ఒక భీకర పోరాటమే చేయాల్సి వస్తుంది. ఈ పోరాటంలో డాంగ్-సూ కిల్లర్ ఆగడాలను ఆపుతాడా ? తన కంటిని తిరిగి పొందుతాడా ? ఈ సిరీస్ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను మాత్రం, ఈ కొరియా సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.