E-Paper
Advertisement

Adventure Thriller OTT : మెట్రో స్టేషన్ లో మతిపోగొట్టే డెడ్లీ డెత్ గేమ్స్… మెట్రో అంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

Adventure Thriller OTT : మెట్రో స్టేషన్ లో మతిపోగొట్టే డెడ్లీ డెత్ గేమ్స్… మెట్రో అంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ
Advertisement

Adventure Thriller OTT : కొరియన్ ఫాంటసీ సినిమాలంటే చెవి కోసుకునే అభిమానులు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా వాళ్ళ కోసమే. ఇందులో ఆడియన్స్ కి కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది. ఈ స్టోరీ ఒక నవల చుట్టూ తిరుగుతుంది. విచిత్రంగా నవలలో జరిగిన ఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంటాయి. ఈ ఆసక్తికరమైన ఫాంటసీ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

గత ఏడాది వచ్చిన ఈ కొరియన్ యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా పేరు ‘ఓమ్నిసైంట్ రీడర్: ది ప్రాఫసీ’ (Omniscient Reader: The Prophecy). దీనికి కిమ్ బైయుంగ్-వూ దర్శకత్వం వహించారు. ఇందులో అహ్న్ హ్యో-సియోప్, లీ మిన్-హో, ఛే సూ-బిన్, షిన్ సెయుంగ్-హో, నానా, క్వాన్ యున్-సియోంగ్ నటించారు. ఇది సింగ్ షాంగ్ రాసిన బెస్ట్ సెల్లింగ్ వెబ్ నవల ఓమ్నిసైంట్ రీడర్స్ వ్యూపాయింట్ నుండి తీసుకోబడింది. ఈ చిత్రం దక్షిణ కొరియాలో 2025 జూలై 23న విడుదలైంది. ప్రస్తుతం Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : రెక్కలతో పుట్టే బిడ్డ… ఆ తల్లి చేసిన పనికి కన్నీళ్ళు ఆగవు… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

స్టోరీలోకి వెళ్తే

కిమ్ డోక్-జా ఒక సాదాసీదా ఆఫీస్ ఉద్యోగి. అతనికి ‘త్రీ వేస్ టు సర్వైవ్ ఇన్ ఎ రూయిన్డ్ వరల్డ్’ అనే అంతగా పాపులర్ కాని ఒక నవల అంటే చాలా ఇష్టం. ఆ నవలను పదేళ్ల పాటు చదివిన ఏకైక వ్యక్తి కూడా అతనే. ఒకరోజు డోక్-జా ఆ నవల చివరి అధ్యాయాన్ని పూర్తి చేసిన వెంటనే, ఆ కథలోని సంఘటనలు నిజ జీవితంలో జరగడం మొదలవుతాయి. ఒక్కసారిగా ప్రపంచం వినాశనం వైపు వెళ్తుంది. నవలలో ఉన్న భయంకరమైన రాక్షసులు, వింత జీవులు భూమిపైకి వస్తాయి. డోక్-జా తన సహోద్యోగి యూ సాంగ్-ఆ తో కలిసి ఒక సబ్వే రైలులో చిక్కుకుపోతాడు. అక్కడ ఒక వింత జీవి మనుషులను చంపడానికి వస్తుంది.

Advertisement

ఈ ప్రపంచం ఎలా అంతమవుతుందో, ఎలాంటి సవాళ్లు వస్తాయో డోక్-జాకు ముందే తెలుసు. ఎందుకంటే అతను ఆ నవలను పూర్తిగా చదివాడు. తనకున్న ఈ ముందుచూపు తో అతను, అతని స్నేహితులు ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. ఇక నవలలోని అసలు హీరో యూ జూంగ్-హ్యుక్ ఎంట్రీ ఇస్తాడు. అతను చనిపోయినా మళ్ళీ పుట్టగల శక్తి ఉన్నవాడు. డోక్-జా అతనితో కలిసి ప్రపంచాన్ని కాపాడాలని నిర్ణయించుకుంటాడు. మరి వీళ్ళ ప్రయత్నం ఫలిస్తుందా ? వీళ్ళకు ఎలాంటి అవాంతరాలు వస్తాయి ? ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×