E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమపై ధీరజ్ సీరియస్.. శ్రీవల్లి పై చందుకు అనుమానం.. నర్మద సాగర్ రొమాన్స్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమపై ధీరజ్ సీరియస్.. శ్రీవల్లి పై చందుకు అనుమానం.. నర్మద సాగర్ రొమాన్స్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. టీ షర్ట్ పైన నువ్వు రాసింది ఏంటి అని అడుగుతున్నాడు.. నువ్వు మాత్రం నేను రాసిందని ఎందుకు చించేసావు అని అనగానే ధీరజ్ మౌనంగా ఉండిపోతాడు.. ఆ తర్వాత ప్రేమ మాత్రం ధీరజ్ ని ఒక ఆట ఆడుకుంటుంది.. ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు అని ప్రేమని అడిగితే మనిద్దరిని ఎవరు విడగొట్టలేరు ఇది మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలు అని ప్రేమ. అయితే నువ్వు వెంటనే నాకు సారీ చెప్పాలని ప్రేమ అనగానే సారీ చెప్తాడు. తర్వాత ప్రేమ ను తీసుకుని షాప్ కి వెళ్ళమని రామరాజు గెట్టిగా అరుస్తాడు.. వెళ్తున్నాను నాన్న అని ధీరజ్ అంటాడు.. నాన్న లక్ష రూపాయలు గురించి అడగడం నాకు చాలా భయమేసింది. నిజం చెప్తాను అని కంగారు పడిపోయాను. కానీ నేను అమ్మ రావడం వల్ల తప్పించుకున్నాను అని సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే నర్మద వచ్చి మావయ్య గారు లక్ష రూపాయల గురించి అడిగారు కదా నీకు అంత డబ్బులు ఏమి అవసరం వచ్చింది అని అడుగుతుంది. సాగరు మా ఫ్రెండ్ కి అవసరమైతే ఇచ్చాను వాడు ఇంకా నాకు ఇవ్వలేదు అది ఎలాగైనా సరే తీసుకొని నాన్నకు ఇస్తాను అని అంటాడు. నర్మదకు మాత్రం సాగర్ అబద్దం చెప్తున్నాడని అనుమానిస్తుంది. ప్రేమ ధీరజ్ లు ఇద్దరు కలిసి ఎంగేజ్మెంట్ రింగ్స్ కోసం షాప్ కు వెళ్తారు. ఇద్దరు గొడవ పడుతూ వెళ్తారు.. ఆఖరికి షాప్ లోకి వెళ్లిన తర్వాత కూడా ఉంగరాల కోసం కొట్టుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ తన పుట్టింటి నగలను పెట్టుకుని ఎంతో అందంగా అలంకరించుకుంటూ ఉంటుంది… మా అమ్మ చెప్పినట్లుగా నేను ఈ నగలతో ఎప్పుడు మహాలక్ష్మి లాగా సంతోషంగా ఉండాలి అని తెగ మురిసిపోతూ ఉంటుంది.. ప్రేమను నగల్లో చూసిన ధీరజ్ ఈ నగలు నా జీవితాన్ని మార్చేశాయి అంటూ తన జీవితంలో జరిగిన వాటిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేమతో ఆ నగలు నా జీవితాన్ని మార్చేశాయి నువ్వు ముందు ఆ నగల్ని తీసేయని అంటాడు.. ఆ మాట వినగానే ప్రేమ షాక్ అవుతుంది.. ఎవరైన భార్య నగలను పెట్టుకొని అందంగా రెడీ అయింది అంటే చూసి మురిసిపోతారు. కానీ నువ్వు మాత్రం ఆ నగలను తీసేయ్ అని అంటున్నావు నీకు కొంచమైనా ఉందా అని ప్రేమ తిడుతుంది..

Advertisement

ధీరజు ఆ నగలను చూస్తూ ఉంటే నాకు మాత్రం చాలా కోపంగా ఉంది ముందు నువ్వు ఆ నగల్ని తీసేస్తావా లేదా అని ప్రేమ పై సీరియస్ అవుతాడు. ఎందుకురా ఏమైంది అని అంటే ఆ నగల వల్ల నా జీవితం నాశనమైంది ఆ విషయం నువ్వు గుర్తుంచుకుంటే మంచిది అని ధీరజ్ అంటాడు. ఆ నగల కోసమే నేను నిన్ను ట్రాక్ చేసి పెళ్లి చేసుకున్నానని మీ వాళ్ళు నన్ను దారుణంగా అన్నారు. అంతే కాదు ఆ నగల వల్లే మా నాన్న ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని ధీరజ్ అంటాడు. ఆ నగల గురించి మా వాళ్ళు ఏం పట్టించుకోలేదు కదరా.. ఎందుకు నువ్వు ఇంతగా ఫీల్ అవుతున్నావు అని ప్రేమ ఎంత చెప్పినా సరే నువ్వు ముందు ఆ నగల్ని తీసేస్తావా లేదా అని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ ధీరజ్ మాట కాదనలేక నగలను తీసేస్తుంది.

శ్రీవల్లి ఈ బండ సచ్చినోడు వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను నాకు తల పగిలిపోతుంది అని ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చుని ఉంటుంది. చందు అక్కడికొచ్చి ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అక్కడ పిలుస్తున్నారు వినిపించట్లేదా అని అంటాడు. నాకు వీటిలో ఏ చీర కట్టుకోవాలో తెలియడం లేదు బావ అందుకే చూస్తున్నాను అని శ్రీవల్లి అంటుంది. కానీ నువ్వు ఈ మధ్య ఏదో విషయానికి టెన్షన్ పడిపోతున్నావు ఏం జరుగుతుంది అని అడుగుతాడు చందు. శ్రీవల్లి మాత్రం నాకేమీ జరగలేదు నువ్వేమీ టెన్షన్ పడొద్దు బాగానే ఉన్నాను అని అంటుంది. ఇలానే ఉంటే ఈయనకు నా మీద అనుమానం వచ్చేలా ఉంది నేను మారాలి అని ఆ చీరను తీసుకొని వెళ్లి కట్టుకొని వస్తుంది.

Advertisement

ఈ చీరలో నేను ఎలా ఉన్నాను బావ అని అడుగుతుంది.. చాలా అందంగా ఉన్నావు అని చందు అంటాడు.. ఇక తర్వాత కామాక్షి అమూల్యను రెడీ చేసి నువ్వేంటే అలా ఉన్నావు కొత్త పెళ్లికూతురు అంటే చాలా సంతోషంగా సిగ్గుపడుతూ ఉండాలి కదా అని అంటుంది.. నా ఎంగేజ్మెంట్ అప్పుడు నేను చేసిన పొరపాటు ఇదే కానీ అమ్మని కొట్టింది ఎలాగోలాగా నాకు పెళ్లి చేసి పంపించేశారు అని కామాక్షి అంటుంది.. అయితే వేదవతి నువ్వంటే మగరాయుల్లాగా పెరిగావు అది మాత్రం ఆడపిల్లలాగా పెరిగింది అందుకే భయపడుతుందిలే అని అంటుంది. ముందు అమూల్యని బయటికి తీసుకురా ఇలా చూస్తే దిష్టి తగులు ఎలా ఉంది దిష్టి తీస్తాను అని వేదవతి అంటుంది..

Also Read : సీరియల్లో హీరో.. సొంత ఇల్లు కూడా లేదా..? కన్నీళ్లు ఆగవు..!!

వేదవతి దిష్టి తీయగానే ఆ నీళ్ళని తిరుపతికి ఇచ్చి బయట పడేయమని చెప్తుంది.. తిరుపతి ప్రేమ విఫలమైతే ఇంత బాధ ఉంటుందా? నాకు చాలా బాధగా ఉంది అని అంటున్నాడు.. విషాద గీతాలను పాడుకుంటూ ఆ ఎర్రనీళ్లను తీసుకొచ్చి బయట వచ్చిన ఆనందరావు పైన పోస్తాడు.. అయ్యో ఇడ్లీ అన్నాయి నువ్వేంటి ఇలా వచ్చావు. నేను నీళ్లు పోసి దగ్గర నువ్వు ఎందుకు నిలబడ్డావు అని అంటాడు. మొత్తానికి భాగ్యం ఆనందరావు ఇంట్లోకి అడుగు పెట్టేస్తారు. ఇక సాగర్ నర్మదా రెడీ అవుతుంటే అక్కడికి వస్తాడు. మల్లెపూల వాసన వల్ల నర్మదా సాగర్ వచ్చాడని కనిపెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×