Horror Movie on ott : థియేటర్లలో పెద్ద సినిమాలు లేని సమయంలో హాలీవుడ్ నుంచి ఒక భయంకరమైన సర్‌ప్రైజ్ వచ్చేసింది. ‘అబ్సెషన్’ (Obsession 2026) అనే సైకలాజికల్ హారర్ చిత్రం తెలుగు ప్రేక్షకులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరినీ ఆకర్షిస్తోంది. ఇలా థియేటర్లలో దుమ్మురేపుతున్న ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి రాబోతోంది అనే ప్రచారం జోరుగా నడుస్తోంది. మరి ఆ వార్తల్లో నిజం ఎంత ? అన్నది చూడాల్సిందే.
బ్లాక్ బస్టర్ మూవీ ‘అబ్సెషన్’ కేవలం 1 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ రూపీస్ లో సుమారు 8.5 కోట్ల అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమైంది. ఈ చిత్రం 2026 మే 15న థియేటర్లలో విడుదలైంది. రిలీజైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి బాక్స్ ఆఫీసు వద్ద భారీ సునామీని సృష్టించింది. కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతదేశంలో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. హారర్ మాత్రమే కాదు సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో అదిరిపోతుంది మూవీ. కథలో ఒక వ్యక్తి తన ఆకర్షణ, వ్యామోహం వల్ల ఎలాంటి ప్రమాదాల్లో పడ్డాడు ? ఎంత దూరం వెళ్తాడు అనేది ఇందులో చాలా ఇంటెన్స్‌గా చూపించారు. మైఖేల్ జాన్‌స్టన్, ఇండే నవరెట్టే ప్రధాన పాత్రల్లో నటించగా, వాళ్ళ నటన సినిమాకు బలం చేకూర్చిందని చెప్పాలి. క్యాప్‌స్టోన్ పిక్చర్స్, టీ షాప్ ప్రొడక్షన్స్, బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం తక్కువ బడ్జెట్‌తో ఇంత పెద్ద వసూళ్లు సాధించడం హాలీవుడ్ లోనే ఓ గొప్ప విషయమని చెప్పాలి.
Also Read : ఈ సినిమాలలో వచ్చే ట్విస్టులు మీ ఊహకు కూడా అందవు… ఒక్కో ట్విస్ట్ కు పిచ్చెక్కిపోద్ది
జూన్ 2 నుంచి ఈ సినిమా డిజిటల్ వీక్షణకు అందుబాటులోకి రావచ్చని ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. PVOD (ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్) రూపంలో విడుదల అవుతుందని టాక్ నడుస్తోంది. అంటే రెంట్ బేసిస్ లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ మంచి వసూళ్లు సాధించడంతో నిర్మాతలు థియేట్రికల్ విండోను పొడిగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో విడుదలైన 17 రోజుల్లోనే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వెళ్లడం అన్నది అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ భారతదేశంలో మాత్రం థియేటర్లలో మరికొంత కాలం ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం సైకలాజికల్ హారర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ ట్రీట్ అవుతుంది. జూన్ 2 న డిజిటల్‌గా వచ్చే అవకాశం ఉన్నా… ఈ సినిమాను థియేటర్లో చూస్తే వచ్చే మజానే వేరు అనేది గుర్తు పెట్టుకోండి.
Also Read : అన్నయ్య జ్ఞాపకాలతో చెల్లెలు ప్రయాణం… ఫ్యామిలీ ఆడియన్స్ ను కన్నీళ్లు పెట్టిస్తున్న సినిమా